Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
వ్యాధులు మూడు రకములు. భూత ప్రేతములు ఆవహించుట, ఉన్మాదము కలిగించుట మొదలగు వాటిచే కలుగునవి ఆధిభౌతిక తాపములు. సాయి ఆధిభౌతికతాపములను తొలగించినాడు.
హంసరాజ్‌కు సంతానం లేదు, ఆరోగ్యం సరిగాలేక బాధపడేవాడు. ఆయన భార్యతో కలసి నాసిక్‌కు చెందిన నరసింగ మహారాజ్‌ను ఆశ్రయించారు.
హంసరాజ్‌ను దుష్ట శక్తి పీడిస్తున్నదనియు అందుచే సంతానము కలుగుట లేదని ఆ దుష్ట శక్తిని బాబా రెండు చెంపదెబ్బలతో తరిమివేయగలడని కూడా చెప్పారు.
వారు సాయి వద్దకు చేరారు. బాబా హంసరాజ్ చెంపపై రెండు మార్లు కొట్టి ”దుష్ట శక్తి పో’‘ అన్నారు. ఆ క్షణం నుండి దుష్ట శక్తి వీడింది.
సాయి మహా సమాధి చెందారు. 1952 మార్చిలో బాబారాం సఖారాం సూలేకు సుశీలాబాయితో వివాహమైంది. ఆరు నెలలు చక్కగా సంసారం చేసారు. అనంతరం గ్రహణం పట్టినట్టయింది సుశీలాబాయికి.
ఆమె దవడ కదలదు. ఎప్పుడూ బిగుసుకునే ఉండేది. ఉన్నట్లుంది స్పృహ కోల్పోయేది. డాక్టర్లు ఎన్నో మందులను వాడారు కాని ఫలితం శాన్యం.
ఒకసారి బాబారాం సఖారాం సూలే తండ్రి ఆమెను షిరిడీకి తీసుకుపొమ్మన్నారు కుమారునితో.
ఆమెను అక్టోబరు 25, 1952లో షిరిడీకి తీసుకుపోయారు ఆమెకు బాబా సమాధి దర్శనం చేయించారు.
ఆమెను ఆరతికి తీసుకుపోదాము అనుకున్నారు. కానీ, ఆమె రానన్నది. బలవంతంగా ఆమెను ఆరతికి తీసుకు వెళ్ళారు. సమాధి చుట్టూ ప్రదక్షిణాన్ని చేయించారు.
ఆ రోజు అక్టోబరు 26, 1952. సాయంకాలపు ఆరతికి కూడా ఆమెను బలవంతంగా తీసుకు వెళ్ళారు. ఆమె హఠాత్తుగా మూర్చపోయింది.
ఇతరుల సలహాపై ఆమెకు ఊది తీర్థం ఇచ్చారు. కొంతసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది. మామూలు మనిషి అయింది. మాట్లాడసాగింది.
ఆమె ఒకసారి బేలాపూరులో పెద్ద చెట్టు క్రింద నుండి వస్తున్నప్పుడు ఒక భిల్ల స్త్రీ తనను ఆవహించినట్లు చెప్పింది.
ఇప్పుడు సాయినాథుని సమాధి దర్శనము, ఊది తీర్ధములతో ఆ భిల్ల స్త్రీ పారిపోయిందని చెప్పింది. తరువాత ఆమెయే స్వయంగా బాబా సమాధికి ప్రదక్షిణలు చేసింది. సాష్టాంగ నమస్కారము కూడా చేసింది. ఆ శుభ దినం అక్టోబరు 26, 1952.
షిరిడీ నుండియే సర్వ కార్యములు చేయు సాయినాథునికి సాష్టాంగ నమస్కారం చేద్దాము.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- దుష్ట శక్తులు…..సాయి@366 జూన్ 26….Audio
- నీ కోసమే నే జీవించునది…..సాయి@366 అక్టోబర్ 27….Audio
- బాబా …..సాయి@366 జనవరి 28….Audio
- బూటీ వాడా…..సాయి@366 అక్టోబర్ 16….Audio
- చతుష్పాదులు – ఉత్తమ గతులు…..సాయి@366 అక్టోబర్ 8….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “షిరిడీ ప్రవేశము…..సాయి@366 అక్టోబర్ 26…Audio”
Vijaya Vani
October 26, 2020 at 3:53 pmMy knees and legs are paining unable to go by stairs. Please bless me with good health and able to walk fast go by stairs without any difficulty. Thank you.
Vijaya