Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఒకసారి హరిభావ్ కార్ణిక్ షిరిడీ నుండి పండరీపురం పోతున్నాడు. దారిలో పాసింజర్ టికెట్ ను మెయిల్ టికెట్ గా మార్చుకోవలసి ఉంది.
సమయం ఎక్కువ లేదు. అప్పుడే అతనికి మూత్ర విసర్జనకు తొందరగా వెళ్ళవలసి ఉన్నది.
ఆ సమయంలో ఒక కూలీ ఆయన దగ్గరకు వచ్చాడు. ”నీవు రైలెక్కుదువుగాని. ముందు మరుగుదొడ్డికి వెళ్ళిరా. ఈలోగా టికెట్ మార్చుకొని వస్తాను” అని చెప్పి ఆ టికెట్ ను తీసుకు వెళ్ళాడు.
కార్ణిక్ మరుగుదొడ్డి నుండి తిరిగి వచ్చి సామానుతో రైలు ఎక్కుతుండగా రైలు కదిలింది.
కదులుతున్న రైలులోంచి ఆ కూలీ కార్ణిక్ టికెట్ ను అందచేశాడు. సాయియే ఆ రూపంలో వచ్చాడని కార్ణిక్ విశ్వసించాడు.
సీతాకాంత్ కామత్‌కు ఆగస్టు 1971లో మిజోరాం నుండి బొంబాయికి బదిలీ అయింది. మిజోరాం నుండి బొంబాయికి వెళ్ళటం అనుకున్నంత తేలిక కాదు.
3, 4 చోట్ల రైలు మారాలి. అందుకు సిద్ధమయ్యాడు. తన కుల దేవతను ప్రార్ధించుకున్నాడు మనసులో.
మొదటి మజిలీ మిజోరాం నుండి సిల్‌చార్‌కు. అది బస్సులో వెళ్ళాలి. డ్రైవరు ఏ మాత్రం క్షణ కాలమైనా అజాగ్రత్తగా ఉంటే, ప్రయాణీకుల ఎముకలే దొరకవు. అది పూర్తయింది.
ఇక రెండవ మజిలీ, సిల్చారు నుండి. ఎవరో మిలటరీ అధికారి ద్వారా బెర్తు సంపాదించాడు. సుఖంగా ప్రయాణిస్తున్నాడు. మగత నిద్ర పట్టింది. వెంటనే మెలకువ వచ్చింది.
తన ప్రక్కనే ఎర్రటి కఫనీ ధరించిన ఒక ఫకీరు నిలబడి ఉన్నాడు. ”బాబూజీ మీరు ఇక్కడ దిగండి. ఇక్కడున్న కామాక్షి ఆలయాన్ని దర్శించండి” అని వెళ్ళిపోయాడు.
అంతలోనే గౌహతి స్టేషన్ వచ్చింది. ఎవరో రైల్వే కూలీ తొందర తొందరగా వచ్చి సీతాకాంత్ సామాను తీసుకుని ”పోదాం రండి” అంటూ క్లోక్ రూమ్ వైపు వెళ్ళి, అక్కడ వాటిని ఉంచాడు.
ఆ కూలీ ఫకీరులాగే ఉన్నాడు, కానీ ఎర్రటి యూనిఫాంలో ఉన్నాడు. అతని బాడ్జి నంబరు 389. కూలీ వెళ్ళిపోయాడు.
సీతాకాంత్ మెల్లగా స్నానం చేసి, టీ త్రాగుతున్నాడు. అప్పుడే అందింది వార్త తాను ప్రయాణించకుండా దిగిన రైలు కొద్ది మైళ్ళు పోయి, ప్రమాదానికి గురైందని. ఎందరో మరణించారు.
స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్ళి ”389 కూలీ ఎక్కడ?” అని అడిగాడు సీతాకాంత్. అటువంటి నంబరు గల కూలీ ఎవ్వరూ అక్కడ లేరని తెలుసుకున్న సీతాకాంత్ అచ్చెరువొందాడు.
మరల ప్రయాణించి నాసిక్ చేరి అక్కడ నుండి షిరిడీ వెళ్ళాడు. సమాధి మందిరంలో సాయి విగ్రహాన్ని చూచాడు – అక్కడ కనబడ్డాడు ఫకీరు, కూలీ! సీతాకాంత్ ఆశ్చర్యానికి హద్దు లేదు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సమయమునకు రైలు టికెట్ ఇచ్చిన బాబా–Audio
- బాబా, గురువు గారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు
- కూలీ రెండు రూపాయలు ….. సాయి@366 మార్చి 15…Audio
- ఆ TE కూడా తన వైపు చూస్తూ నవ్వి ఆ ముస్లిం ఫకీరు ఖాళీ చేసిన సీట్ లో కూర్చోమన్నారు.
- బాబా “6 నెలలు వేచి ఉండు, అప్పుడు చూడు తప్పు చేసిన వారి పరిస్తితి” అన్నారు.—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments