Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు పద్మజ, మేము విశాఖపట్నం మాధవదారలో ఉంటాము. నేను ఒక గృహిణిని.
నాకు మొట్టమొదట శిరిడి సాయిబాబా పరిచయం ఎప్పుడు జరిగిందంటే ప్రత్యేకించి చెప్పలేను.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆస్తిక వాతావరణం లోనే నేను పెరిగాను కాబట్టి. చాలా మంది మహాత్ముల గురించి, బాబాల గురించి వింటూనే పెరిగాను. అందులో భాగంగానే శిరిడి సాయిబాబా గురించి కూడా విని ఉంటాను.
అందులో భాగంగానే శిరిడి సాయిబాబా గురించి కూడా విని ఉంటాను. కానీ అప్పుడు నాకు ప్రత్యేకంగా భగవంతుడి గురించి కానీ, మహాత్ముల గురించి కానీ తెలుసుకోవాలని, పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.
ఆ సమయంలో మనకున్న వనరులతో కానీ, ఈ తెలివితేటలతో కానీ, మన చుట్టూ ఉన్న ఆర్తుల అవసరాలు తీర్చవచ్చు కదా! అని అనిపించేది.
కానీ తరువాత నాకు ఆరోగ్య సమస్యలు వచ్చి, ఏమీ చెయ్యలేని పరిస్థితి వచ్చింది.
శారీరకంగా పూర్తి ఆసక్తితో ఉన్న పరిస్థితులలో అసలు ఈ సృష్టి తత్వమేమిటి? భగవంతుడి లీలలేమిటి? ఇందులో మనిషికి ఉన్న పరిమితులు ఏమిటి? అని తీవ్రంగా మనసులో మధన పడుతూండడం జరుగుతుండేది.
అప్పట్లో పుట్టపర్తి సత్య సాయిబాబా గారు ప్రాచుర్యంలో ఉన్నారు. ఆయనను భగవంతుడిగా ఆరాధించే కొంత మంది నా శ్రేయోభిలాషులు నా ఆరోగ్యం కోసం భజనలు చేస్తుండేవారు.
ఆ క్రమంలో పుట్టపర్తి సత్య సాయిబాబా గురించి తెలుసుకునేటప్పుడు శిరిడి సాయిబాబా అయన పూర్వ అవతారంగా పరిచయం అయింది.
అప్పటికి అయన గురించి అంతే తెలుసు. తరువాత రెండు మూడు సార్లు పుట్టపర్తి వెళ్లి దర్శనం చేసుకున్నాను.
అయన భోదలు విన్నాను, చదివాను. కొంతవరకూ సందేహాలు తీరుతుండేవి, మళ్ళీ కొన్ని కొత్త కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తూ ఉండేవి.
ఆ తరువాత నా ఆరోగ్యం కొంత మెరుగవ్వటం జరిగింది. వివాహం అయిన తరువాత విశాఖపట్నం రావటం జరిగింది.
తరువాత కొంత కాలానికి మా వారి స్నేహితులతో కలిసి శిరిడి యాత్రకి వెళ్లి రావటం జరిగింది. అప్పుడు కూడా అయన ఒక మహాత్ముడనే ఉద్దేశ్యం మాత్రమే కానీ, అంతకంటే ఎక్కువగా ఏమీ తెలియదు.
ఆ తరువాత కొంత కాలానికి మా ఇంటి దగ్గరలో శిరిడి సాయిబాబా మందిరం నిర్మించారు. నాకు మామూలుగా దేవాలయ దర్శనం కానీ, ఇంట్లో పూజలు చేయడం కానీ అలవాటు లేదు.
సర్వాంతర్యామి అయిన భగవంతుడ్ని ఒక చిత్ర పటానికో, ఒక విగ్రహానికో పరిమితం చేయటం అర్థం అయ్యేది కాదు. ఆ కారణం చేతనే వాటి జోలికి వెళ్లేదాన్ని కాను.
కానీ మనసులో మాత్రం నిరంతరం భగవంతుడి గురించిన చింత జరుగుతూ ఉండేది. ఆ సమయంలోనే మాకు దగ్గర బంధువుల ద్వారా శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు రచించిన ” శ్రీ సాయి లీలామృతం ” అనే పారాయణ గ్రంథం నా దగ్గరకి చేరింది.
ఆ గ్రంథాన్ని కూడా మామూలు పుస్తకం లాగానే చదివాను. శిరిడి సాయి గురించి కొంత అవగాహన వచ్చింది. కానీ ప్రత్యేకంగా పారాయణ అయితే చేయలేదు.
ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కొంత సమయంలో కొన్ని అధ్యాయాలు ఆలా చదువుతూ ఉండేదాన్ని, ఆ క్రమంలోనే నాకు తెలియకుండానే అదొక అలవాటుగా మారింది.
ఈ లోపు మా ఇంటి దగ్గరలో సాయిబాబా మందిరం నిర్మించడానికి పెద్దలు సంకల్పించారు. ఆ మందిరం నిర్మాణం జరుగుతుండగానే అక్కడ ప్రతి గురువారం కొంత మంది సాయి భక్తులచే సత్సంగం, భజన జరుగుతూండేవి.
నేను వాటికీ హాజరవుతూ ఉండేదాన్ని. దానితో పాటు ఇంకా కొన్ని సాయిబాబా గురించిన గ్రంథములు చదవటం జరిగింది.
ఆలా మందిర నిర్మాణం పూర్తి అయ్యేటప్పటికి, నాకు శిరిడి సాయిబాబా గురించి ఒక అవగాహన రావటం, అసలు అంతా సాయి మాయం అనుకునే స్థాయికి వచ్చింది.
అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా ఒక పధకం ప్రకారం శ్రీ సాయి యే ఇది అంతా జరిపించారా అనుకునేంతగా నేను బాబా మార్గం లోకి ప్రవేశించటం జరిగింది.
The above telugu TEXT typed by : Mr Sai Krishna (Active Devotee of Baba)
Latest Miracles:
- కష్టాలలో ఆదుకొనే శ్రీ శిరిడి సాయినాధుడు
- రక్షమాం శరణు తండ్రి, నన్ను రుణబాధనుండి విముక్తి చేయమని మాత్రమే ప్రా ర్దించినాను–Audio
- భక్తురాలిని క్షణకాలంలో ఆరోగ్యవంతురాలిగా చేసిన బాబా వారు
- బాబా మహిమ – సరస్వతి కటాక్షం
- కొత్త దంపతులకు షిరిడీ ద్వారకామాయి లో బాబా వారు చేసిన లీల….
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments