Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
శ్రాద్ధ కర్మలు చేయటంలాంటివి మూఢ నమ్మకంగా గోపాల్ భాస్కర్ దాతర్ అనే ఠాణాలోని ప్లీడరు అనుకొనేవాడు. వాటిని పెట్టటం మానివేసాడు.
ఆయన సాయి భక్తుడైనాడు. ఆయన స్నేహితుడు నాచ్నే. నాచ్నే భార్య మరణించింది. శ్రాద్ధ కర్మలు జరిపించాలని నాసిక్ వెళ్ళాడు.
ఒక వ్యక్తి తారసపడి, దగ్గరుండి అంతా సవ్యంగా జరిపించాడు. నాచ్నే దగ్గరున్న అతి తక్కువ డబ్బుతోనే.
ఆ వ్యక్తి తన అడ్రస్ ఇచ్చాడు నాచ్నేకు. నాచ్నేకు అతనిని కలవాలనిపించి వెదుకుతూ వెళ్ళాడు. అటువంటి వ్యక్తి ఎవరూ లేరని తెలుసుకొని ఆ వ్యక్తి సాయియే అని నిర్ధారించుకున్నాడు నాచ్నే.
ఈ ఉదంతం తెలుసుకున్న దాతర్ సాయిబాబాయే నాచ్నే చేత వేరే రూపంలో ఉండి శ్రాద్ధ కర్మలు చేయించాడు కాబట్టి, శ్రాద్ధ కర్మలను చేయాలని గ్రహించాడు
ఒక వేళ సాయియే శ్రాద్ధ కర్మలు మూఢచారాలని భావిస్తే సాయియే దగ్గరుండి చేయించే వాడు కాదు.
సాయి సాహిత్యంలో సాయి శ్రాద్ధ కర్మలను ధుమాల్ విషయంలోను, బాపూ సాహెబ్ జోగ్ మొదలైన వారి విషయంలో కూడా చేయించాడు. దాతర్ ఇక ఆ క్రతువులను చేయసాగాడు.
సాయికి చేసిన ఆ క్రతువులు మూఢ నమ్మకాలు కావు. బాలా సాహెబ్ భాటే సాయికి ఉత్తర క్రియలను చేశాడు.
ఆ నాడు నవంబరు 13, 1918. సాయి బాబా నిద్రిస్తున్న కాకా మహాజనికి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ”ఏమి ఇంకా నిద్రిస్తున్నావా? నిద్రలే. నా సమాధి అనంతరం ముప్పదవ రోజు చేసే కర్మను చేయి” అన్నారు సాయి.
కాకా మహాజని నిద్ర లేచి లెక్కలు వేశాడు. ఆ రోజే ముప్పదవ రోజు కర్మ చేయాలి. అదే మాసికము. వెంటనే అతడు తన గృహములోనే సాయినాథునకు మొదటి మాసికాన్ని పెట్టాడు.
పాదుకలకు అభిషేకం చేశాడు. కాకా సాహెబ్ దీక్షిత్, మోరేశ్వర్ వామన్ ప్రధాన్, హేమాడ్‌పంతును భోజనానికి పిలిచాడు. వారందరూ వచ్చారు.
వారం తరువాత సాయి బాబా భజన చేశారు. ఇక కాకా మహాజనికి ప్రతి మాసం చెప్పనవసరం లేకుండా ఆయనే మాసికాలు పెట్టాడు.
అంటే సాయిబాబా మాసికాలు నిర్వహించటం అదనపు, అనవసరపు ఆచారం క్రింద జమకట్టలేదని భావించాలి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- దెబ్బకు దెబ్బ…..సాయి@366 నవంబర్ 21….Audio
- సాయి! కన్నులలో నీరెందులకు?…..సాయి@366 నవంబర్ 1….Audio
- చిన్ని నా బొజ్జకు …..సాయి@366 డిసెంబర్ 17….Audio
- భక్తుడా? అంకిత భక్తుడా? …..సాయి@366 మే 13….Audio
- బాబా నన్ను క్రింద పడకుండా పట్టు కున్నారు….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments