Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
“అల్లా నాకు అప్పగించిన ప్రతి పైసాకు నేను లెక్క చెప్పుకోవాలి”అనేవారు సాయి. ఇక్కడ పైసా అంటే డబ్బులు కాదు. మనుష్యులని సాయి భావము.
సాయిబాబా మహా సమాధి చెందిన కొంత కాలం వరకు అధికంగా మహారాష్ట్రకే పరిమితమయ్యారు.
సాయిబాబాకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి నార్జించి పెట్టిన నిష్కాములు శ్రీ బి.వి.నరసింహ స్వామి.
దేశ, విదేశీయులకు బాబాను పరిచయం చేసిన ప్రథమ వ్యక్తి శ్రీ నరసింహ స్వామి అనటం అతిశయోక్తి కాదు. షిరిడీలోని ఫకీరును ఇలవేల్పుగా చేసినది నరసింహస్వామి భక్తి రచనలు.
బిడ్డల మరణంతో సత్యాన్వేషణ ప్రారంభించారు నరసింహ స్వామి. శృంగేరీ శంకరాచార్యుల వారి వద్ద దీక్ష తీసుకున్నారు.
మొదటగా దర్శించినది తిరువణ్ణామలైలోని రమణులవారిని. ఆయన అన్వేషిస్తూ షిరిడీకి కూతవేటు దూరంలో ఉన్న సాకోరిలో కొన్ని సంవత్సరాలున్నారు.
అంతే కాదు “సెజ్ అఫ్ సాకోరి” అను గ్రంథంలో సాయిబాబా గురించి ఒక అధ్యాయాన్ని రాశారు.
షిరిడీకి వెళ్ళాలనే కోరిక ఆయనకు రాకపోవటమే కాదు ఉపాసనీ బాబా కూడ చెప్పక పోవటానికి కారణం బాబా పిలుపు రాలేదనటానికి సంకేతం.
ఎట్టకేలకు షిరిడీలో కాలు పెట్టారు నరసింహ స్వామి. ఆ క్షణం నుండి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ సాయియే అయ్యారు ఆయనకు.
ఆయన మనందరికి అలానే చెప్పారు. నేడు ప్రతి ఇంటా సాయి ఇలవేలుపే. నేడు ప్రతి పల్లెలోనే కాదు ప్రతి వీధిలోను సాయి మందిరాలే.
ఎక్కడైనా సరే “సాయి” అని పిలిస్తే సాయి రాడేమో కాని కనీసం నలుగురైదుగురు తప్పక వస్తారు తమనే పిలిచారనుకొని.
సాయిబాబా అష్టోత్తర రచన ఈయనదే. సాయిబాబాపై ఒక పేజీ వ్యాసం నుండి పి.హెడి. చేసేవారి వరకు ఆధారం వీరి రచనలే.
ఒక బడుగు బాపడు చిరుగు కఫినీ వెనుక మరుగుపడిన అనుగ్రహ భాండాగారాన్ని మనమంతా ఎగబడి దోచుకోవటానికి దోహదం చేసింది. నరసింహ స్వామి గారు అంటారు మణిగారు.
“శ్రీరామకృష్ణ పరమహంసకు, వివేకానంద స్వామి ఎట్లాగో సాయికి నరసింహ స్వామి అట్లా” అంటారు శ్రీ యం. బి.రేగే.
జనవరి 26, 1967లో శ్రీ యం.బి. రేగే సాయి సన్నిధిలో (బూటీ మందిరంలో) బి.వి.నరసింహ స్వామి చిత్తరువును ఆవిష్కరించారు.
బిడ్డను తన గూటికి చేర్చుకున్నది ఆ తల్లి పక్షి.
సాయి పక్షి రెక్కల కింద మనము చేరుదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గూడు చేరిన బీవీఎన్…..సాయి@366 ఆగస్టు 29….Audio
- గురుభక్తి…..సాయి@366 ఏప్రిల్ 17….Audio
- మరచిపోయేది మానవ హృదయం…..సాయి@366 జూలై 9….Audio
- అపర భగీరధుడు …..సాయి@366 అక్టోబర్ 18….Audio
- కనిపించని వైద్యుడు …..సాయి@366 మే 12….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments