Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నామదేవుని గూర్చి పలుకుతూ, ఒక సమయంలో, ఆయనను సగం కాలిన కుండ లేదా కాలికాలని కుండగా పోల్చటం జరిగింది.
సాయి సచ్చరిత్రలో సాయి కాలని కుండలతో మొక్కలకు నీరు పోసాడు.
కాశ్మీరు దేశంలోని యోగిని లాల్ దెడ్. ఆమెను లల్లాదేవి అంటారు. ఆ లల్లేశ్వరి తనను కాల్చబడని మట్టి కలశంతో పోల్చుకుంది.
కుండ కాలింది. అలా కుండ కాలి ఆత్మ జ్ఞానం పొందింది. ఆమె మాటలు వేమన సుక్తుల్లా, పోతన పద్యాల్లా కాశ్మీరులో ప్రతి నాలుకపై నాట్యమాడుతుంటాయి.
శ్రీనగర్ కు ఈశాన్యాన ఉన్న పండ్రేథాన్లో కాశ్మీరు పండితుల ఇంట పుట్టింది. వివాహమైంది. అత్తగారు కౄరురాలు.
ఆ అత్త కోడలి కంచంలో నున్నవి గుండ్రాయిని పెట్టి రాయి కనబడకుండా కొంచెం అన్నం పెట్టేది. చూచేవారికి కంచం నిండా అన్నం పెట్టినట్లు కనబడేది.
లాల్ దేడ్ ఏ నాడు అత్త ఇలా చేసిందని ఎవరితోను చెప్పలేదు.
నీటికని నదిని బయలు దేరిన లాల్లా దేవి గంటల తరబడి తిరిగి రాకపోవటం, అనుమానాలకు దారితీసింది.
ఆమె అప్పుడు నల కేశవ భైరవాలయంలో అనుష్ఠానంలో ఉండేది. ఆమె గురువు సిద్ద శ్రీకంఠుడు.
గురువును మించిన శిష్యురాలైంది లల్లా దేవి. ఆమెకు జ్ఞానోదయమైంది. దిగంబరిగా మారింది.
ఆమె నగ్నంగా నిర్లజ్జగా తిరగటం చూచి, ఆమె మామ మందలించాడు. ఆమె మనుష్యులే లేరని, అక్కడ ఉన్న కిటికీ గుండా చూడమంది.
అంతవరకు తాను (మామ) చూచిన మనుష్యులు గొర్రెలుగా కనిపించాయి. సత్యాన్ని ఆయనకు ఆమె దర్శనం చేయించింది.
ఒకనాడు సిద్ద శ్రీకంఠుడు దేవాలయంలో శివార్చన చేస్తుండగా లల్లా దేవి అక్కడకు వెళ్లింది.
“ఎందుకు వచ్చావు?” అని గురువు అడిగితె మరుగు కోసమన్నది లల్లా. అయన త్వర త్వరగా ఆమెను దూరంగా ఒక మూలకు తీసుకుపోయి కూర్చోమన్నాడు.
ఆమె చేతి గోళ్లతో ఆ స్థలాన్ని త్రవ్వగా దైవ విగ్రహాలు కనిపించాయి. శివుడు లేని చోటెక్కడ?
ఆమె జనన, మరణ వివరాలు కచ్చితంగా తెలియవు.
కేంద్ర ప్రభుత్వం నవంబరు 12, 2000 లో ఆమెను గూర్చి ఒక సదస్సును నిర్వహించింది.
లల్లాదేవి వాక్కులు లేదా పద్యములు 138కి పైగా ఉన్నాయి. ఆమె తెలిపిన సత్యాన్ని అనుభవిస్తే, ముక్తి చేరువగానే ఉంటుంది.
నేడు నవంబర్ 12. ఆమె వాక్కులను స్మరిద్దాం!
“భగవద్బావన వంటి వెలుగు లేదు,
భగవత్ ప్రేమకు మించిన యాత్ర లేదు,
భగవంతునుని మించిన బంధువు లేడు,
దైవ భీతికి మించిన సౌఖ్యం లేదు”.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- బాలకృష్ణా! నిన్ను నే చేరి కోలతు…. మహనీయులు – 2020… జూలై 8
- దొంగకు చిక్కిన రంగనాథుడు …. మహనీయులు – 2020… నవంబర్ 5
- సరిలేరు మీ కెవ్వరు…. …. మహనీయులు – 2020… ఆగస్టు 23
- గురువుకు తిలకం దిద్దిన భక్తుడు… .మహనీయులు – 2020… అక్టోబరు 6
- తెలుగు వారి శారదా మాత! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 12
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments