సాయి సాహిత్యవనంలో పాశ్చాత్య పుష్పం …..సాయి@366 మే 8….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


హేమాడ్ పంత్‌ వలన సాయిబాబా మహారాష్ట్రులకు, బి.వి. నరసింహ స్వామి వలన భారత దేశ ప్రజలకు, ఆర్ధర్‌ ఆస్‌బోర్న్‌ వలన పాశ్చాత్యులకు తెలిసారు.

ఆస్‌బోర్న్‌, నరసింహ స్వాములకు ఒక సామ్యము ఉన్నది. ఇద్దరూ తిరువణ్ణామలై రమణ మహర్షులను సేవించిన వారే.

ఆ ఇరువురు మొదటిసారిగా చేసిన రచనలు ప్రఖ్యాత రచనలయ్యాయి. ఆస్‌బోర్న్‌ మొదటిగా సాయిపై తనంతటతాను ఆంగ్లములో వ్రాయదలచుకోలేదు.

విషయమును తెల్పి, ఒక చక్కని రచయితచే సాయినాథ జీవిత చరిత్రను వ్రాయించవలసినదని కోరిన సహృదయుడు.

అయితే ఆ ప్రకాశకులకు సరైన రచయిత దొరకనందున, ఆస్‌బోర్న్‌ గారినే రచింపుమని కోరగా, ఆయన ”ది ఇన్‌క్రెడిబుల్‌ సాయిబాబా”ను రచించారు.

ఆ రచనకు వలయు విషయములను శ్రీ బి.వి. నరసింహ స్వామి గారే తన ముద్రిత రచనలనుండి గైకొనమని తెలిపినారు.

ఆ గ్రంథము మొదటి ఎడిషన్‌ 1957 డిసెంబరులో వచ్చినది. తొలి పలుకులను రచించినది కనహన్‌గఢ్‌ రామదాస్‌.

కళాప్రపూర్ణ శ్రీ మరుపూరు కోదండ రామిరెడ్డి గారు మొదటిసారిగా తెలుగులోనికి అనువదించారు.

లండన్‌ మహానగరంలో జన్మించిన ఆస్‌బోర్న్‌ హిందూ వేదాంతం, యోగంపై ప్రీతితో అరుణాచలవాసి శ్రీ రమణుల చెంత అనేక సంవత్సరాలు ఉన్నారు.

ఆయనపై కొన్ని పుస్తకాలను వ్రాశారు. షిరిడీ భగవానుని దివ్య తేజం సంస్కార హృదయుడైన ఆస్‌బోర్న్‌ను చకితుని చేసింది.

ఈ రచన ప్రశంసార్హమైన కళాఖండం. బాబా ఉపదేశాలు అప్రతిమాన దీపకములు, ఈ శతాబ్ది జాగృతికి శంఖారావములు అని ఆ ఆంగ్లేయుని విశ్వాసము.

అనంతరం డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి గారు ”మహా మహిమాన్వితులు సాయిబాబా – ఈ కాలపు అద్భుత యోగి” అనే పేరుతో అనువదించారు.

ఈ గ్రంథంములోని సత్యాన్వేషణలో మత ప్రమేయం ఉండదు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసలు ఏ ఏ సంఘటనలో ఎలా స్పందించేవారో కూడా వ్రాశారు.

సాయి గాథలలోని ప్రతీకలకు చక్కటి, సులభ వివరణలను ఇచ్చారు. ఈ రచనలోని సాయిబాబా యొక్క సర్వోత్కృష్ట శోభ అందరి హృదయాలను పరవశింప చేస్తుంది.

మనకు సాయిని మరింత దగ్గర చేసిన ఆస్‌బోర్న్‌ మే 8, 1970లో సాయి రమణులలో ఐక్యమయ్యారు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles