ప్రశాంత వదనం … మహనీయులు – 2020… జూలై 29



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


“నేను 1935లో భారతదేశానికి వెళ్ళినప్పుడు రమణుల శిష్యుడు రామయోగిని దర్శించాను. వారితో చేతులు కలిపి తిరిగాను. ఆయన జీవన్ముక్తుడు. ఇంకా అరగంట ఆయనతో గడిపి ఉంటే భారతదేశం విడిచి విదేశాలకు వెళ్ళేవాడిని కాదు” అంటారు పరమహంస యోగానంద.

యోగానందులకంటే ముందుగా రామ యోగిని దర్శించి, అనుభవాలను పొందిన పాల్ బ్రంటన్ ప్రాశ్చాత్యుడు.

ఒకసారి పాల్ బ్రంటన్ తిరువణ్ణామలైలో ఉంటున్నప్పుడు, తన గదిని తెరవగానే, ఒక తాచుపాము కనిపించింది ఆయన కర్ర తేవటానికి పరుగెత్తబోతుంటే రామయోగి, పరిస్థితి చూచి, అర్ధం చేసుకున్నాడు.

రామయోగి నిర్భయంగా మంచి వయసులో ఉన్న ఆ తాచుపాము గదిలోనికి పోయారు. వెనకనుండి పోవద్దని బ్రంటన్ హెచ్చరికలు చేస్తున్నా, ఆయన లెక్కచేయలేదు.

పాల్ బ్రంటన్ ఆ అనుభవాన్ని ఇలా చెప్పారు “చేతులు ఎత్తి, ఆ సర్పంవైపు తిరిగి నమస్కరించారు. నాలుక బయటపెట్టి భీతిగొలిపే ఆ పాము, ఆయనపై దాడి చేయలేదు. పాము తన తలదించుకుంది.

ఆయన మెల్లిగా దాని తోకపై మెల్లగా తట్టాడు. ఆ విషప్రాణి చార చరా పాకుతూ కుటీరంలోంచి బయటకు వెళ్ళిపోయింది”.

ఇటువంటి సంఘటననే సాయి భక్తుడు నెవాస్కర్ జీవితంలో కూడా కనిపిస్తుంది. ఆత్మ తత్వము తెలిసిన యోగి దేనికీ స్పందించడు.

రామయోగి అనేక మహాత్ములను, సేవించి, చివరకు రమణుల అంతేవాసి అయ్యాడు.

రామయోగి చల్లని చూపే, బాధపడేవారికి ఉపశమనం అనటం అతిశయోక్తి కాదు. అత్యంత సమాజమైన విషయం.

బ్రహ్మానందతీర్థుల ఆదేశంతో అన్నారెడ్డిపాలెంలో రామాశ్రమాన్ని స్థాపించారు.

ఒకసారి ఆయనకు కారు ప్రమాదం జరిగింది. బెంగుళూరులోని ఒక ఆసుపత్రిలో ఉన్నారు.

ఆయనను తిరువణ్ణామలైకు తీసుకుపోదామని నటేశన్ అనే వ్యక్తి వెళ్ళారు. సటేశన్ కొంతకాలం ఆయన వద్దనే ఉన్నారు.

ఒకనాడు “సటేశా! సటేశా! చూడు, భగవాన్ (రమణమహర్షి) వచ్చారు. కుర్చీ తీసుకురా!” అన్నారు సటేశన్ తో రామయోగి.

“స్వామి! భగవాన్ ఇక్కడ లేరు. రేపు మనం తిరువణ్ణామలై పోతున్నాం” అన్నారు సటేశన్.

“భగవాన్ ఇక్కడ నుంచుని ఉన్నారు. ఆయన కష్టపడుతున్నారు. ఆయనకు కుర్చీవేయి” అన్నారు రామయోగి. అవే రామయోగి ఆఖరి మాటలు.

మరు క్షణమే ఆయన (రామయోగి) ఆనందంతో చిరునవ్వు నవ్వుతూ కన్నుమూశారు.

రామయోగిగారు జూలై 29, 1895లో జన్మించారు. నేడు రామయోగి జయంతి. ఆయనను స్మరించెదము గాక, మానసిక ప్రశాంతత మనలో నెలకొనుగాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles