సాయినాథుని కృప సౌరభాలు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటి బ్రహ్మాండ  నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

నా పేరు మల్లు పట్టు విజయ భాస్కర్ రెడ్డి. నాకు మొదటి నుండి కోపం విపరీతముగా వుండేది. 1973 సంవత్సరంలో సత్యసాయి బాబా వారి దగ్గరకు పుట్టపర్తి పోయాను. అయన నాకు శిరిడి సాయిబాబా ఉంగరం ఇచ్చి బాబాను నమ్ముకొని పూజించండి. మీకు అన్ని జరుగుతాయి అని సెలవిచ్చారు. నా మనసులో వుండే విషయాలు అన్ని చెప్పారు. నీవు శ్రీ శిరిడి సాయిబాబా కృపవల్ల మంచి ఇల్లు కట్టుకోంటావు అన్నారు. నాకు స్థలము లేదు, డబ్బు లేదు, నేను ఎట్లా ఇల్లు కట్టగలను అని అనుకున్నాను, 1973వ సంవత్సరం నుండి బాబావారిని పూజిస్తునే వున్నాను. బాబావారిని పూజిస్తున్నప్పటి నుండి నాకు అన్ని శుభాలే జరిగాయి. 1983వ సంవత్సరంలో నాకు వివాహం అయ్యింది. 1985 వ సంవత్సరములో బాబావారి కృపతో కుమారుడు గలిగాడు. అబ్బాయికి సాయికృష్ణారెడ్డి అని నామకరణం చేశాము. అబ్బాయి బాబా వారి కృపతో యం.సి.ఏ చేశాడు. 2000వ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఉద్యోగము చెన్నైలో వచ్చింది. 1973వ సంవత్సరంలో బాబా వారు చెప్పినట్లుగా నేను ఇల్లు కట్టాలనే కోరిక 2009వ సంవత్సరంలో మొదలైనది. నా దగ్గర పైసా లేదు. సిద్దవారంలో నా పొలము గవర్నమెంటు వారు తీసుకొని కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో విద్యానగర్ లో స్థలము కొనటము జరిగినది. కోటలో స్థలము ఉండినది ఇల్లు కట్టాలనుకున్నాను, కాని కట్టలేకపోయాను. బాబావారి ఆశీస్సులతో విద్యానగర్ లో మంచి ఇల్లు కట్టుకోవడం జరిగింది. నేను ఇల్లు కట్టే ముందు బ్యాంకు లోను తీసుకుందామని అనుకున్నాను. లోను కూడా తీసుకోకుండా కట్టడానికి ఎంత డబ్బుకావాలో అంత సమకూర్చి అందమైన నా సొంత ఇంటి కలను 2009వ సంవత్సరము నవంబరుకు పూర్తి అయ్యి గృహ ప్రవేశం జరిగింది. సాయిబాబా వారి కృపా కటాక్షములతో నేను ఉహించని విధంగా నన్ను నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడి చివరికి అంతా గమ్యం చేరుస్తానన్న బాబా వాగ్దానాన్ని నా జీవితంలో ఇప్పటి వరకు అనుభవించాను. జీవితాంతము ఆనందము అనుభవించేటట్లు అనుగ్రహించవలసినదిగా బాబాను ప్రార్దిస్తూ సాష్టాంగ ప్రణామములు తెలుపుకుంటున్నాను.

సాయి పాదరేణువు,
మల్లు పట్టు విజయ భాస్కర్ రెడ్డి,
విద్యానగర్,
కోట, నెల్లూరు జిల్లా.

సంపాదకీయం: సద్గురులీల (జనవరి – ఫిబ్రవరి 2011)

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles