మహారాజ్ ఎంతో ప్రేమతో ’అల్లా ఆచ్చాకరేగా’ (భగవంతుడు అంతా సరి చేస్తాడు) అన్నారు…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీజై.

This Audio prepared by Mr Sri Ram

  1. మహారాజ్ ఎంతో ప్రేమతో 5:47

’తన చరిత్ర ను తానే వ్రాసికుంటాననీ, వ్రాస్తున్న హేమాఢ్ పంత్ కేవలం నిమిత్త మాత్రుడనీ’ సాయి స్వయంగా చెప్పారు. సాయి కృప ను పొందిన వారే శ్రీ సాయి సఛ్ఛరిత్రలో చోటు సంపాదించుకున్నారు.

కాకాపోతే సద్గురు మహరాజ్ షిరిడీ లో నివసించిన అరవై సంవత్సరాల సుధీర్ఘ ప్రస్తానంలో కొన్ని లక్షలమంది వారిని దర్శించుకుని వుంటారు.

కానీ వారి కృపా కటాక్ష వీక్షణాల వలన మాత్రమే వ్యక్తులతో పాటుగా కొన్ని జంతువులు కూడా శ్రీ సాయి సఛ్ఛరిత్ర లో చోటుని పొందాయి. అయితే గ్రంధ పరిమితి భీతి వలన కావచ్చు, సాయి ఆదేశమే కావచ్చు శ్రీ సాయి సఛ్ఛరిత్ర లో ఆణిముత్యాల వంటి భక్తుల గురించి కేవలం స్పృశించి వదిలివేయడం జరిగింది.

అళంది స్వామి, కేప్టేన్ హాటే, చాంద్ బాయి పాటిల్, మద్రాసు భజన సమాజం వారు, నిశ్ఛల దాసు, మహీపతి మహరాజ్ – ఇలా చాలా మందిని గురించిన ప్రస్తావన శ్రీ సాయి సఛ్ఛరిత్రలో కేవలం నామ మాత్రం గానే కనిపిస్తుంది.

సద్గురు మహరాజ్ ప్రేరణతో సాయి పుణ్యతిధి మహా శతాబ్ది ఉత్సవ వేడుకలు మరో ఏడాదిలో ప్రారంభమువుతున్న నేపధ్యంలో ప్రతిమాసమూ శ్రీ సాయి సఛ్ఛరిత్రలో నామ మాత్రంగా ప్రస్తావించబడిన భక్తులు ఒక్కొక్కరి గురించి తెలిసికోవడానికి చేసే చిన్న ప్రయత్నమిది.

ఈ సేకరణ శ్రీమతి విన్నీ చిట్లూరి, షిరిడీ, శ్రీమతి శ్రేయా నాగరాజ్, పూనా మరియూ www.saiamrithadhara.com ల సహకారం వలనే సాధ్యపడింది.

అళంది స్వామి:

ముందుగా అళంది స్వామి ని గురించి తెలిసికుందాము. వీరికి సంబంధించిన లీలని మనం శ్రీ సాయి సఛ్ఛరిత్ర పదమూడవ అధ్యాయంలో చదువుకుంటాము. శ్రీ అళంది స్వామి అసలు పేరు శ్రీ పద్మనాభేంద్ర స్వామి.

శ్రీ అళంది స్వామి స్వయంగా ఆ లీలను గురించి సవివరంగా 1923 లో శ్రీ సాయిలీల పత్రికలో వివరించారు. ఆ వివరాలను వారి మాటల్లోనే చదువుకుందాము.

’ముంబాయి నివాసి శ్రీ మాన్ హరి సీతారాం దీక్షిత్ సలహాతో నేను షిరిడి వెళ్ళాను.

సాయి కృపవలన షిరిడీలో సాయి దర్శనంలో నేను అపరిమితమైన ఆనందాన్ననుభవించి జనవరి 29న గురువారం నాడు ముంబాయి తిరిగి వచ్చిన వెంటనే ఫిబ్రవరి 2వ తేదీన అళందిలో జరిగే పూజ్యశ్రీ తుకారం మహారాజ్ వారి పుణ్యతిధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్ళి తిరిగి మంగళవారం నాటికి నేను తిరిగి ముంబాయి చేరుకున్నాను.

అక్కడ నేను డాక్టర్ అండర్ వుడ్ దగ్గరకు మెడవరకు వ్యాపించిన నా చెవి నొప్పిని గురించి వైద్యం కోసం వెళ్లాను. ’ఆపరేషన్ అవుసరమెంతమాత్రమూ లేదు’ అంటూ ఒక ఇంజేక్షన్ ఇచ్చి ’దీనివలన మీ నొప్పి సంపూర్ణంగా తొలిగిపోతుంది’ అన్నారు.

మెరుపులీనే సాయి దైవత్వాన్ని గురించి వర్ణించడమెవరి తరం?

దర్శన మాత్రాన కలిగే అనుభవాలు అత్యద్భుతాలు. నా మనసుకి సంపూర్ణమైన ప్రశాంతత లభించింది.

సాయి ని దర్శించడానికి షిరిడీకి పోయినప్పుడు అక్కడ వారి దర్శనం కోసం వేచిచూస్తున్న ఎందరో నా చెవి నొప్పి గురించి వారికి చెప్పుకోవల్సిందిగా సూచించారు.

మనసా వాచా కూడా నేను వారి దర్శనాన్నే కోరుకున్నాను కానీ, మరేవిధమైన ప్రాపంచిక మైన కోరికలు కోరాలని వారి వద్దకు  రాలేదు.

నా ప్రారబ్ద కర్మలను నేనే అనుభవించాలనే భావన నాది. చివరికి మాధవరావు దేశ్ పాండే (శామా) కి నా చెవి సమస్య బాబా కి విన్నవించ వలసిందిగా కోరాను.

నేను దర్శనం చేసికుంటూ వుండగా శామా ఆ విషయాన్ని ప్రస్తావించాడు. మహారాజ్ ఎంతో ప్రేమతో ’అల్లా ఆచ్చాకరేగా’ (భగవంతుడు అంతా సరి చేస్తాడు) అన్నారు.

ఆ క్షణంలోని ఆందోళన భరితమైన నా మనసు కుదుట  పడింది.

నాగపూర్ లోని వైద్యుడూ మరియూ ఆళంది లోనీ వైద్యుడు ఇద్దరూ కూడా నా చెవి నొప్పికి ఆపరేషన్ అవుసరమని చెప్పారు.

నేను షిరిడీకి వెళ్ళేముందు వారిని సంప్రదించాను. కానీ ఈ ముంబయి వైద్యుడు అండర్ వుడ్ అసలు ఆపరేషన్ అవుసరమే లేదంటున్నాడు.

ఒక ఇంజక్షను మాత్రము ఇచ్చాడు. వాపు తగ్గడమే కాకుండా నొప్పి పూర్తిగా నయమైంది.

ఇదంతా కూడా శ్రీ సాయి మహరాజ్ ’అల్లా అఛ్ఛాకరేగా’ ఆన్న తర్వాత జరిగింది.

ఇది తలుచుకుంటుంటే నాకు ఆశ్చర్యమూ, ఆనందమూ కలుగుతున్నాయి.

నేను దర్శనానికి వెళ్ళిన తొలిరోజున బాబా నన్ను దక్షిణ అడిగారు. ’మహారాజ్! నేను ఒక సన్యాసిని, నా దగ్గర సొమ్ము ఏముంటుంది’ అన్నాను.

ఆ తరువాత నేను దర్శనం చేసికున్నాను. బాబా మాధవ రావు  దేశ్ పాండే (శామా) తో ’స్వామీ మలా కాహీ కా పాహిలే పరంతూ హే కహీ దేణార్ నాహీత్! తే మజకడే ఆలే ఆహేత్! తేవ్హా మలాచ్ త్యాంనా దిలే పాహిజే!’

(ఈ స్వామి నాకు దక్షిణ ఇవ్వగలడేమొనని ఆదిగాను. అతను ఏమీ ఇవ్వలేక పొయాడు. అతను నా దగ్గరకు వచ్చాడు కనుక నేనే అతనికి ఏమైనా ఇవ్వాలి) అన్నారు.

పై వాక్యాలు  బాబా పలికిన మరుక్షణం నుండీ నా బాధలన్నీ తొలిగిపోయాయి. ఈ సిద్ధపురుషుని గురించి మరింకేమి చెప్పగలను నేను? మానవ రూపంలో వెలిసిన నారాయణుడని తప్ప.”

(శ్రీ సాయిలీల అయిదవ సంచిక, ప్రధమ సంపుటి, 1923).

(శ్రీమతి విన్నీ చిట్లూరి సంకలీకరించిన ’బాబాస్ వాణి’ నుండి)

సేకరణ: సాయి పాద ధూళి చాగంటి సాయిబాబా, ఒడిషా

9437366086, 8270077374
Whatsapp 7077339935

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “మహారాజ్ ఎంతో ప్రేమతో ’అల్లా ఆచ్చాకరేగా’ (భగవంతుడు అంతా సరి చేస్తాడు) అన్నారు…Audio

http://saileelas.com/m/sounds/view/03-chapterMp3
03 chapterMp3
శ్రీ సాయి సచ్చరిత్రము… తెలుగు OVI TO OVI ….మూడవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ అన్నాసాహెబ్ దాభోల్కర్ …. తెలుగు అనువాదం కుమారి మణెమ్మ ….. ధ్వని అనుకరణ శ్రీ శ్రీనివాస ప్రసాద్

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles