Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా “స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు. అతిగా నిద్ర పోవద్దు” అని చెప్పేవారు. బాబా తక్కువగా నిద్రించేవారు.
నిద్ర సుఖం మరగితే వాడు బద్దకస్తుడవుతాడు. ఇక అన్ని చెడు అలవాట్లు వస్తాయి.
కపర్డే 29 జనవరి 1912న కొంచెం ముందుగానే నిద్రలేచాడు. అంత మాత్రాన ఆ మేరకు మరల నిద్రపోకూడదు. నిద్రవచ్చినా, ప్రయత్నంచేసి నిద్రను పోగొట్టు కోవాలి.
ఆయన ప్రతి దినము సత్సంగం చేసి పారాయణ గ్రంధాలను పఠించేవారు ఇతరులతో కలిసి. కానీ ఆనాడు పారాయణ విషయం ముందుకు సాగలేదు. నిద్రమత్తు వచ్చింది, పడుకున్నాడు.
మధ్యాహ్న ఆరతి సమయం కావచ్చింది. నిద్ర లేవలేదు. శ్యామా వచ్చి లేపటానికి ప్రయత్నించాడు. ఇంకా ఇతరులు కూడా అతనిని నిద్రనుండి లేపలేకపోయారు.
ఈ విషయం ద్వారకామాయిలో ఉన్న సాయికి తెలిసింది. “అతనిని నేను లేపుతాను” అన్నాడు సాయి. అన్నాడే కానీ సాయి బాబా అక్కడనుండి కదలలేదు.
ఆరతి మొదలైంది. కపర్డే నిద్ర లేచాడు. సాయి నిద్ర లేపలేదు.
ఎలా లేచాడో కపర్డేకు తెలియదు. అలా నిద్ర పోయినందులకు కుంచించుకు పోయాడు. ఇక్కడ సాయి స్వయంగా వెళ్ళి నిద్ర లేపలేదు.
ఒక్కొక్కసారి దైవం నిద్రలేపవలసి వస్తుంది.
మహారాష్ట్రకు చెందిన శాంతారామస్వామి సన్యాసిగా మారి కాశీలో స్థిరపడ్డాడు. మహా భాగవత పురాణాన్ని పారాయణ చేసేవాడు.
ఒక వారంలో ఒకసారి పారాయణ పూర్తీ చేసేవాడు. అలా 40 సంవత్సరాలు చేశాడు. అంతే కాదు భగవంతునితో ముఖా ముఖిగా మాట్లాడేవాడు.
ఆయన నిత్యం ఉదయం 4 గంటలకే నిద్ర లేచేవాడు. ఎప్పుడైనా లేవకపోతే కాశీ విశ్వేశ్వరుడు వచ్చి తలుపుమీద శబ్దం చేసి నిద్ర లేపేవాడు. భక్తులంటే, శిష్యులంటే దైవానికి, గురువుకు ప్రీతి పాత్రులే.
సాయి మహాసమాధి చెందినా మేలుకొల్పుతాడు. యం.వి. సహస్రబుద్దే ఒక మధ్యాహ్నం నిద్రిస్తున్నాడు.
సాయి “లే! పైనుండి జారిపడిన మట్టిలో ఒకడు కూరుకు పోతున్నాడు. వెళ్ళి అతనిని బయటకు తీయి” అని మేల్కొలిపారు అతనిని.
అతడు వెంటనే లేచి, తాను పనిచేయిస్తున్న చోటుకు పోయి, ఆ వ్యక్తిని కాపాడాడు. లేకుంటే సహస్రబుద్దే కేసులో ఇరుక్కుపోవటమే గాక ఒక జీవి ప్రాణం కూడా పోయేది.
అతి నిద్ర పోకుందుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి పాదానంద …..సాయి@366 జనవరి 14….Audio
- సాయి మాట సత్యమే …..సాయి@366 జనవరి 25….Audio
- సాయి ఎల్లరకు ప్రభువే!…..సాయి@366 నవంబర్ 29….Audio
- జగమే ‘జ్ఞానేశ్వరి’ ….సాయి@366 సెప్టెంబర్ 17…Audio
- లంకె బిందెలు…..సాయి@366 జనవరి 30….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments