Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
రమణ మహర్షి శ్రీ బి. వి నరసింహ (అయ్యర్) స్వామిని సాయినాథుని సన్నిధికి చేరమని ఆదేశించారు.
నరసింహ స్వామి గారు కొంతకాలము తరువాత షిరిడీ చేరారు. సాయినాథుడు నరసింహ స్వామి గారికి సత్పురుషుడు, జ్ఞాని, గురువు, దైవము, తోడు నీడ అయ్యాడు.
సాయినాథునిపై ఆయన రచనలు చేయసాగారు. అందులో ఒకటి ” గ్లింపసిస్ ఆఫ్ సాయి బాబా”.
అది తిరువణ్ణామలై. సాయం సమయము. 1 -12 -1945 సాయం కాలం వేద పారాయణ అనంతరం భగవాన్ (రమణ మహర్షి) ఒక గ్రంథాన్ని పరిశీలిస్తున్నారు.
అయన శ్రీ దేవరాజు ముదలియార్ వైపు తిరిగి ఆ గ్రంథం బి.వి.నరసింహ అయ్యర్ రచించిన “సాయి బాబా చరిత్ర” గ్లింపసిస్ ఆఫ్ సాయి బాబా) అని దానిని ష్రాఫ్ అనేవారు భగవానుని పరిశీలనకు తీసుకుని వచ్చారని అన్నారు.
దేవరాజు ముదలియార్ ఆ గ్రంధాన్ని ఉదయం ష్రాఫ్ గారి గృహంలో చూచానని అన్నారు.
ఇంకా, సాయిబాబాను గూర్చి ఇదివరకు రచించిన పుస్తకాలకంటే కొత్తదనం ఏమైనా దీనిలో ఉన్నదా అని ఆలోచిస్తున్నానని అన్నారు.
జస్టిస్ కుప్పుస్వామి అయ్యర్ గారు ఆ పుస్తకానికి ఉపోద్ఘాతాన్ని వ్రాశారు. వారి ఉపోద్ఘాతాన్ని భగవాన్ పైకి అందరూ వినేటట్లు చదివారు.
హాలులో ఉన్న డాక్టర్ సయ్యద్ గారు తాను కూడా ఆ పుస్తకాన్ని చదివాను అన్నారు.
ఇంకా తాను నరసింహ అయ్యర్ ను కలిసినప్పుడు సాయి బాబా ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారాన్ని గూర్చి బోధించారా అని ప్రశ్నించినప్పుడు నరసింహ అయ్యర్ సమాధానం చెప్పలేకపోయారని అన్నాడు.
వెనువెంటనే భగవాన్ ఉపోద్ఘాతం నుండి ఒక వాక్యం చదివారు.
సాయిబాబా భక్తులకు భౌతిక బాధా నివారణకు వరములను ప్రసాదించడమే కాకుండా పరమావధియగు ఆత్మ సాక్షాత్కారం వారు పొందటానికి సుముఖం చేశారు కూడా.
అంటే సాయి ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా భక్తులు పొందటానికి దోహదపడ్డారని రమణులు తెలిపారు.
రమణులను ఆశ్రయించిన వారు సైతం సాయిని మహా సమాధి చెందక పూర్వంగాని, తరువాత గాని దర్శించారు.
ఉదాహరణకు శుద్ధానంద భారతి, ఆర్డర్ అస్ బోర్న్, కన్హన్ గఢ్ స్వామి రామదాసు, మొరార్జీ దేశాయ్ తదితరులు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గూడు చేరిన బీవీఎన్…..సాయి@366 ఆగస్టు 29….Audio
- “నిన్ను విడిచి నేను పోలేనులే” …..సాయి@366 మే 27…Audio
- గూడు చేరిన పక్షి…..సాయి@366 జనవరి 26….Audio
- గురుభక్తి…..సాయి@366 ఏప్రిల్ 17….Audio
- కల నిజ మాయెగా! …..సాయి@366 డిసెంబర్ 27….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “జ్ఞానిని గుర్తించిన జ్ఞాని …..సాయి@366 డిసెంబర్ 1….Audio”
మాధవి
December 1, 2019 at 2:17 pmమూర్తిగారు..మంచి ఆర్టికల్స్ మీరు ఇస్తున్నారు..ఓం సాయి రాం.