Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
హేమాడ్‌పంత్ సాయి సచ్చరిత్రలో నామదేవుని ప్రసక్తి వస్తుంది. భీష్ముడు తన ఆరతి పాటలలో నామదేవుని అభంగాలను చేర్చుకున్నాడు.
ఇంకా, సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథసాహెబ్‌లో నామదేవుని 61 (శబ్దాలు) అభంగాలు ఉన్నాయి.
జ్ఞానేశ్వరుడు, నామదేవుడు యాత్రలు చేస్తూ కోలాయత్ గ్రామం చేరారు. ఆ ఇద్దరికీ విపరీమైన దాహం వేసింది. ఎదురుగా ఒక బావి కనబడ్డది. బొక్కెన లేదు. కాని నూతిలో నీరున్నది.
జ్ఞానదేవుడు తన యోగ శక్తితో సూక్ష్మరూపం పొంది నూతిలోనికి దిగి, నీరు త్రాగి దాహం తీర్చుకుని పైకి వచ్చాడు. ”నువ్వు ఇలాగే చేయి” అన్నాడు జ్ఞానేశ్వరుడు నామదేవునితో.
నామదేవుడు ”ఓ! పాండురంగా, నీ భక్తులు దాహంతో తల్లడిల్లి పోతున్నారయ్యా! ఊరుకుంటావేమిటి? దాహం తీర్చవయ్యా” అని రంగని అర్ధించాడు.
ఒక ఊట నూతి నుండి చిమ్మింది. దానితో నామదేవుడు, ఇతరులు దాహం తీర్చుకున్నారు.
జ్ఞానేశ్వరుడు నామదేవుని కౌగిలించుకుని ”నువ్వయ్యా నిజమైన భక్తుడివి” అని కొనియాడాడు. సాయి కూడా అన్ని మార్గాలకంటే భక్తి మార్గానికే పెద్ద పీట వేశాడు.
నామదేవుని ఇంటి సమీపంలో పరిస్సా భగవత్ భార్య నామదేవుని బీదరికం చూచి జాలిపడి, నామదేవుని భార్యకు పరశువేదిని ఒక రోజు వాడుకొని మరునాడు ఇచ్చివేయాలని షరతు పెట్టింది.
నామదేవుడు ఆ సంగతి తెలుసుకుని పరుశువేదిని నదిలోకి విసరివేశాడు. పరిస్సా భగవత్ వచ్చి తన పరుసవేదిని అడిగాడు.
నామదేవుడు నదిలోనికి వెళ్ళి చాలా రాళ్ళను ఇచ్చి నీకిష్టమైన దానిని తీసుకొమ్మన్నాడు.
పరిస్సాభగవత్ ఆ రాళ్ళను పరీక్షించగా అన్నీ పరశువేదులే. అంతటి మహిమ గల నామదేవుడు బీదరికంలో ఎందుకు మగ్గుతున్నాడో అర్థం అయింది అతనికి.
నామదేవుని పాదాలపై పడ్డాడు జ్ఞాన భిక్షను ప్రసాదింపుమని కోరి, రాళ్ళను నదిలోకి విసిరేశాడు.
కనుసైగతో మహారాజుల్ని చేయగలిగిన సత్తా ఉన్న సాయి, ఫకీరుగా జీవించాడు.
దైవ నామ స్మరణే తరగని సిరి, సంపదలు నామదేవునికైనా సాయినాథునికైనా.
నామదేవుడు అక్టోబరు 29, 1270న జన్మించాడు. ఈనాడు ఆయన వ్రాసిన అభంగాలను పఠిద్దాం – భక్తి మార్గంలో పయనిద్దాం!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- దైవంతో స్నేహం …. మహనీయులు – 2020… అక్టోబరు 29
- ఉపవాసము…..సాయి@366 అక్టోబర్ 11….Audio
- మోక్షం ఎందుకు?…..సాయి@366 నవంబర్ 27….Audio
- బూటీ వాడా…..సాయి@366 అక్టోబర్ 16….Audio
- నీ కోసమే నే జీవించునది…..సాయి@366 అక్టోబర్ 27….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “భక్తి సంపద…..సాయి@366 అక్టోబర్ 29….Audio”
pragathi
October 31, 2019 at 8:44 amSaibaba saibaba saibaba saibaba saibaba saibaba saibaba saibaba saibaba saibaba saibaba