ఆరోగ్యం ప్రభాకరరాదిచ్చేత్ …. మహనీయులు – 2020… ఆగస్టు 29



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మాస్టర్ సి.వి.వి గారి గురించి, ఆయన భృక్త రహిత తారక రాజయోగం గురించి, వేటూరి ప్రభాకర శాస్త్రి గారి మాట్లాడుతుంటే ఆ యోగ మహత్వానికి నిదర్శనం చూపమన్నారు అక్కడున్న వారు.

“మీకే పూవు ఇష్టం?” అని శాస్త్రి గారు అడిగారు వారిని. “సంపంగి” అన్నారు వారు. శాస్త్రి గారు గురుదేవులను ప్రార్ధించారు. ఆ ప్రదేశమంతా సంపంగి సువాసనలతో గుబాళించింది.

ఆయనను ఎవరో ‘అనాస పండు తినాలని ఉంది’ అన్నారు శాస్త్రి గారితో. “సరే” అన్నారు శాస్త్రి గారు. కాసేపటికి ఒక వ్యక్తి వచ్చి అనాస పండ్ల బుట్టతో వచ్చాడు.

శాస్త్రి గారు “నా చుట్టూ ఆనందాన్ని, అమృతాన్ని పంచిపెట్టాలనే సంకల్పం ఉన్న వాడిని నేను.

ఆపదల నుండి రక్షించటం, ఆనందాన్ని నెలకొల్పటం అనే రెండు భావాలే నాకు ఉచ్చ్వాస నిస్వాశాలు” అనేవారు.

ఒక రిక్షాలాగే వాడి కొడుకు నోట మాట రాక, మూతి వంకరలు తిరుగుతుంటే, శాస్త్రి గారు ధ్యానం చేసి, కాసేపటికి వాడిని మాములు మనిషిని చేశారు.

ఒక రాత్రి శాస్త్రి అసహనంగా ఉన్నారు. అలాగే నడుచుకుంటు వెళ్లారు. దాహం అయింది.

కనపడిన ఇంటికి పోయి నీరు అడిగారు. గృహిణి ఆయనకు మంచి నీరు అందిస్తూ, తన భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కన్నీటి పర్యంతమైంది.

ఆయన నీరు త్రాగకుండా, బసకు పోయి, ప్రార్థన చేశారు. తెల్లవారిన తరువాత ఆ ఇంటికి వెళ్లారు.

“మీరు పలకరించి వెళ్లిన తరువాత మా వారికి ఆరోగ్యం కుదుట పడింది” అని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పింది ఆ ఇల్లాలు.

ప్రార్థనకు, ఈశ్వర అనుగ్రహానికి ఉన్న మహత్తర శక్తిని శాస్త్రిగారు చూపించారు.

ఆయన ప్రచారానికి, ప్రదర్శనకు తావివ్వలేదు. తరగని సాహిత్యం వ్రాశారు శాస్త్రి గారు.

గురువుకు గుర్తింపు శాస్త్రిగారి వంటి ఆదర్శప్రాయులవలననే వస్తుంది.

ఈయన కృష్ణా జిల్లా, పెదకళ్లేపల్లిలో జన్మించారు.

ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు, మొదట తనకున్న శారీరక బాధతో. పోతరాజు గారు ఈయనకు ఒక ఉత్తరమిచ్చి మాస్టర్ సి.వి.వి.ని దర్శించండి అన్నారు.

శాస్త్రి గారు వెళ్లి ఆ ఉత్తరాన్ని మాస్టర్ సి.వి.వి. గారికి ఇస్తే, ఆయన ఉత్తరం చదివి “విశ్రాంతుడవు కమ్ము” అన్నారు.

ఆ మాటతో శాస్త్రి గారిలో ప్రజ్ఞ ప్రవేశించింది. ఇక తిరుగు లేదు శాస్త్రి గారికి.

శాస్త్రి గారు 29 ఆగస్టు 1950న భౌతిక కాయాన్ని విడిచారు. కొత్త రామ కోటయ్య, గాలి బాల సుందర రావు, పోచిరాజు శేషగిరి రావు మొదలగు వారంతా ఈయన శిష్యులే.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles