Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒకసారి సాయిబాబా వినాయక సాఠే అనే భక్తుని రమ్మని కబురు పెట్టాడు. ఆ సమయంలో సాఠే చేతిలో కొరడా తీసుకుని ఒక వ్యక్తిని కోపంతో దండించబోతున్నాడు. వెంటనే ఆ కొరడాను పారవేసి బాబా వద్దకు వెళ్ళాడు.
తిరువణ్ణామలైలో భగవాన్ రమణులకు మురగనార్ సాష్టాంగపడి నమస్కరిస్తుంటే, ఎవరో ఏదో రమణులను ఒక ప్రశ్న అడిగారు.
దానికి సమాధానం ఏమిటని సాష్టాంగ నమస్కారం చేస్తున్న మురుగనార్ ను రమణులు అడిగారు.
సాష్టాంగము చేయుచున్న మురుగన్ లేచి నిలబడకుండా, తలను మాత్రము పైకెత్తి, భగవాన్ అడిగిన ప్రశ్నకు వివరముగా సమాధానము చెప్పాడు.
కొంచెం సేపు అయింది. విశ్వనాథస్వామి మురుగనార్ ను ఒంటరిగ ఉండుట చూచి భగవాన్ అడిగిన ప్రశ్నకు తొండ వలె తలను మాత్రమే పైకెత్తి సమాధానమిచ్చిరి. అట్లు చేయవచ్చునా? అని ప్రేమ పూర్వకముగా అడిగాడు.
“భగవాన్ నన్ను ఏదైనా అడిగిన వెంటనే సమాధాన మివ్వవలెననే ఆలోచనతో, నేను నిలబడి సమాధాన మిచ్చుచుంటినా? పరుండి సమాధాన మిచ్చుచుంటినా అన్న తలంపే రాలేదు.
నేను ఏమి చేతును. ఇది నా యొక్క బలహీనతయే” అని కన్నీరు కారుస్తూ సమాధానమిచ్చాడు మురగనార్. అది గురు భక్తికి నిదర్శనం.
మురుగనార్ సంతసముతో ఊరు నుండి వచ్చి భగవాన్ దర్శనము చేసుకొనెడి వాడు. కానీ ఊరికి పోవునప్పుడు తేనెలో పడ్డ ఈగ వలె కొట్టుకొనెడివాడు.
ఒకసారి రమణులు కొందరు భక్తులను మురగనార్ ను రైల్వేస్టేషన్ లో దించి రండి అన్నారు. మురగనార్ ఊరికి పోవునపుడు.
మురుగనార్ ను స్టేషన్ లో దించి ఆశ్రమానికి వెళ్లిపోయారు. మురగనార్ ప్లాట్ ఫారంపై అటు ఇటు తిరుగుతూ, రమణులను గూర్చి ఆలోచించుచున్నాడు.
రైలు వచ్చింది, రైలు వచ్చి గట్టిగా కూత వేసినా పట్టించుకునే స్థితిలో లేడు మురగనార్. రైలు వెళ్లిపోయింది.
ఎప్పటికో ఈ లోకంలోకి వచ్చిన మురుగనార్ కు రైలు వెళ్లిపోయిందని తెలుసుకుని, తిరిగి రమణుల చెంతకు చేరాడు.
కారణము గ్రహించిన రమణులు, అతనిని రైలెక్కించి, రైలు కదలిన తరువాత రమ్మని ఆశ్రమ సేవకులకు చెప్పేవారు.
ఈ ఏకాగ్ర చింతనమే మురగనార్ ను భగవాన్ పట్ల పూర్ణ శరణాగతులైనట్లు చేసింది. వీరి పరిపూర్ణ శరణాగతి మిక్కిలి ప్రసిద్ధి పొందినది.
మురుగన్ ‘రమణ సన్నిధి మురై’ తిరువాచకంతో తులతూగ గలదని రమణులన్నారు.
రమణుల రచన ‘ఉన్నది నలుబది’ వీరి (మురుగనార్) ప్రోద్బలము వల్లనే వెలుగు చూసింది.
ఈయన ఆగస్టు 28 (1973)న రమణ చరణాలలో లీనమయ్యారు.
నేడు ఆగస్టు 28. మురగనార్ వర్థంతి. మురగనార్ ను, రామానులను స్మరించెదము.
“శ్రీ రమణ చరణ పల్లాంబ …”
(రమణ చరణం కలకాలం వర్దిల్లు గాక!)
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కల నిజమాయెగా…. మహనీయులు – 2020… నవంబర్ 9
- పాశ్చాత్య కలం – భారతీయ గళం…. మహనీయులు – 2020… మే 8
- గురువుకు నామం…. మహనీయులు – 2020… నవంబర్ 18
- గురువు శిష్యుడాయే… …. మహనీయులు – 2020… ఆగస్టు 31
- ఓం నమో భగవతే శ్రీధరాయ! …. మహనీయులు – 2020… ఏప్రిల్ 19
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments