లంకె బిందెలు…..సాయి@366 జనవరి 30….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


ఊరికే పనీపాట లేకుండా కూర్చోవటం సాయిబాబాకు అస్సలు నచ్చేది కాదు. మీరెందుకు భిక్షకు వెళతారు? మేము తెచ్చి ఇస్తాం కదా ఆంటే కాదనే వారు.

అన్నదానం చేసే సమయంలో దాదాపు అన్ని పనులు, కావలసిన సరుకులు, వస్తువులను కొని తేవటం నుండి, అన్నీ తానై చేసేవారు. పనిదొంగ కాదు సాయి.

ఆధ్యాత్మిక ప్రవచనాలు నాలుగు చెప్పి సుఖప్రదమైన జీవితాన్ని గడపలేదు. అంతేకాక సోమరిపోతులంటే సాయికి నచ్చేది కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరకంగా చెప్పేవారు సమయం, కృషి విలువలను గూర్చి.

కుశాల్ చంద్ అనే వ్యక్తి ద్వారకామాయిలో ప్రతి రోజు పంచే నైవేద్యాలతోనే ఆ రోజు గడిపే వాడు. అతడు సోమరి.

సాయి అతనిని గమనించనట్లు కొంతకాలం ఉన్నారు. ఆ సోమరికి 3 , 4 ఎకరాల పొలం ఉంది.

సాయి అతనిని పిలచి “నీ పొలంలో లంకె బిందె ఉన్నది. నువ్వు భూమిని దున్ని దానిని తీసుకో” అన్నారు.

అతడు సంతోషంగా ఉరికి వెళ్ళి భూమిని దున్నేశాడు. లంకె బిందె కనపడలేదు.

మరల షిరిడీకి వచ్చి సాయిని దర్శించి లంకె బిందె కనబడలేదని చెప్పాడు. సాయి “దొరకలేదా? పొలాన్నేలా దున్నావు?” అని ప్రశ్నించారు.

అతడు “నిలువుగా దున్నాను” అన్నాడు. ఈ సారి “అడ్డంగా దున్ను” అన్నారు సాయి. అతను మరల ఊరికి వెళ్ళి అడ్డంగా దున్నాడు. ఈసారి కూడా లంకె బిందె దొరకలేదు. అదే చెప్పాడు సాయికి.

“దొరక లేదా? సరే. ఈ సారి పొలానికి మళ్ళుకట్టు ఎలా దొరకదో చూద్దాం. మిరప విత్తనాలు తెచ్చి నాటు సరైన సమయానికి నీరు పెట్టు. అప్పుడు లంకె బిందె దొరుకుతుంది” అన్నాడు సాయి.

సాయి చెప్పినట్టే చేశాడు. మిరప పంట బాగా పండింది. ఆ సంవత్సరం సంతలో ఎక్కడా మిరపకాయలు లేవు. అతని వద్దే మిరపకాయలున్నాయి.

లాభసాటిగా బేరం చేశాడు. ఆరు వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బు తెచ్చి సాయికి ఇచ్చాడు. సాయి ఆ డబ్బును తాకి తిరిగి అతనికే ఇచ్చివేస్తూ “లంకె బిందె దొరికిందా? లేదా? కష్టపడితే ఇలాంటి బిందెలెన్నో దొరుకుతాయి” అన్నారు.

అతడు సాయి ద్వారా కష్టజీవికి జగమంతా లక్ష్మీ నివాసం అని తెలుసుకున్నాడు.

సాయిబాబా కపర్డేను గమనిస్తూనే ఉన్నాడు. 30 జనవరి 1912న “మధ్యాహ్నం ఎలాగడిపావు?” అన్నారు.

“జాబులు (ఉత్తరాలు) వ్రాశాను” అన్నాడు కపర్డే. “ఉట్టినే కూచోవటం కంటే ఎదో చేతులు కదిలించటమన్నాచేశావు నయమేలే” అన్నారు సాయి నవ్వుతూ. ఆ ఒక్క మాట కపర్దేకు చాలు.

మనం ఈ గాథను గుర్తుంచుకుని నడుచుకుంటే చాలు!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles