అది నేనే …. మహనీయులు – 2020… ఏప్రిల్ 17



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఖరీదైన కారులు నిసర్గదత్త మహారాజును ఎక్కడికంటే అక్కడకు తీసుకుపోవటానికి సిద్డంగా ఉంచుతారు ఆయన శిష్యులు. కానీ ఆయనకు అవేవిపట్టవు.

ఆ జ్ఞాన మహారాజు భక్తులతో భజన చేస్తున్నాడు. మహారాజ్ భక్తుడొకడు అంతిమ శ్యాస పీల్చే దశలో ఉన్నాడని కబురు వచ్చింది.

భక్తులందరూ కలవరపడసాగారు. విసర్గదత్తు భజన పూర్తిచేసారు. ఎవరి దారిన వారిని పొమ్మన్నారు.

విసర్గదత్తులు సరాసరి సిటి బస్సు ఆగే స్థలంలోకి వచ్చి క్యూలో నిలబడ్డారు. ఆయన కనీసం టాక్సీ కూడా ఎక్కలేదు.

సిటీ బస్సులోనే ప్రయాణంచేసి, తన భక్తుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్ళాడు. ఆ భక్తుడు మరణించాడని, శవాల గదిలో ఉంచారని చెప్పారు.

అక్కడకు తీసుకుపొమ్మన్నారు తనను. తీసుకుపోయారు. తెల్లటి గుడ్డని తొలగిస్తూ “ఏమిరా! నా అనుమతి లేకుండా వెళ్ళిపోవటమేనా?” అని ఆ మృతుని ఛాతీపై తట్టి భక్తుని పేరుతొ పిలిచారు.

మృత భక్తుడు లేచి గురువు పాదాలకు నమస్కరించాడు. ఆసుపత్రి వారు ఆశ్చర్యపోయారు. కుటుంబం వారు సంతోషించారు.

నిసర్గదత్త మహారాజును కృతజ్ఞతాపూర్వకంగా కొనియాడారు. పొగడ్తలు, తిట్లు శరీరానికే గాని, ఆత్మను తాకవని తెలిసిన విసర్గదత్తులు చలించలేదు.

విసర్గదత్త మహారాజు వద్దకు కొంత కాలంనుండి మహిళా భక్తురాలు ఒకరు రావటంలేదు. ఆ మహిళ బెరుకు, బెరుకుగా వచ్చింది. విసర్గదత్త పాదాలకు నమస్కరించింది.

“ఇప్పుడెందుకు వచ్చావు? వెళ్ళి పో” అని ఆ మహిళతో అన్నారు. గురువుగారు అలా ఎందుకన్నారో అర్థంకాక ఆశ్చర్యపోయారు అక్కడున్నవారందరూ.

ఆ మహిళ గురువుగారికి కోపం వచ్చిందని ఎంతో ఖేదంతో తిరుగుముఖం పట్టి ఇంటికి చేరుకుంది.

ఆమె భర్త అస్వస్తుడైనాడు. ఆసుపత్రిలో చేర్చాలి. వెంటనే భార్య తన భర్తను ఆసుపత్రిలో చేర్చింది. సరిగ్గా సమయానికి విసర్గదత్త మహారాజు తనను ఇంటికి పంపారని ఆమె గ్రహించింది.

సాయిబాబా భక్తురాలు ఛోటుబాయి ద్వారకామాయిలో సాయికి పూజ చేస్తోంది. సాయిబాబా ఉన్నట్లుండి “అపుము, వాడాకు వేళ్ళు” అని ఆజ్ఞాపించారు.

ఆమె హఠాత్తుగా సాయి తనపై ఎందుకు కోపించి పొమ్మన్నారో తెలియక, వాడాకు వెళ్ళింది.

వాడాలో తన పసిబిడ్డడు ఆకలేసి ఏడుస్తున్నాడు, సాయిబాబా ఇందుకా తనను వాడాకు పొమ్మన్నది అని అర్థంచేసుకుంది.

ఆత్మజ్ఞాని అయిన విసర్గదత్త మహారాజుకు ఆశ్రమాలు, కుటీరాలు నిర్మించి ఇస్తామన్నారు. అవేవీ తనకు వద్దన్నారు.

బొంబాయిలోనే నలుగురి మధ్య నివసించే గృహస్తుడా మహాజ్ఞాని ఆయన. ఇతరులకు జీవంపోయగల శక్తి కలిగినా, తనను మాత్రం మృత్యుబారినుండి కాపాడుకోలేదు.

ఆయనకు, ఆయన భక్తులకు తెలుసు ఈ జీవితం ఒక స్వప్నమని, ఆ మహా స్వప్నం అంతరించినా ఆయన బోధలు ఎన్నటికీ మరువరానివి.

నేడు ఏప్రియల్ 17 (1897) ఆయన జయంతి (నేను అదే) అనే భావన మనలో స్థిరపడునట్లు, ఆ నిసర్గదత్త మహరాజులను వేడుకుందాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles