దొంగకు చిక్కిన రంగనాథుడు …. మహనీయులు – 2020… నవంబర్ 5



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


పన్నిర్దరాళ్వార్లు విష్ణు సాంప్రదాయానికి తమదైన రీతిలో ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆ పన్నెండుగురిలో ఒకరు తిరుమంగై ఆళ్వారు. ఈయననే పరకాలుడు అంటారు.

ఈయన జన్మించినది కార్తీక శుద్ధ పొర్ణమి గురువారంనాడు (కార్తీక మాసం సాధారణంగా నవంబర్ లో వస్తుంది).

శ్రీ మహావిష్ణువు యొక్క శారజ్ఞ అంశచే జన్మించాడు. ఈయన బాల్య నామము నీలుడు.

తండ్రి వలె వీరుడు, ధనుర్విద్య, శస్త్ర విద్యలలో నేర్పరి. చోళ రాజు ఈయనను తిరుమంగై అనే పట్టణానికి రాజుగా చేశాడు.

తిరుమంగై వైష్టవ దంపతులు కుమార్తె కుముదవల్లిని చూచాడు. ఆమెను వివాహమాడ దలచాడు.

ఆమె వైష్ణవుల వలె పంచ సంస్కారాలను తిరుమంగై చేసుకోవాలని, ఒక సంవత్సర కాలంపాటు భాగవతోత్తమములకు పాద సేవ చేసి భోజనం పెట్టాలని షరతు విధించింది వివాహం చేసుకోవటానికి.

అతడు అంగీకరించాడు. పంచ సంస్కారాలు చేయించు కున్నాడు. వివాహమైంది.

ఇక రెండవ షరతు – అమలు చేయటం మొదలు పెట్టాడు తిరుమంగై ఆళ్వారు.

తన వద్ద నున్న ధనాన్ని వెచ్చించి సమారాధనకై  వినియోగించాడు. ధనం అయిపోయింది. సమారాధనకు ఇంకా ధనం కావాలి.

రాజ ద్రవ్యం తన వద్ద ఉంది. ముందు వెనుకలు ఆలోచించకుండా సంతోషంగా సమారాధనకు రాజ ద్రవ్యాన్ని ఖర్చు పెట్టాడు.

రాజు ఈతనిని చెరసాలలో బంధించాడు. ఒకనాటి రాత్రి విష్ణుమూర్తి తిరుమంగై కలలో కనిపించి, వరదరాజస్వామి గుడికి రమ్మని చెప్పాడు.

రాజు అంగీకారంతో అతను వెళ్లాడు. అక్కడ ఆయనకు ధనమున్న మూట ఒకటి దొరికింది.

దానిని రాజుకు తెచ్చి ఇచ్చాడు. రాజు తిరుమంగై సమారాధనను వరద రాజస్వామి ఆమోదించాడని తెలుసుకొని, ఆ ధనాన్ని తాను స్వీకరించకుండా తిరుమంగైకు ఇచ్చి, తిరుమంగైను విడుదల చేశాడు.

తిరుమంగై మహావిష్ణు మహత్తును గ్రహించాడు. ఆ ధనాన్ని విష్ణు భక్తుల సమారాధనకు వినియోగించాడు.

ఆ ధనమూ ఖర్చు అయిపోయింది. విష్ణు భక్తుల సేవకు ధనం కావాలి. అందుకని దారి దోపిడీలు దొంగతనాలు చేసేవాడు.

తిరుమంగై వ్రత నిష్ఠకు రంగనాథుడు సంతసించాడు. రంగనాధుడు, లక్ష్మీ దేవి జంటగా నూతన దంపతుల వలె మారువేషంలో పోతుంటే తిరుమంగై ఆళ్వారు దొంగగా వారిని అడ్డగించి వారి నగలను తీసుకున్నాడు.

మారు రూపంలో ఉన్న విష్ణువు కాలి ఆభరణం చూచాడు తిరుమంగై. ఆ పాదానికి ఉన్న ఆభరణాన్ని తీసుకుందామని, పాదాలపై చేయి వేశాడు తిరుమంగై.

సాయి వస్త్రాన్ని కప్పితే నాస్తికుడు సాయి భక్తుడైనాడు. ఆ దొంగకు విష్ణుమూర్తి పాద స్పర్శ లభించింది, దివ్య జ్ఞానం పొందాడు.

పన్నిద్దరాళ్వార్లలో ఒకడైనాడు.

విష్ణుపాద స్పర్శ మనలనూ పునీతులను చేయుగాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles