Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
లండన్ మహానగరంలో అనాథ అయిన ఆజీబాయిని సాయి సచ్చరిత్ర పారాయణ కాపాడింది. మరల గౌరవప్రదంగా లండన్ మహానగరంలోనే నిలువ నీడ కల్పించాడు సాయి.
ఆమె నిలదొక్కుకున్నది. ఆమె నడిపే భారతీయ వసతి గృహం మంచి పేరు తెచ్చుకున్నది.
ఆమె తనను సాయి మార్గానికి పరిచయం చేసిన డాక్టర్ తుకారాం కాకడేను, సాయిబాబాను మరువలేదు.
కృతజ్ఞతగ సాయిబాబాకు లండన్ మహానగరంలో మందిరం నిర్మించానికి సంకల్పించు కున్నది.
ఈ విషయాన్ని డాక్టర్ కాకడే కు తెలిపింది. డాక్టర్ కాకడే తన మిత్ర బృందాన్ని కలిశాడు. వారిలో ఒకరు ఆబాపాన్సీకర్. ఈయన సాయి భక్తుడు.
ఈయన సాయిబాబా వెండి పాదుకలను తయారు చేయించి, షిరిడీ తీసుకుని వెళ్ళి సాయిబాబా సమాధి వద్ద ఉంచి పూజలు, అభిషేకము జరిపించి వాటిని ఒక సాయి భక్తునకు ఇచ్చే వారు. ఇది ఆయన వ్రతం.
ఆజీబాయిని గురించి డాక్టర్ కాకడే అబాపాన్సీకర్‌తో చెప్పగానే ఆయన అంగీకరించారు.
ఆ పాదుకలను స్వయంగా లండన్ మహానగరం తీసుకుని వెళ్ళి ఆమె తలపెట్టిన దేవాయంలో ప్రతిష్టింప దలచాడు. సాయి కాదంటాడా?
ఇంకా శ్రీ మేఘరాజ్ భాయిగాలా అనే పెద్ద మనిషి తన వంతుగా సాయి దేవాలయానికి మూడు అడుగుల పాలరాతి విగ్రహాన్ని తయారు చేయించి ఇవ్వటానికి ముందుకొచ్చాడు.
విదేశాలలో సాయి మందిరం ఇదే ప్రథమం కాబట్టి, ఏర్పాట్లన్నీ పెద్ద ఎత్తున జరిగాయి.
ఆ ప్రతిష్ట జూలై 29, 1965న జరిగింది. అది హుప్ లేన్, గోల్టర్ గ్రీన్ ఏరియా, లండన్‌లో ఉన్నది.
సాయి మందిర ప్రారంభోత్సవం ఒక పండుగలాగా సాగింది. ఉత్సవము జయప్రదంగా, శోభాయమానంగా జరిగిందని, ఇంగ్లాడులోని ప్రముఖ పత్రికల దృష్టి నాకర్షించి ఈ విశేష వార్త ప్రచురితమైంది.
ఆ రోజుల్లోనే గురువారపు ఆరతులకు 500 నుండి 700 వరకు భక్తులు హాజరయ్యేవారు.
ఆనాడు ఆ సాయి మందిరం లండన్‌లోని భారతీయలకు స్వగృహంలాగా ఉండేది.
సాయి విదేశాలలో లీలలు చూపటం అది మొదలు కాదు కానీ విదేశాలలో సాయి మందిర నిర్మాణానికి నాంది పలికింది.
ఇదంతా ఆజీబాయి అనే మహిళతో సాయి చేయించారు.
ఇది సాయి సర్వాంతర్యామి అని తెలుపుతోంది మనకు!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- పారాయణ ఫలం…..సాయి@366 జూలై 7….Audio
- ప్రకృతిని శాసించే సాయి …..సాయి@366 జూలై 12….Audio
- షిరిడీలో ప్రథమ గురుపూర్ణిమ…..సాయి@366 జూలై 3…..Audio
- పశు వైద్యుడు…..సాయి@366 జూలై 30….Audio
- సాయి సాహిత్యవనంలో పాశ్చాత్య పుష్పం …..సాయి@366 మే 8….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “విదేశాల్లో ప్రథమ సాయి మందిరం…..సాయి@366 జూలై 29….Audio”
Creative Channel
August 5, 2019 at 7:54 pmధన్యవాదములు. బ్లాగ్ బావుంది. బాబాగారి గురించి చాలా వివరంగా రాసారు.
నేను 2010 మే నెలలో ఫస్ట్ టైం షిర్డీ వెళ్ళినప్పుడు బాబా కనిపించారు. దర్శనం తర్వాత మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. ఆంధ్ర హోటల్ కి వెళ్ళాను ఫుడ్ అయిపొయింది. మండుటెండ. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ట్రైన్ టైం కూడా దగ్గర పడింది. హోటల్స్ కోసం వెతుకుతున్నా. అంతలో అచ్చంగా బాబా డ్రెస్ లో ఒక మధ్య వయ్యసాయన కనపడి మరాఠీలో చెప్పాడు. సాయి బాబా ప్రసాదం వుంది 10 రూపాయలే చెపాతీలు , కొద్దిగా అన్నం, సాంబారు పెడతారు వెళ్లి తినండి అన్నాడు. కొద్దిగా అర్థం అయ్యింది. రండి చూపిస్తా అని తీసుకుని వెళ్లి చూపించాడు. ఆ మండుటెండలో నేను, నా ఫ్రెండ్స్ కష్టబడి నడుస్తుండే, అసలు చెప్పులే లేకుండా అతను చక చకా నడుచుకుంటూ వచ్చాడు. ప్రసాదాలయం దగ్గరకు వెళ్ళాక, “అక్కడే కౌంటర్ ఉంటుంది. 10 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకోండి అని దారి చూపించాడు. థాంక్స్ చెబుతామని వెన్నక్కి చూస్తే అక్కడ ఎక్కాడా ఆయన లేరు. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అర్థం అయ్యింది ఆయన ఎవరో కాదు బాబానే అని. ఈ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేను
=రవికుమార్ పెదిరెడ్ల
Original Photos of Saibaba
https://www.youtube.com/watch?v=yBc0A3hH4hU
madhavi
July 29, 2020 at 9:49 amom sai sri sai jai jai sai
om sai sri sai jai jai sai
om sai sri sai jai jai sai