Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి మహాల్సాపతితో “నా శరీరాన్ని మూడు దినములు కాపాడుము. నేను తిరిగి వచ్చితినా సరే, తిరిగి రాకున్నా, ఈ నా దేహమును ఆ వెలుపలి ప్రదేశమున (వ్రేలితో చూపించి) భూస్థాపితము చేయుము. చిహ్నముగా అచట రెండు జెండాలను పాతుము” అన్నారు,
మార్గశిర పూర్ణిమ డిసెంబరు 11, 1886 నాడు.
సాయి వాక్కులందు విశ్వాసము, మనోధైర్యములతో సాయి శరీరాన్ని కాపాడినాడు మహల్సాపతి. ఈ విషయమున సాయి భక్తులందరూ మహల్సాపతికి రుణగ్రస్తులే.
మహల్సాపతి ధైర్య సాహసములు, ఓరిమి, నమ్మకము లేకుండిన, సాయినాథుని చరిత్ర 1886 లోనే ముగిసెడిది.
సాయిబాబా తిరిగి శరీరంలోనికి వచ్చువరకు ఏమి చేసినాడను ప్రశ్నకు ఏనాడూ జవాబు లభించదు.
సాయి తనకున్న ఉబ్బసపువ్యాధిని తొలగించుకొనుటకు “ప్రాణాయామము” చేసినాడంటారు.
సాయికి వ్యాధులు కొత్తకాదు. అవి అల్లా ఇచ్చినవే అని సహనంతో భరించేవాడు. అటువంటి వాడు వ్యాధి నిర్ములనకు ప్రాణాయామము చేయదంటారు కొందరు.
మరికొందరు ఆ సమయమున మరణశయ్యపై నున్న రామకృష్ణ పరమహంస కడకేగి ఆధ్యాత్మిక రహస్యములు తెలిసికొని వచ్చేనాడని అందురు.
అయితే రామకృష్ణుల దేహ విసర్జన కాలముతో ఈ సంఘటన కాలము సరిపోదు.
మహాల్సాపతితో “అల్లాను చూచితిని. కొన్ని సంవత్సరము లిండుంది నేను కావింపదగిన పనులను నిర్వర్తించుటకై తిరిగి వచ్చితిని” అని సాయి బాబా పలికినాడని కొందరందురు.
కొందరు దానిని “శబ్దాతీత, శాస్త్రాతీత, తత్వాతీత, తర్కాతీత చర్య” గా పేర్కొంటారు.
ఇటువంటి సంఘటనలు కొందరి జీవిత చరిత్రలలో కానవస్తాయి. జీసస్ శిలువ చేసిన తరువాత మూడు దినములకు పునరుజ్జీవుడయ్యాడు.
అయితే తాను భౌతిక కాయాన్ని వదలి అంతర్దానమైనా అయన లక్ష్యం కొనసాగేటట్లు చూచుచున్నాడు.
రమణ మహర్షి కొన్ని గంటలపాటు మరణానుభూతిని పొందినాడు. తిరిగి అదే భౌతిక కాయంతో శరీరమే తాననే అజ్ఞానాన్ని ప్రజలలో పోగొట్ట ప్రయత్నించాడు.
సాయినాథుడు ముందు ముందు చూపే మహాత్తులకు, బోధలకు, ఆచరణకు నాందిగా నిలిచింది 1886 మార్గశిర పూర్ణిమ.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- బాధల బదిలీ…..సాయి@366 డిసెంబర్ 18….Audio
- మసీదులో బాల దత్తుడు…..సాయి@366 డిసెంబర్ 4….Audio
- నేనున్నాను …..సాయి@366 డిసెంబర్ 31…Audio
- జ్ఞానిని గుర్తించిన జ్ఞాని …..సాయి@366 డిసెంబర్ 1….Audio
- వైద్యో నారాయణో సాయి: …..సాయి@366 డిసెంబర్ 5…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments