కడివెడు మజ్జిగ…..సాయి@366 ఆగస్టు 28…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయిబాబా మహా సమాధి చెందే రెండు నెలలకు ముందు హేమాడ్‌పంత్‌కు గ్లాసెడు మజ్జిగను ఇచ్చి ”దీనినంతయు త్రాగుము. నీకిక మీదట ఇట్టి అవకాశము రాదు” అన్నారు.

సాయిబాబా అక్టోబరు 15న మహా సమాధి చెందారు. చిక్కని మజ్జిగను ఆగస్టు నెలలో హేమాడ్‌పంత్‌ సాయి చేతుల నుండి పొందాడు.

సాయి మహా సమాధి చెందే ముందు రూ.9/- లక్ష్మీబాయి షిండేకు ఇచ్చారు. ఆ భక్తురాలికి ఇచ్చిన ఆ తొమ్మిది రూపాయలు నవ విధ భక్తులకు సంకేతము అంతవరకే.

హేమాడ్‌పంత్‌కు ఇచ్చిన మజ్జిగ, ప్రతి సాయి భక్తునకు మండు వేసవిలో దాహాన్ని తీర్చే చల్లటి మజ్జిగ అయింది.

”సాయి బాబా దర్శనాభిలాష తీరని వారు ఈ సచ్చరిత అందలి కథలను భక్తి, శ్రద్ధలతో వింటే పాలకు బదులు మజ్జిగ లభించినట్లు, సాయిని చూడాలనే దర్శన పిపాస కొంత తీరుతుంది” అంటారు హేమాడ్‌పంత్‌.

సాయి సచ్చరితవంటి మహాకావ్యాన్ని, బ్రహ్మోపనిషత్తు పాలయందలి నేయి వలె పరమాత్మను సర్వాంతర్యామిగా వ్యాపించి యున్నాడని వర్ణిస్తుంది.

ఈ సంగతిని జ్ఞానులు అనుభవపూర్వకంగా గ్రహిస్తారు, ఆచరిస్తారు. కాని ఆజ్ఞానులు పఠనం వరకే పరిమిత మవుతారు.

తన సర్వాంతర్యామిత్వాన్ని ఆకలిగొన్న కుక్కలో, పందిలో శ్రీమతి తర్కడ్‌కు చూపారు. మహల్సాపతి ఒక గజ్జి కుక్కను కొడితే, ఆ దెబ్బలు తనకే అని చెప్పి, ఆయన కన్నులు తెరిపించారు.

బాలబువా సతార్కర్‌తో తన ఫోటోకు నమస్కారంపెడితే తనకు పెట్టినట్లే అన్నాడు సాయి. అవన్నీ సమాధి చెందక పూర్వం జరిగిన సంఘటనలు.

వాటిని ఆనాటి భక్తులు పాలధారగా స్వీకరించారు సాయి నుండి. సాయి మహా సమాధి తరువాత నేటిభక్తులు ప్రత్యక్షంగా పాలధారను స్వీకరించలేరు.

సాయి ఇచ్చే పాలధారవంటి ప్రత్యక్ష సంఘటనలకు ప్రత్యామ్నాయం ఏమిటి? హేమాడ్‌పంత్‌ చెప్పాడు మజ్జిగ అని.

మజ్జిగ ఎలా ప్రత్యామ్నాయం అవుతుంది? ఆనాటి పాలధార సాయిని ప్రత్యక్షంగా సేవించిన వారి వద్ద నిక్షిప్తమై ఉన్నది.

ఆ పాలను సేకరించి తోడు వేయటానికి సాయి, హేమాడ్‌పంత్‌కు మజ్జిగ ఇచ్చారు. అలా హేమాడ్‌పంత్‌ తోడు వేయగా లభించింది మహా మహిమాన్వితమైన సచ్చరిత.

ఆ సచ్చరితలోని కథలు, గాథలు మజ్జిగ అయ్యాయి. దాహాన్ని తీరుస్తున్నాయి. ఇంకా, ఆ చిక్కటి మజ్జిగను మన మనస్సు అనే కవ్వంతో మధిస్తే, జ్ఞానమనే వెన్న కూడా మన చేతికి వస్తుంది.

ఇది సాయి సచ్చరిత చల్లని మజ్జిగ కుండ!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles