బాబా “6 నెలలు వేచి ఉండు, అప్పుడు చూడు తప్పు చేసిన వారి పరిస్తితి” అన్నారు.—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-68-1103-బాబా అనుమతి తీసుకొని షిరిడీ వదలి 4:35

సాయి బంధువులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

హరిభావూకార్నిక్ గురించి శ్రీ సాయి సచ్చరిత్ర లో 33 వ అధ్యాయంలో ప్రస్తావన :- దహనూ నివాసి హరిభావూకార్నిక్ 1917లో గురుపూర్ణిమనాడు సాయిని దర్శించి శెలవు తీసుకొని మశీదు మెట్లు దిగుతూ ఆయనకొక రూపాయి దక్షిణయిస్తే బాగుండునని తలచాడు.

శెలవు తీసుకొన్నాక ఆయనను తిరిగి దర్శించరాదని శ్యామా అతనిని పంపివేశాడు అతడు నాసిక్ లో  దిగి ఆలయంలో ప్రవేశిస్తున్నాడు.

ద్వారంవద్ద భక్తులమధ్యనున్న నరసింగ్ మహరాజ్ హరిభావూ చేయిపట్టుకొని

‘నా రూపాయి నాకివ్వు’ అన్నారు. ఆ రూపంలో సాయియే తానివ్వదలచినది స్వీకరిస్తున్నారని గుర్తించి సంతోషంగా సమర్పించాడు సాయి నరిసింగ్ ఒక్కరే.

ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు కార్నిక్ కష్టాలలో ఉన్నప్పుడు, అతనిని అన్యాయం గా అతని బంధువులు కోర్టుకు లాగారు.

ఆ సమయంలో బాబా గురించి విని షిర్డీ వచ్చారు కార్నిక్.

బాబాను దర్శించి కొబ్బరికాయ, తాంబూలం, దక్షిణ సమర్పించారు.

బాబా వాడకి పోయి విశ్రాంతి తీసుకోమని చెప్పారు.

రెండు రోజుల తరవాత అతడు విచారంగా అతని బందువుల ప్రవర్తనకు బాధతో, వాళ్ళు కోర్ట్ కు లాగిన విషయం ఆలోచిస్తూ బాబాను కలిసారు.

బాబా తన సాదరణ దోరణి లో ఆతనితో  ఆ కేసు విషయం చెప్పారు.

అక్కడ ఉన్న భక్తులు నీకు బాబా ఇంతకుముందే కలిసావా అని కార్నిక్ ను అడిగారు. “లేదు,

బాబా ను నేను ఇంతకుముందు కలవలేదు. కానీ నా గురించ కచ్చితంగా బాబాకు అంత తెలుసు” అన్నారు కార్నిక్.

నాల్గవ రోజు అతను బాబాను కలిసినప్పుడు

బాబా “6 నెలలు వేచి ఉండు, అప్పుడు చూడు తప్పు చేసిన వారి పరిస్తితి” అన్నారు.

6 నెలల తర్వాత బాబా మాటలు నిజమైయ్యాయి. కార్నిక్ కోర్ట్ కేసు నుండి బయట పడ్డారు. పైగా అన్యాయం గా నడుచుకున్న అతని బంధువులు బాధలు పడ్డారు.

కర్ణిక్ బాబా దర్శనం చేసుకొన్న తరువాత బాబా అనుమతితో పండరీపూర్ కి ప్రయాణమయ్యాడు.

కోపర్ గావ్ స్టేషన్ లో పాసింజరు రైలుకి టిక్కెట్ కొన్నాడు.

దౌండ్ స్టేషలో దిగి, తరువాత కురిద్వాడి అక్కడినుండి పండరిపూర్ వెళ్ళే రైలు కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు.

ఈ లోగా అతనికి బాత్ రూమ్ కి వెళ్ళే అవసరం పడింది.  కాని సామానంతా వదిలి వెళ్ళడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉన్నాడు.

ఇంతలో ఒక కూలీ వచ్చి, మీసామనుకు నేను కాపలాగా ఉంటాను, మీరు బాత్ రూమ్ కి వెళ్ళి రండి అని చెప్పి, మీరు మీ పాసింజరు టిక్కేట్ ను ఎక్స్ ప్రెస్ రైలు కి మార్చుకోండి, కొద్ది సేపటిలో ఎక్స్ ప్రెస్ రైలు వస్తుందని కూడా చెప్పాడు.

కర్ణిక్ బాత్ రూము కి వెళ్లి వచ్చి తన టిక్కేట్ ను, ఇక్స్ ప్రెస్ రైలుకు అదనంగా అయ్యే డబ్బును ఆ కూలీ చేతిలో పెట్టి టిక్కెట్ ను తీసుకొని రమ్మని చెప్పాడు.

“కొద్ది సేపట్లో రైలు వచ్చేస్తుంది, మీరు వెళ్ళి రైలులో కూర్చోండి, నేను టిక్కెట్ తీసుకొని వస్తాను” అని ఆ కూలీ వెళ్ళిపోయాడు.

ఇంతలో రైలు రాగానే కర్ణిక్ వెళ్ళి కూర్చొన్నాడు. తోటి ప్రయాణీకులు అతని పరిస్థితినంతా”  గమనించి, “ఆ కూలీ రాకపోతే మీ పరిస్థితి ఏమిటి? అప్పుడు మీరేం చేస్తారు” అని అడిగారు.

“నాకు ఆ కూలీ మీద పూర్తి నమ్మకం ఉంది, అతను తప్పక వస్తాడు” అని సమాధానమిచ్చాడు.  అప్పుడే రైలు బయలుదేరింది.

ఇక స్టేషన్ వదలి వెళ్ళిపోతుండగా, కూలీ అతను పరిగెత్తుకుంటూ వచ్చి అతని చేతిలో టిక్కెట్ పెట్టాడు.

బాబా అనుమతి తీసుకొని షిరిడీ వదలి పెట్టిన తరువాత ఎందుకు భయపడాలి?

రేపు తరువాయి బాగం ….

శ్రీ సాయి భక్తుడయిన హరి భావు కర్ణిక్ గారి గురించిన సమాచారం ఈ క్రింది లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles