Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా కుగ్రామమైన షిరిడీకి ప్రపంచపటంలో గుర్తింపు తెచ్చారు.
ఆచార్య ప్రణవానంద కుగ్రామమైన బాజిత్ పూర్ కు గుర్తింపు తెచ్చారు. ఐతే అది నేడు బంగ్లాదేశ్ లో ఉంది.
ప్రణవానంద జనవరి 29, 1896లో బాజిత్ పూర్ లో జన్మించారు. వినోద్ అనే పేరు పెట్టారు. ధైర్య సాహసాలు అనే పాలు త్రాగి పెరిగాడు.
వాళ్ళ ఇంట్లో ప్రతిదినం ఒక ముంగిస దూరి పాలు త్రాగిపోయేది. తల్లి వినోద్ ను ఆ ముంగిసను పట్టుకొమ్మంది.
అతడు అడవులలోకి పోయి ముగింసను పట్టి తెచ్చాడు. ఆ తల్లి ముంగిసను చూసి నవ్వి వదిలివేసింది.
ఇతడు ఇతర పిల్లలతో కలసి ఆహార ధాన్యాలు సేకరించి నిరుపేదలకు పంచేవారు. అస్వస్థులకు ఊరట కలిగించేవాడు. మృతులను స్మశానవాటికలకు తీసుకుపోయేవాడు.
ఈతని సేవాసక్తిని చూచిన ప్రధానోపాధ్యాయుడు యోగిరాజ్ గంభీరనాధ్ వద్దకు తీసుకుపోయాడు. తన శక్తిని కుర్రవానిలో ప్రవేశపెట్టాడు ఆ గురువు.
కాశీలో యోగ సాధన చేశాడు. జ్వరం వచ్చి పడిపోతే, ఒక వృద్ధ మహిళ పరిచర్యలు చేసింది. ఆమె ఎవరో కాదు సాక్షాత్తు అన్నపూర్ణదేవే అన్నారాయన.
ఒక దుర్గాష్టమినాడు “అమ్మా! నీవే సత్యమైతే నాకు దర్శనం ఇవ్వు” అంటూ దుర్గాదేవి కళ్ళలోకి చూస్తూ కూర్చున్నారు. అది ప్రగాఢమైన కోర్కె.
ఆమె అతని నిస్వార్థ కోర్కెను కాదనగలదా! ఆ సింహవాహినితో పాటు గణేశుడు, కార్తికేయుడు, సరస్వతి సాక్షాత్కరించారు. ఆయనకు ప్రశాంతత కలిగింది.
1917 మాఘ పూర్ణిమనాడు భారత్ సేవా సంఘ్ నెలకొల్పాడు. అది విశ్వ వ్యాప్తమైంది. భారత జీవనాడిలో ఒక భాగమైంది.
ఒకసారి సత్ క్షీరలో క్షామం వచ్చింది. ఆ సమయంలో ఈ సంఘం సేవలను ప్రఫుల్లచంద్ర రే, సుభాష్ చంద్ర బోసు మొదలైన వారు ప్రశంసించారు.
సేవా కార్యక్రమంలో ఒకొక్కసారి నదులను, జలాశయాలను దాటటానికి సదుపాయాలు లేనప్పుడు ఈదుకుంటూ పోయి సేవ చేసేవారు – సంఘంతో ప్రణవానంద.
ఒక్కోసారి తినటానికి ఏమీ ఉండేది కాదు. నిద్రించటానికి సదుపాయం ఉండేది కాదు.
చిరునవ్వుతో సవాళ్ళను స్వీకరించటం ప్రణవానంద నుండి భారతసేవాశ్రమ సంఘ్ తెలుసుకుంది. సేవ పొందే ప్రతి ఒక్కరు అత్యంత సమీప బంధువులే వారికి.
సేవ అంటే కడుపులో చల్ల కదలకుండా చేసేపని కాదు, ఎదుటి వాని కన్నీటి బొట్టును తుడిచివేయటానికి సాహసం కావాలి. ఈ శక్తిని దుర్గామాత తన అష్టభుజముల ద్వారా ప్రసాదిస్తుంది.
భక్తి సేవలకు మారుపేరైన ప్రణవానందుల జన్మ దినం నేడే – జనవరి 29. ఆయనను స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఆరోగ్యం ప్రభాకరరాదిచ్చేత్ …. మహనీయులు – 2020… ఆగస్టు 29
- ఆకలుండదు, దహముండదు. …. మహనీయులు – 2020… ఏప్రిల్ 29
- ప్రశాంత వదనం … మహనీయులు – 2020… జూలై 29
- శేష మార్గము … మహనీయులు @2020 – జనవరి 4
- లేవరా! నిద్రలేవరా!! …..సాయి@366 జనవరి 29
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments