మా మరిది కూతురికి పునర్జన్మ ను ఇచ్చిన బాబా వారు…G A. రాజ్యలక్ష్మి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నేను ఎదో ఫంక్షన్ కి వెళ్తూ ఉంగరం, ముత్యాల గొలుసు పెట్టుకొని సాయంత్రం ఇంటికి వచ్చాక తీసి బీరువాలో పెట్టాను అని అనుకున్నాను. కానీ హడావిడి లో ఎక్కడో పెట్టేసినట్లున్నాను.

మర్నాడు ఉదయం చూస్తే అవి లేవు. ఎక్కడబెట్టానో నాకు గుర్తు రావడం లేదు. ఇల్లంతా వెతికాను. ఎక్కడా లేవు. ఇంట్లోకి ఎవరూ రాలేదు. నేను ఎక్కడకి వెళ్ళలేదు.

పోనీ ఎవరైనా పట్టుకుపోయారేమో అనుకోవడానికి వీలులేదు. ఆ తర్వాత మా తోడికోడలు రుక్మిణి కూడా వెతికింది. ఇద్దరమూ కలిసి వెతికాము, కనపడలేదు. ఇంక నాకు దిగులు పట్టుకుంది.

నేనసలు ఇంటికి పట్టుకు వచ్చానా? ఇంట్లోనే తీసానా? అనే అనుమానాలు వస్తున్నాయి. గంట గంటకి నాలో ఆశ చచ్చిపోతుంది.

బాబా ఫోటో ముందు నిలబడ్డాను. బాబా నా వస్తువు ఇంట్లో ఉందా? లేదా పోయిందా? అని బాబా ఫొటోలో చూస్తూ ఏడుస్తున్నాను.

బాబా నీవే నాకు దిక్కు బంగారం దొరికేలా చేయమని పాదాలకు మొక్కాను నేను పెట్టే చోట్లు, పెట్టని చోట్లు వెతికాను. ఇంక దొరకదని దిగులు పెరిగింది.

వెంటనే లేచి స్నానం చేసి దీపం వెలిగించి సాయిబాబా ను భక్తిగా మొక్కాను .

తండ్రీ నీ దయ, నాకు నువ్వు తప్ప ఎవరు చెప్పగలరు, నా చింత నువ్వు తొలగించు అని వేడుకున్నాను.

మనసంతా చాల చిరాకుగా అలజడి గాను అనిపించింది. క్రింద మా మరిది గారింట్లో వెళ్లి కూర్చున్నాను. 5 : 30  నుండి 7 : .20 నిముషాల వరకు దిగులుగా ఉంది.

మరల ఇంకో సారి వెతకాలి అనుకోని బాబా బొమ్మను హృదయానికి హత్తుకొని 10 నిముషాలు ధ్యానం చేశాను, 8:30 వరకు,  మళ్ళీ వెతికాను, మరలా మొత్తం వెతికాను,

9:00 గంటలకు మనసు నిలకడ చేసుకొని నా కళ్ళు మూసుకొని బాబా ఇంకోసారి వెతుకుతాను కనిపించనీ సాయి! నీవు ఉన్నావని నమ్మాను. ఇంకా వెతుకుతున్నాను. దొరుకుతుందనే నమ్మకం, మరలా పుస్తకాలు అన్ని తీసి వెతికాను.

లాకర్  తీసాను. ఆధ్యాత్మిక చింతన అనే పుస్తకం తీసాను. చదువుదాం అనుకుని ఆ వెనుకనే నాకు మన ప్రశ్నలకి బాబా జవాబులు అనే పుస్తకం దొరికింది.

ఈ పుస్తకం తప్పి పోయి కూడా చాలా రోజులు అయింది. చాలా రోజులు గా దీని గురించి వెతుకు తున్నాను. ఇది ఇక ఇప్పుడు కనిపించింది.

ఆ పుస్తకం తీసాను. బాబాను మనస్పూర్తి గా తలచుకొని పుస్తకం తెరిచాను. నీవు ఉన్న చోటనే వెదుకు కళ్ళుబెట్టి చూడు అని వచ్చింది సమాధానం.

వెంటనే పుస్తకాల టేబుల్ మొత్తం తీసాను. అప్పటికే చాలా సార్లు వెతికాను ఆ స్థలంలో.

టేబుల్ పై ప్లాస్టిక్ కవర్లో చుట్టి పెట్టి ఉంది. ఇదిగో నీ సొత్తు ఇక్కడే ఉంది అంటూ బాబా నాకు చూపించినట్లయింది.

నా ఆనందానికి అంతు లేదు. బాబా నీవున్నావు తండ్రి నాకు. అడుగడుగునా నీ భక్తులకు ఏనాడూ ఏ లోటు రానీయవు బాబా.

మా ఇంటి దగ్గర ఒక గ్రూప్ లాగా ఉండి అందరమూ బాబా భజనలు చేసుకుంటాము. ఒక రోజు రాత్రి మా ఇంటికి చుట్టాలు వచ్చారు.

మా మరిది కూతురికి మనుషులు వచ్చారంటే చాలా ప్రేమ. మర్యాదలు బాగా చేస్తుంది. బాగా అతి ప్రేమ కూడా చూపిస్తుంది.

అలాగే మా ఇంటికి వచ్చిన చుట్టాలకి వాళ్ళ ఇంట్లోంచి ఎదో తెచ్చి పెట్టి తిరిగి వెళ్ళబోతూ గుమ్మం దాకా వచ్చేటప్పటికి దానికి ఫిట్స్ వచ్చాయి.

మెట్ల మీద నుండి గోడకు గుద్దుకుంటూ పడిపోయింది. బాగా దెబ్బ తగిలింది. చాలా రక్తం పోయింది.

పక్కనున్న హాస్పిటల్ కి తీసుకువెళితే డాక్టర్ ఇటువంటి కేసులు తీసుకోము అన్నాడు. పిల్ల బ్రతకదని చెప్పేశారు. గిలగిల కొట్టుకుంటుంది. ఆఖరి దశలో వుందనిపించింది.

చాలా కంగారు పడ్డాము. వేరే హాస్పిటల్ కి తీసుకెడితే రాత్రంతా రక్తం ఎక్కించారు. మేమంతా అక్కడే రాత్రంతా ఉన్నాము. తలకి కుట్లు వేశారు.

అంత బాధలోనూ అది బాబా పాటలు పాడుతోంది. దానికి బాబా అంటే చాలా ఇష్టం.  మళ్ళీ మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయి, కళ్ళు తేల వేస్తోంది, నరాలు చిట్లిపోయాయని బ్రతకదని చెప్పేశారు.

నేను సాయిబాబా ను అలా ప్రార్ధిస్తూనే ఉన్నాను. బాబా పాపను దక్కించు సాయి, దానికి ప్రాణాలు పొయ్యి తండ్రీ అని వేడుకుంటూనే వున్నాను. ఐదవ రోజు డిశ్చార్జ్ చేశారు.

ఒక నెల రోజుల పాటు జాగ్రత్తగా ఉంటే చాలన్నారు. అలా బాబా దానికి పునర్జన్మ నిచ్చారు. ఒక్క పిలుపులో పిలిస్తే ఉన్నానని పలుకుతాడు శ్రీ సాయి దేవుడు.

The above miracle has been typed By: Mrs. Rajarajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles