Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయి సన్నిధిలో అంటే షిరిడీ సాయినాథ మందిర ప్రాంగణంలో ఎన్నో మందిరాలు, ఉద్యానవనం, సమాధులు ఉన్నాయి. ఆ సమాధులలో ఒకటి శ్రీ వి. పద్మనాభ అయ్యర్‌ది.
ఆయన సుగర్ టెక్నాలజిస్టు. సాయి భక్తుడు అతని భార్యాబిడ్డలు లక్నోలో ఉండేవారు. ఆయన చక్కర ఫ్యాక్టరీలో పని చేసేవాడు.
1943-44లో అయ్యర్‌కు ఉద్యోగం దొరకలేదు. ఆరుగురు పిల్లలు చదువుకుంటున్నారు. ఉద్యోగం దొరకలేదనే చింత ఆయనకు లేదు.
అన్నిటిని సమకూర్చేది సాయియే అనే భావన ఆయనది. 1944లో కోపర్గాంకి దగ్గరున్న లక్ష్మీవాడిలో ఉద్యోగం వచ్చింది.
”చూశారా! సాయి కరుణ. ఆయన నన్ను తన దగ్గరకు రప్పించుకున్నారు” అనేవారాయన.
లక్ష్మీవాడి నుండి షిరిడీకి సమయం చిక్కినప్పుడల్లా వెళ్ళేవాడు. ఆరతులో పాల్గొనేవాడు.
అయ్యర్ సమాధి మందిరంలో ఉన్నప్పుడు తనను తానే మరచిపోయేవాడు. అనేక సార్లు ఇతర భక్తులు ”మీరు లక్ష్మీవాడి వెళ్ళాలి గదా” అని గుర్తు చేసేవారు.
అది మే 26, 1945 లక్ష్మీవాడిలో పని అయిపోయింది. ఇక లక్నో వెళ్ళాలి, అక్కడకు వచ్చిన ఇద్దరు కుమారులతో కలసి. కడసారిగా బాబా దర్శనం చేసుకునేందుకు వారు సాయంకాలం షిరిడి వెళ్ళారు.
సమాధి మందిర స్థంభానికి ఆనుకుని కూర్చున్నాడు. కనులు మూసుకుని సాయిని ధ్యానించసాగాడు. కనుల వెంట కన్నీటి ధారలు కారసాగాయి.
చుట్టు ప్రక్కల ఏమి జరుగుతోందో ఆయనకు తెలియదు. చుట్టు ప్రక్కల వారు ఆయనతో మాట్లాడాలని ప్రయత్నించారు.
రాత్రి 9 గంటలకు స్పృహలోకి వచ్చి అతి కష్టం మీద బయటకు వచ్చాడు.
తెల్లవారు జామున తనకు అనారోగ్యంగా ఉందని కుమారులను లేపాడు. డాక్టరును తీసుకురాగా ఆయన కలరా అని తేల్చాడు.
అయ్యర్ తనకు సాయి పటం కావాలన్నాడు. వారు సాయి పటాన్ని ఇవ్వగా దానిని గుండెలపై పెట్టు కున్నాడు ”బాబా” అంటు అంతిమ శ్వాస తీసాడు పద్మనాభ అయ్యర్.
అందరూ ఆయన భక్తిని శ్లాఫిుంచిన వారే. భక్తులు షిరిడీ సంస్థానం వారిని కలిసారు. అక్కడే ఆయనకు సమాధిని ఏర్పాటు చేశారు.
ఇక అయ్యర్ షిరిడీని వీడనక్కరలేదు.
”నిన్ను విడచి నేను పోలేనులే!” అంటాడు సాయి భక్తుడు
అది నిజమేలే అంటాడు సాయి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- జ్ఞానిని గుర్తించిన జ్ఞాని …..సాయి@366 డిసెంబర్ 1….Audio
- శ్రీ. రావ్ సాహెబ్ వి.పి.అయ్యర్ – మొదటి బాగం….
- జన్మతః మూగ అమ్మాయి కి బాబా సమాధి చూడగానే మాట్లాడిన వైనం
- మూకం కరోతి వాచాలం …..సాయి@366 మార్చి 29….Audio
- చీకటిలో కారు చీకటిలో …..సాయి@366 డిసెంబర్ 29….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments