నామ స్మరణ…..సాయి@366 మార్చి 31….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


”మహాదేవుడైన శంకరుడు హాలాహలము తాగి వ్యాకులుడైనప్పుడు రామ నామమును మనసారా స్మరించుటచేతనే, ఆ కష్టము తొలగెను” అని సమర్ధ రామదాసు తన ”దాస బోధలో” వివరించారు.

ఇంకా ఆయన ”పరమాత్ముడగు హరి నామము జపించి ప్రహ్లాదుడు తండ్రి బెట్టు పలు కడగండ్ల నుండి బ్రతికెను” అని నామ ప్రాశస్త్యాన్ని అనేక ఉదాహరణలతో తెలిపారు.

ఇక సాయి సాహిత్యంలో నవవిధ భక్తులను ఆశ్రయించి కృతకృత్యుయిన వారెందరో – అందులో ఒక సంఘటన, ఆ రోజు 31 మార్చి, 1915. ఇది నాచ్నే మనసులో ముద్రించుకొనిపోయిన పర్వదినం.

ఆనాడు ఆయన శాంతారాం మోరేశ్వరఫాన్సే ఇంకా మరి కొందరితో ప్రయాణం చేస్తున్నాడు దట్టమైన అడవి గుండా. అదీ ఎడ్ల బండి పైన.

రహదారి కూడా ఎత్తు పల్లాలతో కనుమ గుండా పోతోంది. వారు పాన్‌ష్‌ట్ కనుమ వద్దకు వచ్చారు.

అక్కడ పెద్ద పులులు ఉంటాయి కూడ. ఒక చోట భయంతో ఎద్దులు వెనుకకు నడవసాగాయి. అది ఇరుకు దారి. బండి ఏ మాత్రం ప్రక్కకు కాస్త ఒరిగినా అందరూ లోయలోనే పడతారు.

ఎద్దులు ఎందుకు వెనకకు పోతున్నాయో శాంతారాం చూచాడు. ఎదురుగా భయంకరంగా పెద్ద పులి పడుకుని బండిలోని వారివైపు చూస్తోంది.

పైగా దాని కనులు చీకిలో మెరవసాగాయి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుంది వారి పరిస్థితి.

బండి వెనకకు వెళ్ళి లోయలో పడకుండా పెద్ద రాయిని పెట్టేందుకు దిగుదామని శాంతారాం అనుకున్నాడు.

వెంటనే సాయి భక్తుడైన నాచ్నే ”జై సాయిబాబా! పరుగు పరుగున వచ్చి మమ్మల్ని ఈ ఆపద నుండి కాపాడు” అని అరిచాడు. బండిలోని వారంతా కూడా ”జై సాయిబాబా!” అని పెద్దగా అరచారు.

సాయి నామం సాయి చెవులకు సోకింది. ఆ అరుపులు విని సాయి ఊరుకుంటాడా! ఇక పులికి భయం వేసి బండి పక్కనుండే పరుగు పరుగున పారిపోయింది. వారు ఆ గండం నుండి బయటపడ్డారు సాయి నామ స్మరణ చేసి.

ఏనుగులచే తొక్కించినా ఏమీ కాలేదు అలనాటి ప్రహ్లాదునకు.

నాచ్నే, తదితరులకు అడవిలో అర్ధ రాత్రి పులి వలన ప్రాణ హాని కలుగలేదు. ఇదే సాయి నామ మహిమ. ఏ కాలమందైనా, ఏ సమయమందైనా సాయిని స్మరించెదము గాక.

నేు మార్చి 31, నాటి నేచ్నేను కాపాడినట్లు సాయి నామము మనలను కూ డా కాపాడు గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “నామ స్మరణ…..సాయి@366 మార్చి 31….Audio

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles