Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు
శ్రీ సాయి 1918 దసరా ప౦డుగకు ము౦దు, చ౦ద్రాబాయి వచ్చి౦దా అని తరచుగా, అడుగుచు౦డగా, ఒకరోజు ఆమెకు కాకా దీక్షిత్, బాబా ఆరోగ్యం చాలా వేగంగా దిగజారిపోతూ ఉందని, బాబా పదే పదే ఆమె గురించే ఆలోచిస్తూ ఉన్నారనే జాబు వ్రాసి పిలిపి౦చారు. ఆమె వె౦ఠనే శిరిడీ వచ్చి సాయి అస్వస్థత చూసి దు:ఖాన్ని ఆపుకోలేక సాయి ము౦దు ఏడ్చింది సాయి దయ గల, ప్రేమపూరిత చూపులతో, బాయి! ఏడ్వవద్దు. నేను ఎప్పుడు నీతోనే ఉ౦టాను. అని ఒక పన్ను నోటి ను౦డి తీసి ఆవిడకు ఇచ్చారు. ఆ పన్నును ఆమె తాయెత్తుగా ధరి౦చారు.
బాబా ఆఖరి క్షణాలలో బాబా కు కాస్త మంచినీళ్ళు ఇచ్చే భాగ్యం కలిగింది ఆమెకు. అక్కడే ఉన్న నిమోన్ కర్ కు కూడా ఆభాగ్యం లభించింది. ఆ తరువాత బాబా బయ్యాజీ భుజం మీద వాలిపోయి సమాధి చెందారు.
చ౦ద్రాబాయికి 48స౦”ల వరకూ స౦తాన౦ కలుగలేదు. బాబా 1918 సం. లో ఒకసారి ’తల్లీ, నీకేమి కావాలి? అన్నారు. చ౦ద్రాబాయి ’ మీకు తెలుసు! అ౦ది. ఆయన సరేనన్నారు. తర్వాత ఆమెకు 3స౦” లకు ఋతుక్రమ౦ ఆగిపోయి౦ది. కొన్ని నెలల తరువాత డాక్టరు ఆమెను పరీక్షి౦చి కడుపులో గడ్డ వు౦దని, ఆ వయసులో ఇక గర్భ౦ అవదని, అది వ్రణమని వైద్యులు శస్త్ర చికిత్స అవసరమన్నారు. కానీ ఆవిడ పదినెలల వరకూ చేయి౦చుకోనని, పట్టుబట్టారు. చిత్ర౦గా తుదకు సకాల౦లో బాబా సమాది చెందిన మూడు సంవత్సరాల రెండు రుజులకు 1921 సం. సుఖ ప్రసవమై౦ది. ప౦డ౦టి కుమారుని చూసి బాబా ప్రసాదమని ఆమె ఆన౦దపడి౦ది. ప్రసవ సమయమప్పుడు డాక్టరు గాని , నర్సు గని ఎవ్వరు లేరు. ఆవిడా ఎలాంటి మందులు కూడా వాడలేదు. ప్రసవమయ్యే రోజు కూడా ముములుగానే పనులన్నీ చేసుకున్నారు. బిడ్డ గర్బంలో ఉన్న 9 నెలలు పాటు పెద్ద గా ఆహారం తీసుకొనే వారు కాదట. తరచూ ఊధిని మాత్రమే నీళ్ళలో కలుపుకొని త్రాగేవారట. అంతటి విశ్వాసం ఆమెకు సాయి పట్ల.
1921 సం. లో రామచంద్ర బోర్కర్ రైల్వే డిపార్టుమెంటు లో పని చేస్తూ ఉండేవారు. అతనికి పండరిపూర్ నుండి నాసిక్ కి మన్మాడ్ కు మద్య ఉండే అసవాలి కి బదిలీ అయ్యారు. బోర్కర్ కుటుంబం రైల్వే స్టేషన్ దగ్గరలో ఉండే రైల్వే క్వార్టర్స్ లో ఉంటుండేవారు.
ఒక సాయంత్రం బోర్కర్ పని నుండి తిరిగి వచ్చేటప్పుడు జ్వరంతో వచ్చారు. మూడు, నాలుగు దుప్పట్లు కప్పుకున్నప్పటికి ఒనికి పోసాగారు. అంతలా జ్వరం వచ్చింది. అసవాలి చిన్న గ్రామం అందువలన వైద్యుడు దొరకలేదు. అతని బార్య శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ ఇంటిలోనే మందు తయార్ చేసి ఇచ్చింది. దానితో అతడు జ్వరంతో వణుకుతున్నప్పటికి రాత్రి బాగా నిద్రపోయారు. చంద్రాబాయి బాగా అలసిపోయి భర్త పాదాల చెంత నిద్రపోయింది. కలలో బాబా కన్పించి “సోదరి భాధపదవద్దు. ఉదీ రాయు అతడికి నయమవుతుంది. కానీ రేపు ఉదయం 11 గం. ల వరకు బయటకి పోనివ్వవద్దు.” అని చెప్పారు.
చంద్రాబాయి లేచి బాబా చెప్పినట్లు గానే తన భర్త శరీరమంతా ఉది రాసింది. వెంటనే అతని శరీర ఉష్ణోగ్రత తగ్గింది. ఉదయం లేచేసరికి పూర్తీ ఆరోగ్యంగా ఉన్నారు బోర్కర్. చంద్రాబాయి భర్తతో బయటకి ఎక్కడికి వెళ్ళవద్దని, ఆ రోజంతా విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కానీ బోర్కర్ ఆమె మాట పట్టించుకోకుండా అల్ఫాహారం తీసుకోని రైల్వే స్టేషన్ కి వెళ్లారు.
అక్కడినుండి బోర్కర్ తన ఇంటి కిటికీ నుండి కనిపించే రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. ఇంట్లో ఉన్న చంద్రాబాయి కిటికీ నుండి తన భర్తనే గమనిస్తూ సాయి ని తన భర్తని రక్షించమని ప్రర్దిస్తువుంది. ఇంతలో ఆ ట్రాక్ పై రైల్వే కి చెందినా వేరొక వ్యక్తీ బోర్కర్ కి కలిసారు. ట్రాక్ పై వారిద్దరూ స్టేషన్ నుండి వస్తున్నా రైలు గమనించకుండా మాట్లాడుకుంటున్నారు. అకస్మాత్తుగా రైలు బోర్కర్ ను ప్రక్క ట్రాక్ పైకి విసిరేసింది. అతని కాలు ఎముక విరిగింది. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్న చంద్రాబాయి ‘ఓ బాబా’ అంటూ స్పృహతప్పి పడిపోయారు. ప్రక్క ఇంటి వారు ఆమె మొఖం పై నీళ్ళు చల్లక స్ప్రుహవచ్చింది.
బోర్కరుని స్త్రేట్చేర్ పై ఇంటికి తీసుకు వచ్చారు. ఆ ఊరిలో వైద్యుడు అందుబాటులో లేకపోవడం చేత ఇంటిలోనే చంద్రాబాయి ఆయుర్వేద ఔషదాలతో ఒక మందు తయారుచేసి దానిలో ఉదీ కలిపి ఆ పేస్టు తన భర్త కాలికి పూసి కట్టుకట్టారు. బోర్కర్ స్ప్రుహరాగానే “ఇంటిలో ఎవరైన పకీర్ ఉన్నారా?” అని అడిగారు. అప్పుడు చంద్రాబాయి “నాకు ఎవరు కనిపించట్లేదు కానీ మీరు చూడగలిగితే చూడగలరు అతను వేరెవరు కదా నేను పూజించే సాయి”. మరుసటి రోజు మన్మాడు నుండి ఒక డాక్టర్ వచ్చి ముందటి రాత్రి చంద్రాబాయి కట్టిన కట్టు, పేస్టూ తీసివేసి ప్లాస్టర్ కట్టుకట్టారు. ఆ కట్టు బోర్కర్ కు విపరీతమైన భాధ కలిగించింది. రాత్రి ఆ భాధ రెండింతలైంది. ఆ రాత్రి చంద్రాబాయి కి సాయిబాబా కనిపించారు. వెంటనే ఆమె లేచి పవిత్రమైన సాయిబాబా పాదాలపై శిరస్సు వుంచి నమష్కరించింది. అప్పుడు సాయి “నీవు ఆ కాలుని తిసివేయలనుకుంటున్నావా? వెంటనే ఆ డాక్టర్ కట్టిన కట్టు టిసివేసి, గోధుమపిండి, కొబ్బరి నూనె, ఉధి కలిపి నీ భర్త కాళుకి పూయము” అని చెప్పారు. ఆమె సాయి చెప్పినట్లే చేసారు. సాయి మాట, ఉధి ప్రభావం వలన బోర్కర్ కు అతి కొద్ది రోజులలో పూర్తిగా నయమైంది. అది చూసి డాక్టర్స్ ఆశ్చర్యపోయారు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ మొదటి భాగం–Audio
- శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ రెండవ భాగం–Audio
- శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ నాల్గవ భాగం–Audio
- చివరి తోడు…..సాయి@366 నవంబర్ 22….Audio
- బాబాను దర్శించిన తెలుగు భక్తులు – మూడవ భాగం—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments