చిప్పనైనా కాకపోతిని…. …. మహనీయులు – 2020… ఆగస్టు 1



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నన్నయాదులు మహాభారతాన్ని, పోతన మహాభాగవతాన్ని ఆంధ్రీకరించే అదృష్టం పొందారు. అయితే వాల్మీకి రామాయణాన్ని సంపూర్తిగా ఆంధ్రీకరించిన భాగ్యశాలి శ్రీ వావిలికొలను సుబ్బారావు గారు.

ఇంకా రామాయణానికి వ్యాఖ్యానం కూడా అవసరమని అయన గ్రహించి, రోజుకు 20 గంటలు శ్రమిస్తూ మందరం అనే పేరుతో వ్రాశారు.

బళ్లారి రాఘవగారు ఆంధ్ర వాల్మీకి అనే బిరుదును, ఆంధ్ర సారస్వత పరిషత్తు కవి సార్వభౌమ అనే బిరుదును ఇచ్చారు, ఆ రామ భక్తునకు.

అయన బహువిధ రామ భక్తికి శ్రీ హనుమ, లక్ష్మణ, సీతారామ సమేత కోదండ రామమూర్తులు పెక్కుసార్లు దర్శనం ఇచ్చారు.

ఒకసారి వాసుదాస స్వామిగారు (వావిలికొలను సుబ్బారావు గారు) వేరొక ప్రదేశంలో ఉండగా ఇద్దరు బైరాగులు కనబడి “నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఒంటిమిట్టకు రారాదా?” అన్నారు.

అయన వారిద్దరిని రామలక్ష్మణులుగా భావించి ఒంటిమిట్టకు చేరారు. అక్కడున్న పెద్దలు ఆయనను కోదండ రామాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం చేపట్టమన్నారు.

వాసుదాసుగారు ముందుగా కౌపీనం ధరించి, ఒక కొబ్బరికాయ పెంకు (చిప్ప)ను భిక్షాపాత్రగా స్వీకరించి ఊరూరా తిరిగి భిక్షమెత్తి, సేకరించిన ధనంతో ఆలయ జీర్ణోద్ధరణయే కాక, కోదండ రామునికి కిరీటం, వివిధ భోగాలు చేయించినారు. ధన సేకరణకు తోడ్పడిన కొబ్బరి చిప్పను ప్రస్తుతించారు.

సాయిబాబా కూడా జీర్ణ దేవాలయాలను పునరుద్ధరణ చేయించారు.

కాళ్లు చచ్చుపడిన అబ్బాయికి తీర్ధమిచ్చి, దీవించగా మరునాడే ఆ అబ్బాయి నడక ప్రారంభించాడు. ఇది కోదండరామ కృప అంటారు వాసుదాసు గారు.

మార్కాపురంలో ఉండగా, గోక్షీరాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునే ఆయనకు, గోక్షీరమే లభ్యం కాలేదు.

ఒక ఆవు పాలిచ్చుట మాని 15 దినాలైంది. ఆ గోవు వద్దకు  పోయి  వాసుదాసుగారి  పేరు  చెప్పగా, ఆవు పాలిచ్చింది.

వాసుదాసు గారు మార్కాపురంలో ఉన్నన్ని దినాలు ఆ గోవు క్షీరమిచ్చింది. రాముడు ఆత్మారాముని ఆకలితో ఉంచునా?

తన స్వంత ఆస్తులను, తుదకు తాను వ్రాసే కలముతో సహా ఒంటి మిట్ట కోదండస్వామికి వీలునామా వ్రాసి ఇచ్చిన మహాత్యాగి.

ఈయన ఆగస్టు 1, 1936న రామునితో ఐక్యమయ్యారు.

మనకు రామ భక్తి పెంపొందు గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles