Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-83-1110-రైలు కదలలేదు 3:39
1951లొ ధార్వాడ్ లో అల్ ఇండియా సాయి డివోటీస్ కన్వెన్షన్ జరిగింది. శ్రీ బి.వి . నరసింహస్వామి, రాధాకృష్ణ స్వామి కన్వెన్షన్ అయిపోయిన తరువాత హుబ్లి వచ్చి అచ్చట నుండి మద్రాసుకు ప్రయాణమై హుబ్లి రైల్వే స్టేషన్ కు వచ్చినారు.
రైలు రాగానే ఇద్దరు రైలులో ఎక్కి కూర్చున్నారు.
రైలు బయలుదేరుటకు గంట కొట్టారు. ఇంతలో శ్రీ నరసింహస్వామి గారికి తాము హుబ్లిలో బస యున్న వారి ఇంట్లో బల్ల ఫై ముఖ్య మైన కాగితములు పెట్టి, వాటిని తెచ్చుట మర్చిపోయిన విషయము గుర్తు రాగా రాధాకృష్ణ స్వామిని వెళ్లి మరచిన కాగితములు తెమ్మని చెప్పారు.
ఇంతలో రైలు బయలు దేరుటకు రెండవ గంట కూడ కొట్టబడినది.
రాధాకృష్ణ స్వామిజీ కూడ రెండు గంటలు కొట్టరే రైలు బయలు దేరిపోతుందేమో అనే సంశయం లేకుండా రైలు దిగి తాము బసచేసిన వారి యింటికి వెళ్ళినారు.
రైలు బయలుదేరుటకు సిగ్నల్ ఇవ్వబడినది.ముడవగంట కూడ కొట్టబడినది.
రైల్వే గార్డు రైలు బయలుదేరుటకు పచ్చజెండా ఊపుచు విజిల్ వేయుచుండెను.
డ్రైవర్ ఇంజనును నడుపుటకు ప్రయత్నించినాడు. కాని రైలు కదలలేదు.
ఇంజను ఎందువలన కదులుట లేదో అర్ధంకాక డ్రైవర్, అధికారులు ఇంజనును పరిక్షింస్తునారు.
ఇలా జరుగుతుండగా రాధాక్రిష్ణస్వామి ఆ కాగితములను తీసుకోని వచ్చి నరసింహస్వామి గారికి ఇచ్చినారు.
సాయిభక్తులైన నరసింహస్వామి గారిని చూచిన జనం వారి రైలు పెట్టె వద్ద మూగిరి. ఆ రైలు డ్రైవర్, స్టేషన్ అధికారులు ఆ రైలు పెట్టె వద్ద జనం ఎందుకు మూగారో అర్దంకాక, వారు కూడ రైలు పెట్ట వద్దకు వచ్చారు.
శ్రీ నరసింహస్వామి గారు ఇంజను డ్రైవర్ ను చూచి “యిప్పుడు వెళ్లి రైలు నడపండి, అది వెళుతుంది” అని చెప్పారు. డ్రైవర్ రైలు నడప ప్రయత్నించ గానే రైలు కదలింది
రైలు ఎందుకు కదలలేదు. గోలుసులాగితే ఆగుతుందంటారే ఆ పని ఎవరు చేయలేదు.
శ్రీ నరసింహస్వామి గారు, శ్రీ రాధాక్రిష్ణస్వామి సాయి అంకిత భక్తులు, బాబా అనుగ్రహం పొందినవారు.
వారు తలచువాటికీ బాబా వెనకయుండి నడుపుదురు.
వీరిద్దరు బాబాయందు ఓర్పు విస్వసముగలవారు.
నరసింహస్వామి గారు తమ పేపర్ల కొరకు రాధాక్రిష్ణస్వామిని పంపిరి. రైలు వెళ్ళిన రాధాక్రిష్ణస్వామి ఎట్లు వచ్చును.
రాధాక్రిష్ణస్వామి వెళ్ళనిచొ స్వామివారి పేపర్లు ఎట్లు వచ్చును. రాధాక్రిష్ణస్వామి వారు కూడ నరసింహస్వామి గారి మాట యందు విశ్వాసముగలవాడగుటచే రైలు యుండునా, బయలుదేరున అని ఆలోచించలేదు.
ఇట్టి అంకిత భక్తుల భాద్యత బాబాదే. అందువలన బాబాయే రైలు బండిని కదలక అపిరి.
సాయిని నమ్మి, సేవించువారు వీరి వలె బాబా అనుగ్రహమును పొందెదరు.
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- దర్శనం…. మహనీయులు – 2020… అక్టోబరు 19
- రైలు క్రింద పడినామె ఏమయింది?–Audio
- రైలు ప్రమాదం లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన బాబా గారు.(బాబా పైన ఉన్న భక్తి ఎదుటి వ్యక్తిని కాపాడే శక్తి గా మారిన కథ).
- ప్రేలుడు కి గురయైన రైలు ని తప్పించిన వైనం
- బాబా సహాయ పడకుంటే రైలు తప్పిపోయేది.—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
0 comments on “డ్రైవర్ ఇంజనును నడుపుటకు ప్రయత్నించినాడు. కాని రైలు కదలలేదు.–Audio”
putta srinivas
March 25, 2016 at 3:44 pmSaibaba
putta srinivas
March 25, 2016 at 3:45 pmSaibaba ki jai