పారాయణ ఫలం…..సాయి@366 జూలై 7….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


అమరావతి నుండి బనారసీ దంపతులు పొట్ట చేత పట్టుకుని పిల్లలతో లండన్‌ మహానగరం చేరారు. అక్కడ భారతీయ వాతావరణాన్ని తలపించే భోజన వసతి గృహాన్ని తెరుద్దామని.

రోజులు అనుకూలించాయి. భారతీయుల నెందరినో ఆకర్షించింది ఆ వసతి గృహం. అన్నిటికంటే యజమానురాలయిన ఆజీబాయి అందరినీ ఆపేక్షగా చూచుకునేది.

మాతృప్రేమను మరల లండన్‌లో భారతీయులు అనుభవించారు ఆమె సమక్షంలో.

ఆమె భర్త మరణించాడు. సవతి కొడుకు ఆమె వద్దకు వచ్చి, ఆ ఇంటిని ఖాళీ చేసి పిల్లలతో సహా వెళ్ళి పొమ్మన్నాడు. ఆమె అవాక్కయ్యింది. భయపడింది.

గతంలో మహారాష్ట్రకు చెందిన రామచంద్ర తుకారాం కాకడే, ఆయన భార్యతో సహా ఆ వసతి గృహంలో కొంత కాలం ఉన్నారు.

ఆ సమయంలో ఆమె ప్రప్రథమంగా సాయిబాబా చిత్రాన్ని చూచింది. కాకడే చేసే పూజలో ఆమె కూడా పాల్గొనేది. ప్రసాదాలను ఆమె స్వయంగా చేసి ఇచ్చేది.

ఆయన చదివే పారాయణ గ్రంథం వివరాలు తెలుసుకున్నది. కాకడే ఆమెకు ఒక పారాయణ గ్రంథం, సాయి పటం ఇచ్చి పూజా విధానం తెలిపాడు.

ఇక ఆమె సాయి భక్తురాలైంది. రోజూ సాయి సచ్చరిత్రను పారాయణ చేసేది. ఇక ఆమెకు తోడు నీడ సాయిబాబాయే అని గ్రహించింది. సాయి మహా సమాధి చెంది 42 సంవత్సరాలు అయ్యింది.

లండన్‌ మహానగరంలో తనకు తన పిల్లలకు నిలువ నీడ లేదని గ్రహించి, ఉన్న అతి కొద్ది ఆస్తిని అమ్మివేసి భారతదేశం వచ్చేద్దామను కున్నది.

ఆ రోజు జూలై 7, 1961 సంవత్సరం. ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి ”వసతి గృహ వ్యాపారం చేయాలని ఉన్నదా?” అని ప్రశ్నించాడు. ఆమె ఆశ్చర్యపోయింది.

అది తనకు గొంతెమ్మ కోర్కె అని తెలుసుకున్నది. ఆయన తనకు తెలిసిన ఒక వసతి గృహం అమ్మకానికున్నదని, అమ్ము వారు తనకు తెలుసునని, ఇష్టమైతే సులభ వాయిదాల మీద చెల్లించటానికి తాను ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఆమె ”సరే” అన్నది.

అతను అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ తరువాత ఎప్పుడూ అతను కనపడలేదు. తిరిగి లండన్‌ మహానగరంలో నిలదొక్కు కునేటట్లు చేశాడా మహనీయుడు.

ఆ మహానీయుడు ఎవరో కాదని, సాయిబాబాయే అని ఆమె గట్టి నమ్మకం. ఎవరు కాదన గలరు!

ఆమె జీవితాంతం సాయి సచ్చరిత్ర పారాయణ చేసి తరించింది.

ప్రతి ఫలం ఆశించకుండా చేసే పారాయణ, పూజలు తప్పక అక్కరకు వస్తాయి.

మనం కూడా నిత్యం సాయి సచ్చరిత్ర పారాయణ చేద్దాం!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles