చేజారని బహుమతి…..సాయి@366 నవంబర్ 12….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


ఆ దినం నవంబరు 9, 1986. డాక్టర్‌ విజయకుమారు గారు ఆ రోజు పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు.

అనంతరం తన చేతి సంచీని తెరచి చూచి తెల్లబోయారు. ఆ రోజు ఫ్రేము కట్టించుకొని తెచ్చిన రెండు ఫొటోలు ఆ సంచీలో లేవు.

ఉదయంనుండి జరిగిన సంఘటనలు నెమరు వేసుకోసాగాడు. ఆ రెండు ఫొటోలు ఏమైనది జ్ఞప్తికి రావటం లేదు. పోతేపోనీలే అనుకోవటానికి వీలులేని ఫొటోలు.

అందులో ఒక ఫొటోలో కంచి ఆచార్యత్రయం ఉన్నారు. ఈ ఫొటోను ఎవరోకాదు షిరిడీలోని శ్రీ సాయి సంస్థానమే ఆయనకు బహుకరించింది.

ప్రతి సంవత్సరం షిరిడీలో సాయినాథునిపై ఎవరి రచనలు శ్రీసాయి లీల మాసపత్రికలో ప్రచురితమయ్యాయో వారిని ఆహ్వానించి సభ ఏర్పాటు చేస్తుంది సాయి సంస్థానం.

ఆ సంస్థానము ఇచ్చిన అమూల్యమైన కానుక కంచి త్రివేణి చేజారిపోయింది.

మరో ఫొటో శ్రీ సాయి పాదానంద గారిది. సాయి స్పిరిట్యువల్‌ సంస్థాపకుడు – రుషితుల్యుడు.

పోయిన ఫొటోలు ఒకే కవరులో ఫ్రేం  కట్టించి ఇచ్చాడు షాపు యజమాని. సాయి కృప ఉండలే గాని పోయిన వస్తువులు దొరకవా? దొరికిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఇక తన విషయంలో కూడా అలా జరిగేనా? పోయిన ఫొటోలు తిరిగి వచ్చేనా? ఇదే ఆలోచన డాక్టరిది. దొరికితే సాయి మహిమయే అనుకున్నాడు.

రెండు రోజులు గడిచాయి. ఆ దినం నవంబరు 12, 1986 డాక్టరు గారి ఇంటిలో ఫోను మ్రోగింది – ”మీ వస్తువులు ఏమైనా పోయాయా?” ప్రశ్న. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లనిపించింది డాక్టరుకు.

డాక్టరు 9న ఇంటికి వస్తూ టీ త్రాగాడు. చిల్లరకు సంచిలో వెదికేటప్పుడు ఫొటోలు బల్ల మీద పెట్టి, తిరిగి సంచిలో పెట్టుకోకుండా వచ్చాడు.

ఎవరో ఆ బేకరీలో ఫొటోలు ప్యాకెట్టు చూచి, మరచిపోయారని తెలుసుకున్నాడు. ఎవరికి, ఎలా అందచేయటం అని ఆలోచించాడు.

కొత్తగా ఫ్రేము కట్టించిన ఫొటోలు. ఫ్రేము కట్టినదెవరో ఫొటోలపై ఉన్నది. అక్కడకు వెళ్ళి విచారించి, డాక్టరు అడ్రస్సు కనిపెట్టి, ఫోను చేసి ఇచ్చాడ ఫొటోలను ఎవరో పరోపకారి పాపన్న.

అయితే ఆ పరోపకారి పాపన్నను ప్రేరేపించింది ఎవరు? కంచి ఆచార్య త్రయమా? సాయి పాదానందా? సాయిబాబానా? అసలు ముగ్గురూ వేరయితే కదా!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles