నీ పేరు తలచినా చాలు…. …. మహనీయులు – 2020… డిసెంబరు 10



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“నా కోసం మీరు కంచికి ఇంత దూరం రావలసిన పనిలేదు. చందోలులో లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారున్నారు కదా, ప్రతి గురువారం వారిని దర్శించండి” అని కంచి కామకోటి పరమాచార్యుల వారు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర యతీంద్రుల వారనేవారు.

అఖిల భారత సాయి భక్త సమ్మేళనం నెల్లూరు పట్టణంలో 7, 8, 9 జనవరి 1983న జరిగింది.

ఆ మహాసభకు విశ్వ శ్రేయస్సు కోసం అవతరించిన బ్రహ్మర్షి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారే ప్రత్యేక ఆహుతులు. వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు ప్రజలు.

శ్రీ శాస్త్రి గారు సాయి వలెనే, తన కోసం జీవించ లేదు. కుల, మత భేదం లేకుండా ఆర్తులకు తమ తపస్సును ధారపోసి, సుఖ సంతోషాలను ప్రసాదించే వారు. ఇతరుల ఆనందమే తన ఆనందంగా భావించేవారు శాస్త్రి గారు.

సాయి తన గురువును, అల్లాను గుర్తుంచుకొన్నట్లు శ్రీ శాస్త్రిగారు తమకు ఓనమాలు నేర్పిన గురువులు మొదలు మంత్రాలు, వ్యాకరణం, శాస్త్రాలు బోధించిన గురువుల వరకు, ఇంకా తల్లిదండ్రులకు భక్తితో ప్రణమిల్లడం వారి నిత్య పూజా విధి.

సాయి కృప వలన వయస్సు దాటిన చంద్రాబాయి బోర్కరుకు సంతాన ప్రాప్తి కలిగింది.

ఇక చందోలు శాస్త్రి గారిని కేతరాజు సుబ్బారావు గారు ఆశ్రయించారు.

సుబ్బారావుగారు భార్యను పరీక్షించి, ఆమెకు సంతాన భాగ్యం లేదన్నారు రాయవేలూరు వైద్యులు.

ఆమెకు శాస్త్రి గారు సంవత్సరకాలం తీర్థ విభూతులిచ్చారు. కాన్పు కోసం ఆమె రాయవేలూరు ఆసుపత్రికే పోగా, డాక్టర్లందరు తెల్లబోయారు.

“వస్త్రాహారముల కొరకు ప్రయాస పడవలదు” అన్నారు సాయి. దానినే శ్రీ శాస్త్రిగారు ఆచరించి చూపారు.

ఆర్థికంగా పూట గడవని స్థితిలో ఉంది శాస్త్రిగారి కుటుంబం. ఒకసారి ఆ కుటుంబం మూడు రోజులు పస్తులుంది.

శాస్త్రిగారు చాలాసార్లు లలితా సహస్ర నామ పారాయణ చేసి, జలమును నివేదన చేసి, ఆ జలపానము చేసి, మందిరం వద్ద నిద్రించారు.

కలలో బాల వచ్చి “ఓరీ! ముష్టి పెడతాను, కొంగు పట్టు” అని దోసెడు బియ్యం పోసింది. “బండి వస్తుంది పో” అంది బాల. స్వప్నం కరిగిపోయింది.

ఖాజీపాలెం రాజుగారు తెల్లవారగానే, బండిని పంపి, శాస్త్రిగారిని పిలిపించుకుని పురాణం చెప్పించుకుని, ఇంటికి బండిపై పంపారు.

ఇంటి వద్దకు రాగానే పుట్టెడు ధాన్యపురాశి కనిపించింది శాస్త్రి గారికి.

శాస్త్రిగారు 10 – 12 – 1990న (ప్రమోదూత మార్గశిర బహుళ నవమినాడు బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఒడిలో శాశ్వతంగా చేరిపోయారు.

శ్రీ శాస్త్రిగారి పేరు వినినా, స్మరించినా శుభాలు కలుగుతాయి!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles