Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
” ఓం సాయి రాం”
ఇప్పుడు నేను చెప్పబోయే బాబా వారి లీల కుంభకోణం కు చెందిన మని అయ్యర్ వాళ్ళ అమ్మాయిది.
మన శరీరం లో ఉన్న పంచేంద్రియాలలో వాక్కు సరస్వతి స్వరూపం అంటే మీరూ వప్పుకోవాలసిందే.
దేనికదే ముఖ్యం కదా! పాపం కుంభకోణం ,తమిళనాడు కు చెందిన మని అయ్యర్ కూతురు జన్మతః మూగది.
వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసారు మాటలు రప్పించాలని.కానీ ఒక్కటి పని చేయలేదు.
మన కష్టాలు పోయేదానికి ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు సాయి నాథుని మార్గం అందరికి తెరిచివుంటుంది.
అలాగే వాళ్ళు బాబా వారి పూజ,ఆరాధన చెయ్యడం మొదలుపెట్టారు.అతి కొద్ది రోజుల్లోనే బాబావారు మని అయ్యర్ స్వప్నం లో వచ్చి” మీ అమ్మాయిని షిర్డీ తీసుకొని రా” అని చెప్పారు.
వెను వెంటనే వాళ్ళు షిర్డీ కి ప్రయాణం అయ్యారు. షిర్డీ చేరిన వెంటనే వాళ్ళు ఆ అమ్మాయిని సమాధి మందిర్ కు తీసుకెళ్లారు.
ఎప్పుడైతే ఆ అమ్మాయి బాబా సమాధి దగ్గరికి వచ్చిందో,వెంటనే” సాయి బాబా” అని గట్టిగా పలికింది.
అదే ఆ అమ్మాయి జీవితం లో మొదటి పలుకు.
కొంత కష్ట పడిన అమ్మాయి జీవితం సార్థకం అయింది.
బాబా వారి అమితమైన కృపకు పాత్రురాలు అయింది.
ఆ అమ్మాయి మాట్లాడడం చూసి ఆమె తల్లి తండ్రులు ఎంత సంతోష పడింటారో మనము ఊహించగలము..
అందుకే బాబా వారు సాయి చరిత్రలో చెప్పినట్లు” ఆకాశం మబ్బులు నిండి ఉంది.కొంచం ఆగండి,
మబ్బులన్ని తొలగి పోతాయి” అనేవారు.అదే బాబావారు మనకు ఇచ్చిన మంత్రం” సబూరి” అవును కదా!
“సర్వం సాయి నాతర్పణ మస్తు”
Latest Miracles:
- భవ్యష్యత్తుని ముందుగానే సూచించిన బాబా.
- గురువారం భక్తులను గురు భక్తులుగా బాబా వారు మార్చుకొనిన వైనం
- బాబా ఆశీర్వాదంతో జరిగిన మా అమ్మాయి పెళ్లి …..!
- మా అమ్మాయి పెళ్లి అన్ని ఆటంకాలు తొలగించి బాబానే జరిపించారు–16
- బాబా తన భక్తురాలికి తానే ప్రసాదం పంపిన అద్భుత లీల(ఇందిరా గారి అనుభవాలు)–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments