Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
కుటుంబంలో అందరూ సాయి భక్తులు కానక్కరలేదు. భక్తులు కానివారి వైపు కూడా సాయి కరుణా వీచికలు వీస్తాయి.
చంద్రాబాయి బోర్కరు భర్త రామచంద్ర. ఆయన ఇంజినీరు. సాయి భక్తుడు కాదు. అయినా చంద్రాబాయి షిరిడీకి వెళ్ళి సాయిని దర్శిస్తే ఎప్పుడూ కాదనలేదు రామచంద్ర.
ఒకసారి రాంచంద్ర కాలు విరిగింది. ఆ సమయంలో చంద్రాబాయి భర్తకు వైద్యం చేయించింది. సాయి ఆమెకు స్వప్నంలో కనిపించి ఏ మందు వాడాలో చెప్పారు.
రామచంద్ర సాయి చెప్పిన వైద్యాన్ని చేయించుకున్నాడు. కాలు అతికింది. అలా కాకుండా వేరే వైద్యాన్ని చేయిస్తే, కాలు తీసివేయ వలసిన పరిస్థితి ఏర్పడేది. ఈ సంగతిని రామచంద్ర గ్రహించాడు. అది చాలు.
చంద్రాబాయి ధైర్యస్తురాలు. 1934లో ఆమె చాతుర్మాస్యం పాటిస్తోంది. సాయి ఆమెకు స్వప్నంలో కనిపించాడు. ”భయపడవద్దు. శ్రీరాముడిని (ఆమె భర్తని) తీసుకొని వెళ్తాను” అన్నాడు.
ఆమె భయపడ లేదు, విలపించ లేదు. ఆమె పతివ్రత. ఆ నిద్రలోనే సాయితో ఆమె ”నన్నే ముందు తీసుకు వెళ్ళు, బాబా” అంది. సాయి అంగీకరించలేదు.
చంద్రాబాయి చేయవలసిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని అందు వలన ఆమెను ప్రస్తుతం తీసుకు వెళ్ళటం కుదరదు అన్నాడు. స్వప్నం అంతరించింది. ఆ కలను గూర్చి భర్తకు చెప్పింది. రామచంద్రుడు అది కలే కదా అన్నాడు.
రామచంద్రునకు మూత్రపిండల వ్యాధి వచ్చింది. జబ్బు తీవ్రమైంది. ఇక తన అవసాన కాలం సమీపించిందని గ్రహించి, చాతుర్మాస్యం అయిన తరువాత చనిపోవాలనే కోరిక బలంగా ఉందని భార్యతో చెప్పాడు.
తన భర్తను, ఆయన కోరికను తీర్చమని సాయిని ప్రార్ధించింది. సాయి కాదనగలడా! చాతుర్మాస్యం ముగిసింది. కార్తీక పౌర్ణిమ వచ్చింది. ఆ రోజు రాత్రి ఆయన సాయిబాబాకు ఆరతి ఇమ్మన్నారు భార్యను.
ఇంకా విష్ణుసహస్రనామం పెద్దగా చదవమని కోరాడు. తెల్లవారింది. డాక్టరు, రామచంద్రుడు కోలుకుంటాడని చెప్పి వెళ్ళాడు.
కానీ ఆమెకు తెలుసు. భార్య ఇచ్చిన నీటిని త్రాగి ‘శ్రీరాం, శ్రీరాం’ అన్నాడు. ‘శ్రీరాం, శ్రీరాం’ అంటూ భగవంతుని, సాయిని స్మరిస్తూ ప్రాణాలు విడిచాడు.
ఆ దినం నవంబరు 22, 1934.
సాయికి భక్తుడు, అయినా కాకున్నా
చివరి తోడుగా సాయి ఉంటాడు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ‘‘భయం నా గురించి కాదు, తాత్యా గురించి”
- సాయి లెక్క తప్పదు!…..సాయి@366 నవంబర్ 2…Audio
- నీవే నా తోడు నీడ …..సాయి@366 జనవరి 16….Audio
- సాయి నాణెము …..సాయి@366 జూలై 31…Audio
- పట్టించుకోవటం లేదు…..సాయి@366 నవంబర్ 14….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “చివరి తోడు…..సాయి@366 నవంబర్ 22….Audio”
Padma Chandrashekar
November 24, 2019 at 10:55 amAUM Sai Ram 🙏🙏🕉️