Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
‘ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్ను హింసించిన వారవుతారు” అన్నాడు సాయిబాబా. సాయి గాని ఇతరు సత్పురుషులు గాని పరుల మనుస్సును కష్టపెట్టవద్దనే వారే.
ఇతరులను నొప్పించకపోవటమే కాదు, అవకాశం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీయకుండుటే సాయి తన భక్తుల నుండి ఆశించేది.
ఒకసారి నాచ్నే తన కుటుంబంతో సాఠే వాడాలో బస చేస్తున్నాడు. నాచ్నే అత్తగారు వంటకు ఉల్లిపాయలు తరుగుతోంది. అది చూచిన దాదా కేల్కర్ అనే సాయి భక్తునకు కోపం వచ్చింది.
ఆయన సనాతన బ్రాహ్మణుడు. ఉల్లి, వెల్లుల్లి ముట్టడు. కేల్కర్, నాచ్నే అత్తగారిని దూషించాడు. ఆమె చాలా నొచ్చుకున్నది.
ఒకసారి కేల్కర్ మనుమరాలి కంటికి నొప్పి వచ్చింది. వెంటనే ఆయన బాబా వద్దకు వెళ్ళి నొప్పిని తగ్గింపుమని వేడుకున్నాడు. ”ఉల్లిపాయలతో కాపడం పెట్టు” అన్నారు సాయి.
”ఉల్లిపాయలను ఇప్పుడు నేను ఎక్కడ నుండి తెచ్చేది” అన్నాడు కేల్కర్. అప్పుడు అక్కడే ఉన్న నాచ్నే అత్తగారిని చూపుతూ ”ఈ తల్లిని అడుగు ఇస్తుంది” అన్నారు సాయి.
తన మనవరాలి కోసం ఉల్లిపాయలను ఆమెను ఇవ్వమని కోరాడు. సాయి ఇమ్మంటే ఇస్తానన్నది ఆమె. సాయి ఇవ్వమన్నారు. ఆమె ఇచ్చింది.
దెబ్బకు దెబ్బ తీయకూడదు – ఇంక చెడుకు కూడా మంచే చేయాలని సాయి బోధను ఆమె పాటించింది.
సాయి మహా సమాధి చెందాడు.
కుమారి నీలిమా సాంగ్లేకరు పూనాలో ఉద్యోగిని. ఆమె దీపావళికి (సామాన్యంగా నవంబరు మాసంలో వస్తుంది) షిరిడీ వెళ్ళింది.
వసతి దొరకలేదు. మరునాడు కాని దొరకదు. మహిళలున్న శాంతి నివాస్ 30వ గదికి వెళ్ళి ఆ పూట తనను అక్కడ ఉండనివ్వండని కోరింది.
తమ మగవారు వస్తారని, కావున గదిలో ఉండటానికి వీలులేదన్నారు ఆ గదిలోని మహిళలు.
ఆ రాత్రి ఎలాగో గడిపింది ఆమె. మరునాడు ఆమెకు మహిళల ఉమ్మడి గదిని కేటాయించారు. ఆమె అందులో ఉంది.
ఈలోగా రద్దీ ఎక్కువ అవటం వలన ఆ ఇద్దరు మహిళలు బిక్కచచ్చి కుమారి నీలిమా సాంగ్లేకర్ గదికే రావటం జరిగింది.
నీలిమ ఆ ఇద్దరు మహిళలను సూటిపోటి మాటలనలేదు. గౌరవంగా వారిని ఆహ్వానించింది.
అది సాయి కోరిన క్షమా గుణం.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మొదటి మాసికము…..సాయి@366 నవంబర్ 13….Audio
- సాయి! కన్నులలో నీరెందులకు?…..సాయి@366 నవంబర్ 1….Audio
- చిన్ని నా బొజ్జకు …..సాయి@366 డిసెంబర్ 17….Audio
- బాబా నన్ను క్రింద పడకుండా పట్టు కున్నారు….Audio
- నామ స్మరణ…..సాయి@366 మార్చి 31….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments