హంసరాజ్ యొక్క ఉబ్బసం వ్యాధిని నయం చేసిన బాబా వారి లీల—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-22 హంసరాజ్ 4:37

సాకోరి నివాసి హంసరాజ్, ఉబ్బసంతో బాధపడుతున్నాడు.

అతనికి సంతానంగూడ లేదు. అతడు ఈ రెండు బాధలూ నివారించమని నాసిక్ నివాసి, దిగంబరీయైన నరసింగ్ అను సిద్ధపురుషుణ్ణి ఆశ్రయించాడు.

అతని దేహాన్ని ఒక భూతమావేశించి సంతానం లేకుండా చేస్తోందని, సాయిబాబాను దర్శిస్తే ఆయన అతని చెంపమీద రెండు దెబ్బలు కొట్టి భూతాన్ని పోగొడతారనీ ఆ మహనీయుడు చెప్పారు.

అతడు, శ్రీమతి కషిబాయ్ హంసరాజ్ డిసెంబర్, 1916 సం. లో సాయిని దర్శించగనే అతడేమీ చెప్పకముందే సాయి అతని చెంపమీద రెండు దెబ్బలు కొట్టి, “దుష్టగ్రహమా ఫో బయటకు!” అని గద్దించారు. కొద్దికాలానికి అతడికి సంతానం కల్గింది. ఈ మహనీయులిద్దరి ఆంతర్యము ఒక్కటేనని ఈ సంఘటన నిరూపిస్తున్నది.

అప్పటినుండి 6 నెలలపాటు షిరిడి లో ఉన్నారు. షిరిడి రాకమునుపు హంసరాజ్ రాత్రింబవళ్ళు తీవ్రమైన ఉబ్బసంతో బాధపడేవారు.

బాబాను దర్శించిన తరువాత ఆ వ్యాధి తీవ్రత తగ్గింది పగలు మాత్రము ఉండేది. రాత్రిల్లు ఇబ్బంది పెట్టేది కాదు.

కానీ బాబా రాత్రిళ్ళు దగ్గుతూ ఉండేవారు. షిరిడి వచ్చిన కొత్తలో శ్రీమతి హంసరాజ్ భర్తకి రోజు ఉబ్బసానికి మందు ఇచ్చేది. అది చూసి

బాబా ఆమెతో “తమకు ఉబ్బసవ్యాది ఉందని. నీవు నీ భర్తకు మందిస్తున్నట్లుగానే తమకు కూడా వేలమంది స్త్రీలు మందు ఇవ్వగలరు. కానీ ప్రయాజనమేముంది? అల్లా మాలిక్ హై – భగవంతుడే యజమాని” అన్నారు. అప్పటినుండి ఆమె తన భర్తకు మందు ఇవ్వడం మానివేసింది.

ఆ వ్యాదిని నివారించే క్రమంలో బాబా అతనికి పుల్లని, ఘాటైన పదార్దములు తినవద్దని ముఖ్యంగా పెరుగు తినడం నిషేదించారు.

కాని పెరుగు పట్ల అమిత ఇష్టం వలన హంసరాజ్ ప్రాణాన్ని అయిన విడుస్తాను గాని పెరుగు తినకుండా ఉండలేనని భార్యతో చెప్పి, ముర్ఖించి రోజు బార్యతో పాలు తోడు పెట్టించేవాడు ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు.

బాబా ఏదో ఒకవిధంగా రెండు నెలలపాటు అతడు పెరుగు తిన కుండ కాపాడుతూ వచ్చారు. రోజు ఆ యిద్దరూ ఆరతికి మశిద్ కి వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు త్రాగిపోయేది.

ఒకరోజతడు కోపంతో ఆరతికి గూడ వెళ్ళక, పొంచివుండి, పిల్లివచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే భాధతో ఏడుస్తూ పారిపోయింది.

తర్వాత అతడు మసీదుకు వెళ్ళగానే బాబా. “ఇక్కడొక మూర్ఖుడు పుల్లపెరుగు తిని చావాలని చూస్తున్నాడు కాని రోజూ అతను తినకుండా చూస్తున్నాను. ఒక పిల్లి రూపంలో అతని ఇంటికి వెళ్ళాను. వాడు నన్నీరోజు కర్రతో కొట్టాడు! ఇక్కడ చుడండి” అంటూ బాబా తమ వీపు చూపారు.

హంసరాజ్ బాబా వీపుపై కర్రతో కొట్టినందువలన ఏర్పడిన వాతలు చూసి తాను చేసిన తెలివి తక్కువ పనికి పశ్చాతాపం చెంది అప్పటినుండి బాబా తినవద్దని చెప్పిన వాటిని తినడం మానేసారు. ఆరు నెలలలో అతని వ్యాది పూర్తిగా తగ్గిపోయింది. ఇలా ఏ మందు లేకుండానే అతని వ్యాది సాయి అనుగ్రహాము వలన నయమైంది.

సాయి ఒకవంక భక్తులను రక్షిస్తూ, మరొకవంక వారినుండి తిట్లు, దెబ్బలు భరించవలసివచ్చేది.

సాయి ఒక్కొకసారి ఆరు వారాల దాక స్నానం చేసేవారు కాదు. అటువంటి సందర్బాలలో ఎవరైనా స్నానం చేయమని చెబితే,

“నేనిప్పుడే కాశి వెళ్లి గంగలో స్నానం చేసి వచ్చాను, మరల ఇక్కడ స్నానమెందుకు” అని లేదా “నేనిప్పుడే కొల్హాపూర్ మరియు ఔదుంబార్ వాడి వెళ్లి వస్తున్నాని” అని అంటుండేవారు సాయి అని శ్రీమతి హంసరాజ్ చెప్పారు.

నిత్యం కాశీలో స్నానం చేయడం శ్రీ దత్తాత్రేయుని ఆచారం. అంటే తామే దత్తాత్రేయుడని ఆయన సూచించారన్న మాట.

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles