ఆరతి జ్ఞానరాజా!…..సాయి@366 అక్టోబర్ 25….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయిబాబాకు రాత్రి ఇచ్చే ఆరతులలో జ్ఞానేశ్వర ఆరతిని రామ జనార్ధనుడు రచించారు. అటు జ్ఞానేశ్వరుడు, ఇటు సాయి బాబా సమాజ హితం కోసం ఎంతో కష్టపడ్డారు.

రామజనార్ధనుడు ఆరతిలో ”లోపలే జ్ఞానజగీ – హితనేణతీ కోణీ” అని వ్రాశారు. అంటే ”ఈ జగమందు జ్ఞానము నశించిపోగా ప్రతి ఒక్కడు ఆత్మ హితమును కోల్పోయినారు” అని అర్థం.

జ్ఞానాన్ని నశింపచేసేది కంటికి కనిపించని అహంభావం.

ఒకసారి జ్ఞానేశ్వరుడు సోదరీసోదరులతో ఒక మొండిగోడపై కూర్చుని ఉండగా చాంగ్‌దేవ్‌ తన డాంబికాన్ని చూపుదామని గాండ్రించే పెద్దపులిపై సవారీ చేస్తూ, చేతిలో పామును కర్రగా చేసుకొని అట్టహాసంగా బయలుదేరాడు జ్ఞానేశ్వర్‌ చెంతకు.

చాంగ్‌దేవ్‌కు స్వాగతం పలుకుదామని మొండిగోడను తట్టగా, ఆ గోడ చాంగ్‌దేవ్‌ వద్దకు జ్ఞానేశ్వరుని సోదరీసోదరులతో వస్తోంది.

ఆకాశంలో గోడపై నలుగురి పిల్లలను చూచి చాంగ్‌దేవ్‌ ఆశ్చర్యచకితుడయ్యాడు. చాంగ్‌దేవ్‌ వెంటనే పులిమీద నుండి దిగి, పామును పారవేసి జ్ఞానేశ్వర్‌ సోదరీ సోదరుల వైపు పాదచారియై నడిచాడు.

వారు గోడ మీద నుండి దిగి స్వాగతం పలికారు. చాంగ్‌ వారితో సంతోషంగా సంభాషించాడు. జ్ఞానేశ్వరుని పాదాలపైబడి జ్ఞానభిక్ష కోరాడు చాంగ్‌దేవ్‌.

”రేపు ఉపదేశం ఇస్తాం. ఎవరైనా ప్రాణ దానం ఇవ్వాలి’‘ అన్నాడు జ్ఞానదేవుడు. ”నాకు కొన్ని వేలమంది శిష్యులున్నారు. ప్రాణ దానం నా కోసం చేయటం పెద్ద పనికాదు రేపు కలుస్తాను” అని సెలవు తీసుకున్నాడు చాంగ్‌దేవ్‌.

శిష్యులను ప్రాణ దానం చేయమని కోరాడు చాంగ్‌దేవ్‌. ఎవ్వరూ అందుకు అంగీకరించ లేదు. ఎవరి ప్రాణాలు వారికి తీపి. ఇది తన తల కొట్టివేసినట్టు అయిందనిపించింది చాంగ్‌దేవ్‌కు.

తాను గొప్ప గురువు అనే అహంభావం తొలగిపోయింది. మరునాడు శిష్యులతో జ్ఞానేశ్వరుని వద్దకు వచ్చాడు. తన శిరస్సునే బలి చేస్తానని చెప్పి జ్ఞానదేవుని పాదాలపై పడ్డాడు చాంగ్‌దేవ్‌.

”బలి అక్కరలేదు. బలి అంటే అహంభావ నిర్మూలనే. నీలో అహంభావం తొలగింది. ముక్తాబాయి ఉపదేశం ఇస్తుంది” అన్నాడు జ్ఞానదేవ్‌.

ముక్తాబాయి 1400 ఏండ్ల చాంగ్‌దేవ్‌కు గురువైంది. పరమాత్మ స్వరూపుడైన సాయియే జ్ఞానేశ్వరుని ఆరతి వచ్చినప్పుడు చేతులు జోడించి నమస్కరించే వాడు.

ఈ నాడు అక్టోబరు 25. జ్ఞానేశ్వరుడు సజీవ సమాధిపొందిన దినం.

జ్ఞానేశ్వరుని స్మరించెదము గాక! ఓం జ్ఞానేశ్వరాయ నమః!!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles