Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-91-1114-నిలువుదోపిడి అయిపోయినది 3:18
నా పేరు పుచ్చలపల్లి వేణుగోపాలరెడ్డి. వంజివాక గ్రామం. కోటమండలం, నెల్లూరు జిల్లా.
నేను 2003 సంవత్సరం ముంబాయికి పనిమీద పోయినాను. నాతోటి నా అల్లుడు కూడా వచ్చాడు.
ముంబాయి నుండి శిరిడి దగ్గర కదా అని బాబాను దర్శించుటకు శిరిడి వెళ్ళాము.
అక్కడ దొంగల బారినపడి ఒక్క పైసా కూడా చేతిలో లేకుండా నిలువుదోపిడి అయిపోయినది.
ఇంటికి ఎట్లాపోవాలో? అని ఆలోచిస్తూ, బాబా దర్శనం కోసం క్యులోకి పోగా ఆ క్యూలో మాముందు ఒక పెద్దాయన ఎందుకయ్యా బాధపడుతున్నారు? అని అడిగాడు.
జరిగింది చెప్పినాము. మీరు ఏమి బాధపడవద్దు. మాది గూడూరు టూరిస్టు బుస్సు వచ్చి వుంది.
దాంట్లో మీరు మాతోపాటు ప్రయణముచేసి మా టూరులో మీగిలిన తీర్ధయాత్రలు మీరు కూడా దర్శించండి.
మీమ్మల్ని గూడూరు వరకు మా టూరిస్టు బస్సులో దింపుతాము అని చెప్పారు.
బాబాని స్మరించి అయన పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చెప్పుకొన్నాము.
నా భక్తుడు సప్త సముద్రాల అవతల నున్న పరుగెత్తుకుపోయి కాపాడతానన్న వాగ్దానం మాకు అనుభవమైంది.
షిర్డి నుండి ఒక్క రూపాయ చేతిలో లేకుండా నన్ను, నా అల్లుడిని సకలమర్యాదలతొ మా ఇంటికి చేర్చారు.
అన్ని వేల మంది దర్శనానికి వస్తే గూడూరు సంబంధించిన టూరిస్టు బస్సు వారు ఖచ్చితముగా మాముందే ఎట్లా నీలబడ్డారు? నీలబడ్డారే అనుకోండి.
నేను తెలుగు వాడి నని నన్ను అడిగిన పెద్దాయనకు తెలియదు. నాతొ తెలుగులో ఎట్లా ఎక్స్ పెక్ట్ చేసి తెలుగులో మాట్లాడు?
తెలుగువాడినని ఎక్స్ పెక్ట్ చేశాడనుకుంటాం సరే మేము బాధలో ఉన్నామని ఆయనకు ఎట్లా తెలుసు?
మా డబ్బులు పోయిన సంగతి నాకు, మా అల్లుడికి తప్ప మూడో మనిషికి తెలియదు.
మరి మేము బాధలో వున్నామని ఎట్లా అడగగలిగాడు?
ఎట్లా అడగగలిగాడంటే… నువ్వు చూచేదంతా కలిపి నేనే” అని బాబా నోటి నుండి వెలువడిన వేదవాక్కులు మాకు అనుభవంలోకి వచ్చాయి.
టూరిస్ట్ బస్సు వారు మమ్మల్ని ఎంతో ఆదరించి ముందు మాకు పెట్టివారు తినేవారు.
యాత్ర పరిసమాప్తి అయ్యి గూడూరులో మమ్మల్ని దింపారు.
బాబా ఇచ్చిన కృపతో ఆనందముగా ఇంటికి చేరాము.
ముంబాయి నుండే కాదు అమెరికా నుండైనా పైసా లేకపో యినా మన సొంత గూటికి తిసుకువస్తాడని దైర్యము కలిగినది.
నేనుండగా భయమేల? అన్న బాబావారి అభయ వాక్కులు కూడా అనుభవంలోకి వచ్చాయి.
బాబా గురూజీల పాదరేణువు,
వేణుగోపాలరెడ్డి,
వంజివాక గ్రామం. కోటమండలం, నెల్లూరు జిల్లా
సంపాదకీయం: సద్గురులీల
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ప్రసాదం – ధన ప్రసాదం…..సాయి@366 ఆగస్టు 19….Audio
- బాబా అతడిని ఓదారుస్తూ ,’ఏ కష్టం లేకుండా ప్రసవం అవుతుంది. మగ బిడ్డ పుడతాడు ‘ అని దీవిస్తాడు.–Audio
- సాయినాథుని కృప సౌరభాలు
- బాబావారు కలలో కనిపించి ప్రసాదమిచ్చుట.—Audio
- జలగండం…..సాయి@366 సెప్టెంబర్ 6….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments