Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
యోగ మాయ లేక అది శక్తి అని పిలువబడే ముక్తాబాయి, నివృత్తి, జ్ఞానేశ్వర, సోపానుల చిట్టి చెల్లెలు.
ఈమె 1279 ప్రమాధి నామ సంవత్సర (సామాన్యంగా అక్టోబర్ లో వచ్చే) అశ్యయుజ శుద్ధ పాడ్యమి రోజున జన్మించింది.
18 ఏండ్లకే దేహాన్ని విడిచింది. జానాబాయి సమకాలీనురాలు. ఈమె జానా వలె అభంగాలను వ్రాసింది.
కాని అతి తక్కువగానే అవి లభిస్తున్నాయి. ఆ ముగ్గురి అన్నల ముద్దుల చెల్లెల జీవితంలో జరిగిన సంఘటనలన్నీ అద్భుతాలే.
ఒకసారి నదికి వెళ్లి స్నానం చేసి వచ్చిన ముక్తాబాయి ఇంటికి రాగా అన్న అయిన జ్ఞానదేవుడు విషాదంగా ఒక మూల కూర్చున్నాడు. తన యోగ శక్తిచే కారణం తెలుసుకుంది.
జ్ఞానేశ్వరుని ఎవరో భ్రష్ట సన్యాసి పుత్రుడన్నారు. దుఃఖంలో బాధపడుతున్న అన్నకు ఒక అభంగం ఆశువుగా పాడి వినిపించింది – దానినే తటీ చే అభంగమంటారు.
“….నిర్మలమైన అంతఃకరణ కలిగి ఇతరుల అపరాధలను క్షమించు వాడే సన్యాసి. క్రోధముతో ప్రపంచం నిప్పులా దహించుకు పోతున్నా శాంతముతో జలములా చల్లగా జీవించువాడే సాధువు….” అంది. జ్ఞానేశ్వరుని దుఃఖం తొలగింది.
ఎవరు ఎంతటి వారైనను వారిలోనున్న లోపమును చెప్పెడిదీమె. నామదేవుని కీర్తి నలుమూలలా వ్యాపించింది.
పాండురంగని దర్శించటానికి వచ్చిన వారందరూ ముందుగా నామదేవునికి నమస్కరించటం ఆనవాయితీ అయింది.
ఈ విషయం తెలియక మొదటి సారిగా ముగ్గురు అన్నదమ్ములు, చెల్లితో, నామదేవునకు నమస్కరించకుండా లోనికి పోయారు.
అహర్నిశలు పాండురంగని సేవలో ఉన్న నన్ను పట్టించుకోలేదని, నామదేవు బాధపడ్డాడు, కోపగించాడు.
చాలా చిన్న పిల్ల అయిన ముక్తాబాయి అతని (నామదేవుని) గర్వం ఆత్మసాక్షాత్కారానికి భంగకరం అంది. ఆశువుగా అభంగం చెప్పింది కూడా.
ఒకసారి చాంగ్ దేవ్ జ్ఞానేశ్వరునకు ఉత్తరం వ్రాయదలచి ఎలా సంబోధించాలో తెలియక, ఖాళీ ఉత్తరాన్నే జ్ఞానేశ్వరునకు పంపుతాడు.
ఆ ఖాళీ ఉత్తరాన్ని చూచి ఆమె “చాంగ్ దేవుడు ఎన్ని విద్యలు అభ్యసించినను, ఎన్ని సిద్దులు సాధించినను, ఇంకను అతని జీవితము ఖాళీగానే ఉంది వ్యర్థమగు చున్నది” అంది అన్నలతో.
ఇంకను చాంగ్ దేవ్ లోని చిత్తము స్థిరముగా లేకుండుట చూచి “నీవు జ్ఞానదేవుని ఉపదేశామృతమును గ్రోలి స్థిత ప్రజ్ఞుడవు కమ్ము” అని సలహా ఇచ్చింది.
అన్న జ్ఞానేశ్వరుని సలహాతో చాంగ్ దేవునికి, విశోబాఖేచరుకు గురువుగా ఉపదేశమిచ్చింది ముక్తాబాయి.
ముక్తాబాయిని స్మరించి, ఆమె అభంగములను ఆచరింతుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- ఆరతి జ్ఞానరాజా!…..సాయి@366 అక్టోబర్ 25….Audio
- దైవంతో స్నేహం …. మహనీయులు – 2020… అక్టోబరు 29
- చద్ది కూడు.. …. మహనీయులు – 2020… అక్టోబరు 3
- జ్ఞానేశ్వరుని పుత్రిక …. మహనీయులు – 2020… డిసెంబరు 19
- తన్ను భగవంతునిగా తలచుటకు భక్తుని ఆస్తమా వ్యాధిని తగ్గించుట–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments