చతుష్పాదులు – ఉత్తమ గతులు…..సాయి@366 అక్టోబర్ 8….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


నాసిక్ నివాసి ఎస్‌.బి. ధూమాల్‌ సాయి భక్తుడు. ధూమాల్‌ భార్య మరణించింది. ఆమెకు ప్రతి నెల మాసికం పెట్టేవాడు. ఆరవ మాసికం పెట్టాలి.

అంతకుముందు షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించాడు. సాయి బాబా ”ఈ సారి మాసికం షిరిడీలో పెట్టు. నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను” అన్నారు. ధూమాల్‌ షిరిడీలో మాసికం పెట్టాడు.

అయితే సాయిబాబా మానవులకే ఉత్తమ గతులను ప్రసాదిస్తారా? అనే అనుమానం రావటం సహజం.

జ్ఞానేశ్వరుడు చతుష్పాది అయిన ఒక గేదెతో వేదాలు చెప్పించాడు. ఆ గేదె మరణించింది. దానికి సమాధి కట్టి సద్గతిని ప్రసాదించారు జ్ఞానేశ్వరులు.

తాజుద్దీన్‌ బాబా వద్ద షేరు అనే కుక్క ఉండేది. అది తాజుద్దీన్‌ బాబా కోసం వచ్చే సందర్శకులను, తాజుద్దీన్‌ బాబా ఎక్కడున్నారో అక్కడకు తీసుకు పోయేది.

అది మరణించింది. దానికి సమాధి కట్టించారు. అది యాత్రా స్థలంగా మారింది.

సాయిబాబా వద్దకు అక్టోబరు 8, 1918న దర్వీషులు ఒక బండిలో పెద్దపులిని తీసుకు వచ్చారు. దానికి జబ్బు చేసింది. నయం చేయించటానికి ఆ దర్వీషులు ఎంతో ప్రయత్నం చేసారు. ఫలించలేదు.

చివరగా సాయి బాబా పేరు విని, సాయి దాని వ్యాధి కుదురుస్తాడని ద్వారకామాయికి తెచ్చారు.

పులి ద్వారకామాయి మెట్ల వద్దకు రాగానే తేజోరాశి అయిన సాయిని చూచి ముఖాన్ని క్రిందకు దించింది. సాయి పాదాల చెంతకు చేరి, సాయిని ప్రేమగా చూసింది. సాయి ఆ పులిని చూస్తూనే ఉన్నారు.

సాయి చూపులోంచి అమోఘ ఆశీస్సులు ఆ పులికి అందినట్టున్నాయి. ఆ పులి తోకను పైకెత్తి ముమ్మారు నేలపై కొట్టి, సాయి చూపుతున్న ప్రేమకు పొంగిపోతూ ఆనందాతిశయంతో పెద్దగా గర్జన చేసి, నిశ్చేష్టగా నేలమీద పడి మరణించింది.

”గొప్ప పుణ్యం చేసుకోవటం వలన ఇక్కడకు వచ్చిందీ పులి” అన్నారు సాయి. సాయి పాదాల వద్ద మరణించటాన్ని నిర్వాణ సుఖం అనకోవచ్చును.

ఆ పులిని శివ మందిరం ఎదురుగా సమాధి చేయమన్నారు సాయి. అలాగే చేశారు దర్వీషులు.

మరణ సమయంలో భగవంతుడు జ్ఞప్తికి వస్తాడో రాడో కానీ, పులి మాత్రం పరబ్రహ్మ సాయి పాదాల చెంత ప్రాణాలు వీడి పుణ్యజీవి అయ్యింది.

కనీసం సాయి స్మరణతో శరీరాన్ని వదిలివేసే అదృష్టాన్ని మనకు ప్రసాదింపుమని సాయిని వేడుకుందాము.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles