Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
బ్రమ సుఖానంద దర్శనానికి పోయాడు పాల్ బ్రంటన్. బ్రమ శిలా విగ్రహంలా ఉన్నాడు. శరీరంలో కదలిక లేదు.
గుండె చప్పుడు క్షీణిస్తూవచ్చింది, గుండె కొట్టుకోవటమే మానేసింది. బ్రమ చనిపోయాడు అనుకున్నాడు బ్రంటన్.
కొద్ది సమయం గడచింది. బ్రమ మరల మామూలు స్థితికి వచ్చాడు. “గుండె ఆగిపోవటం గమనించావా?” ప్రశ్నించాడు బ్రమ. తల ఊపాడు బ్రంటన్.
“రక్త ప్రసరణను కూడా మా గురువులు ఆపగలరు” అన్నాడు బ్రమ. దానిని కూడా నీవు చూపు అన్నాడు బ్రంటన్.
మణికట్టు వద్ద ఉన్న నాడిని పట్టుకొమ్మన్నాడు బ్రమ బ్రంటన్ ను. అలాగే చేశాడు బ్రంటన్.
నాడీ స్పందన తగ్గుకుంటూ వచ్చి, ఆగిపోయింది. కొంచెంసేపు అలా ఉంది. మరల నాడీ స్పందన మొదలైంది. ఆశ్చర్యపోయాడు బ్రంటన్.
“శ్వాసను కూడా ఆపివేయగలను” అన్నాడు బ్రమ. “సరే అది కూడా చూపు” అన్నాడు బ్రంటన్.
కాసేపటిలో ఒకరకమైన సమాధి స్థితిలోనికి వెళ్ళాడు బ్రమ. ఎన్నో పరీక్షలు చేశాడు బ్రంటన్.
యోగా అంటే చిన్న చూపున్న బ్రంటన్, ఇవన్నీ చూసి సిగ్గుపడ్డాడు. యోగా శాస్త్ర ప్రావీణ్యం ఉన్న యోగి తన శ్వాసను కొద్ది సంవత్సరాలు కూడా బంధించి ఉంచగలరు.
దేహంలో శ్వాస ఉన్నంతకాలం ప్రాణం ఉంటుంది. అంటే మనిషి తన జీవనకాలాన్ని పొడిగించుకొనవచ్చును అన్నాడు బ్రమ.
దీనిని నమ్మలేదు బ్రంటన్. ఆంగ్ల ప్రభుత్వ పత్రాలలో గ్రంథస్తమైన గాథను చెప్పాడు బ్రమ.
లాహోరులో రంజిత్ మహారాజ్ ఒక సాధారణ యోగిని బంధించి, ఆంగ్లేయ సైనికాధికారుల సమక్షంలో సమాధి చేయించాడు.
ఆరు వారాలపాటు ఆ బ్రిటిష్ సైనికులే కాపలా ఉన్నారు. ఆరు వారాల తరువాత యోతి ఆరోగ్యంగా బయటకు వచ్చాడు.
బ్రమ మరిన్ని వివరాలు చెప్పాడు. ఆ యోగి పేరు హరిదాసు అని, ఆయనకు యోగ శాస్త్రంపై పెద్దగా పట్టులేదనీ చెప్పాడు.
అటువంటి సర్వసాధారణమైన యోగి అట్లా ఉండగలిగినప్పడు, నిలువెత్తు బంగార మిచ్చినా యోగ ప్రదర్శనలు చేయని యోగులకు ఇంకెన్ని శక్తులు ఉన్నాయో ఎవరు ఉహించగలరు?
రామచంద్ర ఆత్మారాం తర్కడ్ ఒకసారి బాబా మాధవదాస్ ను దర్శించాడు.
అప్పుడు ఎవరో మహిళా భక్తురాలు వచ్చింది. అయన వెంటనే స్త్రీగా మారిపోయాడు. ఆ మహిళ వెళ్ళిన తరువాత ఆ యోగితో మాట్లాడాడు తర్కడ్.
తోడవద్ద ఒక నరం ఉంటుందని, దానిని తాకితే లేదా సాగతీస్తే, ఆడ మగగాను, మగ ఆడగాను మారవచ్చని చెప్పారు.
తర్కడ్ సాయి ఖండయోగాన్ని గురించి తెలిపాడు. ఆ ఖండయోగాన్ని తన వచ్చే జన్మలో చేయగలనని చెప్పాడు.
సాయి ఖండయోగం, ధౌతి మొదలైనవెన్నో చేసారు. అందుకే సాయిని యోగ సామ్రాట్ అంటారు.
బ్రమ సుఖానంద తేదీ వగైరాలు అలభ్యం.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ప్రశాంత వదనం … మహనీయులు – 2020… జూలై 29
- మౌన యోగం .. …. మహనీయులు – 2020… మే 29
- యోగ కళాప్రపూర్ణ …. మహనీయులు – 2020… జూన్ 16
- పరీక్షలు …. మహనీయులు – 2020… ఏప్రిల్ 23
- భిక్షాన్న నివేదన …. మహనీయులు – 2020… ఏప్రిల్ 16
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments