గడపనైనా కాకపోతిని …. …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 26



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“నవ విధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము” అని వ్రాశారు శ్రీ ప్రత్తి నారాయణరావు గారు సాయి సచ్చరిత్ర 21వ అధ్యాయంలో.

అలా ఆచరణలో పెట్టినవారిలో ఒకరు మాఘ శుద్ధ ద్వాదశినాడు (సాధారణంగా ఫిబ్రవరిలో వచ్చేది) జన్మించి పన్నిదరాళ్వారులో ఒకరైనారు. అయన కులశేఖర ఆళ్వారు. వీరు చెర వంశీయులు, దృఢవ్రతుడు అనే రాజుకు కుమారుడు.

అయన రాజు. తన రాజ్యమును భగవత్ కైంకర్యము చేసినాడు. ఈయన శ్రీరామునిపై 124 పాశురములతో కూడిన తిరుమొళిని రచించారు. ముకుందమాల రచయిత ఈ రాజ కవియే.

ఈయన రామాయణమును శ్రవణము చేయుచుండగా సీతాపహరణ ఘట్టము వచ్చినది.

వెంటనే ఆ రాజు తన సైన్యాన్ని ఆయత్తపరిచాడు. ఆ రాజు తన సైన్యంతో లంకాభిముఖుడై సముద్రములో ప్రవేశింపనున్నాడు.

ప్రజలు కాని, మంత్రులు కాని ఏమి చేయగలరు? రాజుకు ఎదురు చెప్పగల వారెవ్వరు? అందరు హాహాకారములు చేయసాగారు. ఆ వింతను దేవతలు దేవలోకము నుండి చూచుచున్నారు.

రాముడు సీతా లక్ష్మణ సమేతుడై అయన ఎదుట సాక్షాత్కరించి “ఓయీ! కులశేఖరా! రావణుని సంహరించి సీతను తెచ్చితిని. ఇదిగో చూడుము” అన్నాడు.

ఆ కులశేఖరుడు సీతా రామ లక్ష్మణులను సేవించి బ్రహ్మానంద భరితుడైనాడు. భగవంతుడు భక్తుని భక్తికి దిగిరాక తప్పదు కదా!

కులశేఖర ఆళ్వారు తనను దేవకిగా భావించుకునేవాడు. ఎంతో ఆవేదనతో కృష్ణ వియోగం వలన దుఃఖించే వాడు.

శ్రీ వెంకటేశ్వరుల దర్శనానంతరం “తండ్రీ! నీ గర్భాలయానికి గడపగా ఉండేందుకు దయ చూపితే, నీ భక్తుల పాద ధూళిలో నలిగి నీ పాదారవిందాలను సేవిస్తూ ఉంటాను కదా!” అని వేడుకొనుటయే గాక,

నీ మందిరమునకు ఒక స్తంభముగానన్నా నన్ను ఉండనిమ్ము, నిన్ను నిత్యము అర్పించే పుష్పవనంలో ఒక బోదెగానైనా నన్ను సృష్టించిన నా జీవితము ధన్యమగును గదా అని దాస్య భక్తితో వేడుకొనెడి వాడు.

భక్తుని నిష్కామ కోర్కెను భగవంతుడు కాదనడు గదా! అందుకు నిదర్శనముగా నేటికీ కూడా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వారి గర్భాలయానికి ఉండే గడపను ‘కులశేఖరప్పడి’ అని వ్యవహరిస్తుంటారు.

మాఘ శుక్ల పునర్వసు నక్షత్ర ద్వాదశీ శుక్రవారం కౌస్తుభంశంతో జన్మించిన కులశేఖరులను స్మరిస్తూ ముకుంద మాలలోని ఆయన ఇచ్చిన సందేశాన్ని పాటిద్దాం.

“పరమ మంత్రం భాగవన్నామమే. అనన్య భక్తితో నారాయణుని మాత్రమే శరణువేడు. అతడే పరమ శ్రేష్ఠుడు”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles