Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
కాశీబాయి హంసరాజ్ తన భరతో 1916 డిసెంబర్ ప్రాంతంలో షిరిడీలోని సాయి సన్నిధికి చేరింది.
ఆమె భర్తకు సాయి సన్నిధిలో జరిగిన సంఘటనలను 20 సంవత్సరాల అనంతరం 1936 డిసెంబర్ 2 న తెలియచేసింది.
సత్పురుషులు సాయినాధుని వద్దకు తమ సందర్శకులను, భక్తులను పంపటం సహజమైన విషయం.
గజానన్ మహారాజ్ కపర్దేను పంపాడు. తాజుద్దీన్ బాబా బుట్టీను పంపాడు. నాసిక్ లోని నరసింగ మహారాజ్ హంసరాజ్ దంపతులను పంపాడు.
హంసరాజ్ కు ఉబ్బసపు వ్యాధి ఉండేది. సాయి బాబా ఆయనను పుల్లని పదార్ధాలను తినవద్దన్నారు.
హంసరాజ్ కు పుల్లని పెరుగు అంటే పంచ ప్రాణాలు. అది లేకుండా పూట గడిచేది కాదు.
సాయి పుల్లనివి మానమన్నాడు గదా అని చెబితే, చావనైనా చస్తాను గాని పుల్లని పెరుగు తినటం మానలేను అంటాడు హంసరాజ్.
ఆయన భార్యకు ఏమి చేయాలో తోచటం లేదు. ఆమెకు షిరిడీలో ఉదయం, మధ్యాహ్నం పెరుగు దొరికేది కాదు.
అందుకని ఆమె రాత్రిపూట పాలు కొని, తోడు వేసేది. తెల్లవారేటప్పటికి తోడుకొనేవి పాలు.
ఆ దంపతులు ప్రతి దినం మద్యాహ్న ఆరతిని చూచి, వాడాకు వచ్చి భోజనం చేసేవారు. ఇది వారి దినచర్య.
ఆమె పెరుగు తోడు పెట్టేది. మధ్యాహ్నం భర్తతో ఆరతికి వెళ్ళి, వాడాకు వచ్చేసరికి ఆ పెరుగును ఎవరో తినివేసినట్లు అనిపించింది. చూడగా అది పిల్లి నిర్వాకం అని తేలిపోయింది.
పుల్లని పెరుగు లభ్యం కావటం లేదు హంసరాజ్ కు. అతనికి పిల్లిపైన కోపం వచ్చింది. కొడదామంటే చిక్కకుండా పారిపోయేది.
దీని భరతం పడదామని ఒక రోజు మధ్యాహ్నం ఆరతి మానుకుని, పిల్లి కోసం కాపుకాచాడు.
అతను పరాకుగా ఉన్న సమయంలో పిల్లి వచ్చి పెరుగును తింటుండగా చూచి కర్రను విసిరాడు పిల్లిపైకి. దానికి గాయమైంది.
తరువాత ద్వారకామాయికి వెళ్లగా బాబా హంసరాజ్ ను చూచి ” ఒక మూర్ఖుడు పుల్లటి పెరుగు తిని ఎక్కడ చస్తాడోనని, పిల్లిలా వెళ్ళి ఆ పెరుగును నేను తిని వస్తుంటే నన్ను వీపు మీద కొట్టాడు చూడండి” అని సాయి తన వీపు మీద దెబ్బలను అందరికి చూపాడు.
హంసరాజ్ తల తిరిగినట్లయింది. ఇదంతా సాయి తనను కాపాడేందుకు చేస్తున్నాడా? అని కన్నులలో నీరు నింపుకొని, బాబా పాదాలపై పడ్డాడు.
ఎంతైనా దాసుని తప్పులు దండముతో సరి!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- హంసరాజ్ యొక్క ఉబ్బసం వ్యాధిని నయం చేసిన బాబా వారి లీల—Audio
- తెలియగలేరే నీ లీలలు! …..సాయి@366 ఆగస్టు 26….Audio
- షిరిడీ ప్రవేశము…..సాయి@366 అక్టోబర్ 26…Audio
- తెలియగలేరే నీ లీలలు …. మహనీయులు – 2020… అక్టోబరు 12
- తెలియగ లేరే నీ లీలలు …..సాయి@366 అక్టోబర్ 17….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments