రంగనాథుడే ప్రాణనాథుడు …. మహనీయులు – 2020… జూలై 17



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


తమిళనాడు ప్రభుత్వ రాజముద్రికలో కనిపించే గాలిగోపురం విల్లిపుత్తూరు రంగనాథాలయంది.

తొండరడిప్పొడి ఆళ్వారు (విప్రనారాయణ) వలె మాలా కైంకర్యంతో తరించిన ధన్యజీవి పెరియాళ్వారు.

విష్టుచిత్తులు లేదా పెరియాళ్వారుగా పిలువబడే ఆ విష్ణు భక్తుని కుమార్తె ఆండాళ్. ఈమెను గోదా దేవి అంటారు.

అపర సీతవలె అయోనిజాయై జన్మించినదీమె. ఆ విష్ణు భక్తుని పెంపకంలో త్రికరణశుద్ధిగా శ్రీకృష్ణపరమాత్మనే వరించి వ్రత రూపంగా ఆమె పాడిన పాశురాలే తిరుప్పావై. అది అద్వితీయ వరముగా రూపొందిన వ్రతము.

రామాయణంలో శబరి పండ్లను రుచిచూచి శ్రీరామునకు ఇచ్చినట్లు, ఆండాళ్, స్వామివారికై తండ్రిచే కట్టబడిన తులసి మాలను తలలోను, కంఠంలోను ధరించి అద్దంలో చూచుకునేది.

అలా ప్రతి రోజు చూచుకునేది. ఒకనాడు విష్టుచిత్తులవారు తాను కట్టిన మాలలను శ్రీరంగనాథుని కైంకర్యం కోసం తీసుకుపోతుండగా, అందులో తలవెంట్రుకను చూడటం జరిగింది.

అయన అండాళును అనుమానించి అడిగాడు. ఆమె ఒప్పుకుంది. “అమ్మాయి! గోదా! ఎంతటి అపచారం చేసేవమ్మా! స్వామికి సమర్పించే తులసి మాలను ముందుగా నువ్వు ధరించటం తప్పుకదా!” అంటూ దిగులుపడుతూ నిద్రించాడు విష్ణుచిత్తుడు.

ఆనాటి రాత్రి ఆయనకు కలలో రంగనాథుడు కనిపించి “నీవు తెచ్చే మాలికలు, ప్రతిరోజు నీ కుమార్తె ధరించినవే. నేను అత్యంత ప్రీతితో వాటిని స్వీకరిస్తున్నాను.

ఆమె ధరించిన పూలమాలలనే నీవు తీసుకురావాలి” అని ఆదేశించారు. ఆనాటి నుండి అండాళ్ కు “శూడిక్కొడుత్తనాచ్చియారు” (ఆముక్తమాల్యద) అనే పేరు వచ్చింది.

ఆమె రంగనాథుని వివాహమాడుటకు నిశ్చయించుకొనినది. అర్బామూర్తిగ నున్న స్వామితో వివాహమెట్లగును అని ఆమె తండ్రి చింతింపసాగాడు.

రంగనాథుడు గోదాదేవి, భూదేవి అంశయని ఆమెను పెండ్లియాడెదనని చెప్పినాడు.

శ్రీరంగములోని ఆలయ ధర్మకర్తలకు స్వప్నమున కనిపించి, సకల మర్యాదలతో శ్రీవిల్లిపుత్తూరులో నున్న పెరియాళ్వారు పుత్రికయగు గోదాదేవిని తోడ్కొని వచ్చి తనకు కళ్యాణము జరిపింపుడని ఆజ్ఞాపించెను. వారు అటులనే చేసిరి.

గోదాదేవి గర్బాలయమున ప్రవేశించి కనులారా శ్రీరంగనాథుని గాంచి, శేష తల్పమునెక్కి, స్వామి పద సన్నిధిచేరి అదృశ్యమాయెను. ఆ దినము భోగి.

ఆమె గానము చేసిన ప్రాచీన తమిళ భాషలోని పాశురాములు చదివెడి వారెవరైనను, కొండలవంటి నాల్గు భుజములు, ఎర్రని కన్నులు, దివ్య ముఖ మండలము గల లక్ష్మీపతి కటాక్షమును ఎల్లప్పుడును పొంది సుఖించగలరు.

ఆమె పెరియాళ్వారులకు పసిబిడ్డగా అవతరించిన మాసం ఆషాఢ మాసం. పూర్వ ఫల్గుణీ నక్షత్రం. ఆండాళ్ ను స్మరిస్తూ తిరుప్పావై పఠిస్తూ, రంగని కృపను పొందెదముగాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles