Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
“నా లీలలు అగాధాలు”, ఎవరైతే అందులో మునుగుటారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి” నా ఈ దేహం సమాధి అనంతరం నా అవతార కార్యం ముమ్మరం అవుతుందని బాబా వాచా వెలువడిన అభయహస్తపు జల్లులకు నిదర్శనము ఈ పిచ్చుక(భక్తురాలి) లీల. మాములుగా చిన్న గుండు సూది గుచ్చుకుంటేనే అమ్మ, అబ్బ అని కేకలు పెడతాము.రోడ్లో పోతూ చిన్న సిగరెట్టు ముక్క తోక్కితేనే అబ్బో, అమ్మోని అరుస్తాము. అన్నం గిన్నె దించుతూ కొంచెం చెయ్యి కాలితేనే అమ్మో, అయ్యో అని కొబ్బరినునే బర్నాల్ పుస్తాముకదా! ఈ భక్తురాలి అనుభవము చదివితే వళ్ళు గగుర్బాటు అవుతుంది. కళ్లనీళ్లు ధారాపాతంగా కారుతాయి. బాబా అనంతమైన శక్తిని కుడా మనం అనుభావిమ్చాగలం చదవండి! తరించండి!
నా పేరు టి.శశికళ. మా నివాసం నెల్లూరు. నేను 2008లో టాటా ఇండికాంలో పనిచేస్తునప్పుడు జూలై 27వ తేదీన నేను ఆఫీసులో వున్నప్పుడు నా భర్త నా మీద యాసిడ్ తో దాడిచేశాడు. నా ఎదురుగా సాయిబాబా వారి ఫోటో వుంటుంది. నాకు ఒక్కసారి యాసిడ్ ముఖము, కళ్లు నిండా పడింది. నేను సాయినాధ, సాయినాథ అని బాబా ఫోటో చూస్తూ బాబాని పిలుస్తున్నాను. నా చేతుల మీద యాసిడ్ పడిన చోట అంతా లావాగా జరిగిపోతుండినది. బాబాను పిలిచాను. బాబా పలికారు. నాకు ఏమాత్రము మంట నొప్పిలేదు. నా తల మీద చుస్తే వెంట్రుకలన్ని ఊడిపొతున్నాయి. శరీరం మీద యాసిడ్ పడ్డ చోటల్లా తినేస్తుండినది. కాని నొప్పి ఏమాత్రములేదు. నేను నేరుగా హాస్పిటల్ కి పోయి అడ్మిట్ అయ్యాను. అక్కడ కిరసనాయలు పోసుకొని అంటించుకున్న వారు గావుకేకలు పెడుతూ నొప్పితో బాధపడుతున్నారు.నాకు ఏమాత్రం, బాధ నొప్పి కలగకుండా ఆ బాధనంతా బాబావారు భరించినారు. తమ భక్తులు అంటే బాబాకి ఎంత ప్రేమో ఈ అనుభవాన్ని పట్టి తెలుస్తుంది. ఎక్కడో కుమ్మరి కొలిమిలో ఏమారి బిడ్డను వదిలిన భక్తురాలి కోసం శిరిడిలో ధునిలో చేతులు కాల్చుకొని బిడ్డను రక్షించిన బాబా వారిని ఏమని పొగడగలను? ఆనాడు కొలిమిలో పడ్డ బిడ్డను రక్షించిన విధంగా నా మొహం మొత్తం అమ్దవిహినం కాకుండా కాపాడి, నా బాధను స్వికరిమ్చిన బాబా వారికీ జన్మజన్మలకు కృతజ్నతలు. నా మీద యాసిడ్ దాడిచేసిన నా భర్త కరెక్టుగా 3 నెలలకు యాక్సిడెంట్ లో మరణించాడు. నేను ఒకరోజు బాబా ఫోటో ముందు పూజ చేస్తూ నాకు నా పిల్లలకి ఒక దోవచూపించండి అని వేడుకున్నాను. ఇంతలో బాబా ఫోటోపై నున్న పుష్పం నా చేతిలో పడింది. మూడు నెలల్లో ఉద్యోగం వచ్చింది. బాబావారి కరుణా కటాక్షములతో నేను నా పిల్లలు ఆనందంగా జీవిస్తున్నాము. మమ్మల్ని ఇలాగే ఎల్లవేళలా కాపాడాల్సిందిగా ప్రార్దిస్తున్నాను.
టి .శశికళ,
నెల్లూరు
సంపాదకీయం: సద్గురులీల ( అక్టోబర్ – 2010 )
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No :9704379333
Latest Miracles:
- బాబా నా భర్తకి పునర్జన్మ ఇచ్చారు
- బాబా దయ వలన పునర్జన్మ
- మా మరిది కూతురికి పునర్జన్మ ను ఇచ్చిన బాబా వారు…G A. రాజ్యలక్ష్మి
- సాయి సాయి.. స్మరణ తోనే పునర్జన్మ..
- సాయి లీలలు – పునర్జన్మ, నేత్ర శస్త్ర చికిత్స,,,!!!–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments