Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
బ్యాంకాక్ యూనివర్శిటీని జపాన్ వారు ముట్టడించారు. బందీలుగా చిక్కిన వారిని జైలులో బంధించారు.
కొందరు ఖైదీలను ప్రత్యేక బృందంవచ్చి తీసుకుపోయేది, వారిని ఆ బృందం చంపేది.
ఒకనాడు ఆ బృందం వచ్చి ఒక వ్యక్తిని జైలునుండి తీసుకుపోయింది. అక్కడున్నవారంతా ఆ వ్యక్తిని చంపేస్తారనే భావించారు, ఎందుకంటే ఆ కార్యక్రమం అలానే సాగుతొంది.
ఆ ఖైదీని చంపలేదు. కారణం ఏమిటి?
ఆ ఖైదీ ఎవరోకాడు, ఆర్డర్ అస్ బోర్న్, ఆయనే ఆ సంఘటనను గూర్చి “నేను ఆఖరుగా చూసింది భగవాన్ రమణ మహర్షి ఫోటోను, ఆ రెండు పుస్తకాలను నేను తుపాకీలు పేల్చే దళము ముందు నిలబడి కనులు మూసుకున్నాను భగవానుని ప్రార్ధించలేదు, కానీ భగవానుని చిత్రము నా మనసులోకి వచ్చింది.
ఎదో తెలియని కారణంతో నన్ను కాల్చకండా రాజకీయ ఖైదీలుండే శిబిరానికి పంపారు” అని వివరించారు.
అక్కడ తిరువణ్ణామలైలో, ఆయన భార్య, సంతానము భగవాన్ ను ప్రార్ధించేవారు. ఆస్ బోర్న్ కుమారుని పేరు ఆడం.
భగవాన్ “అవును ఆడం తండ్రిగారు వెనుక వస్తున్నారు” అని భగవాన్ ఆడమ్ కు తన తండ్రి (ఆస్ బోర్న్) విడుదలను గూర్చి తెలిపారు.
భగవాన్ రమణుల ఆశీర్వాదము, అనుగ్రహము ఎటువంటిదో అర్థంకావటం మొదలైనది అస్ బోర్న్ కు, ఇతరులకు.
భగవాన్ మహాసమాధి చెందిన తరువాత అస్ బోర్న్ కు స్వప్నంలో కనిపించారు. భగవాన్ తన చేతిని, ఆశీర్వాదపూర్వకంగా ఆయన తలపై (ఆస్ బోర్న్) ఉంచారు.
అస్ బోర్న్ కు వెంటనే భగవానుని సూటి బోధలను గూర్చి వ్రాయమని ఆదేశమని గ్రహించారు. రమణులపై అనేక గ్రంథాలను ఆయన వ్రాయటం జరిగింది.
ఆస్ బోర్న్ కొంతకాలం కలకత్తాలో పనిచేశారు. ఒక రాత్రి ఆయనకు స్వప్నంలో సాయిబాబాపై రచనను చేయమన్నారు.
తనకు సాయిబాబా గూర్చి పెద్దగా తెలియదని ఆస్ బోర్న్ ఆ స్వప్నంలోనే సమాధానమిచ్చాడు.
భగవాన్ అప్పుడు ఆయనను సాయిబాబా గుడికి వెళ్ళమని, సాయిబాబా తనంతతానుగా ఏమి వ్రాయాలో తెల్పెదరని చెప్పారు. ఆ స్వప్నమే ఆయనను షిరిడీకి తీసుకువెళ్ళింది.
‘ది ఇన్ క్రెడిబుల్ సాయిబాబా’ ను రచించుటకు దోహదకారైంది. ఇదియే సాయిబాబాపై ప్రప్రథమంగా వెలువడిన ఆంగ్ల గ్రంథరాజము.
నేటికిని ఇది ప్రాక్ పశ్చిమ దేశముల వారి మన్ననలను పొందుతొంది ఈ గ్రంథము.
1962 లో రమణాశ్రమము ఆర్థిక చిక్కులలో ఉంది. అందుకుగాను అస్ బోర్న్ ‘ది మౌంటెన్ పాత్’ అను పత్రికను ప్రారంభించారు.
అస్ బోర్న్ తన శరీరమును వదిలివేయు సమయము సమీపించినదని తెలిసిన ఆత్మజ్ఞాని.
అస్ బోర్న్ కేవలము భక్తుడు, జ్ఞాని, గొప్ప రచయిత మాత్రమే కా దు. తన అంతిమ ఘడియలు సమీపించుచున్నవని తెలిసినప్పుడు తన పాదముల చెంతనున్న తన భార్యతో “థాంక్యూ” అనిన సంస్కారి.
ఆయన మే 8 (1973)న రమణులలో లీనమైనారు. ఆయనను స్మరించెదము గాక. ఆత్మ సాక్షాత్కారము మనకు కలుగును గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి సాహిత్యవనంలో పాశ్చాత్య పుష్పం …..సాయి@366 మే 8….Audio
- జ్ఞానిని గుర్తించిన జ్ఞాని …..సాయి@366 డిసెంబర్ 1….Audio
- కల నిజమాయెగా…. మహనీయులు – 2020… నవంబర్ 9
- శ్రీ రమణ చరణ పల్లాండు… …. మహనీయులు – 2020… ఆగస్టు 28
- గురువుకు నామం…. మహనీయులు – 2020… నవంబర్ 18
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments