Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
బాబా స్వప్నంలో మా ఇంటికి వచ్చి మేము ఇచ్చిన కాఫీని స్వీకరించారు
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ
పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయిబంధువలకు నమస్కారం.నా పేరు తేజస్వి ( తెనాలి )
మా జీవితం లో బాబా ఎప్పుడు మాతోనే ఉన్నారు,ఇక ఎప్పుడు ఉంటారు అనేది నా ప్రగాఢ విశ్వాసం.
నాకు బాబా అంటే చాల చాల ఇష్టం.నా చిన్ననాటినుండి మా ఇంట్లో అందరికి బాబా అంటే చాల నమ్మకం,ప్రేమ.
మా అమ్మగారు గురుచరిత్ర బాబా సచ్చరిత్ర పారాయణ చేస్తూ ఉండేవారు.
పారాయణ చేస్తున్నపుడు ఏడురోజులలో అమ్మకు ఎదో ఒకరోజు లేదా పూర్తి అయ్యకో స్వప్నంలో చాలాసార్లు మా పూజ గదిలో బాబా ఎర్రటి కఫ్ని వేసుకుని, నవ్వుతూ కూచుని ఉన్నట్లు కనిపించేవారు.
అప్పుడు అమ్మ సంతోషం మాటల్లో చెప్పనలివి కాదు.
అలా బాబాతో మాకు అనుబంధం ఏర్పడింది.లేదు లేదు బాబానే మమల్ని అయన వైపు ఆకర్షించారు అనటం సముచితం.
ఎందుకంటే బాబా ఒక దివ్య అయస్కాంతం.
మా ఇంట్లో మాకు ఒక అలవాటు ఉంది.బాబాకు మేము ఏ పదార్ధం తిన్నా,కాఫీ,టీ అయినా సరే ఉదయం బాబాకి పెట్టాకే మేము తింటాము.
ఉదయం అయితే బాబాకి పాలు పెట్టాక, కాఫీ కూడా పెడతాము.
ఆ క్రమంలో నాకు 4సంవత్సరాల క్రితం ఒకరోజు తెల్లవారుఝామున ఒక స్వప్నం వచ్చింది కానీ అది మేము ఉండే ఇల్లు కాకుండా మేము వేరే చోట ఉన్నాము. అది చాల చిన్న రేకుల ఇల్లు.
“శరత్ బాబూజీ గారు(గురువుగారు)మా ఇంటికి వచ్చారు. నేను హడావిడిగా కిచెన్ లోకి వెళ్లి, మా ఇంట్లో వాళ్ళతో గురువుగారు కాఫీ అడిగారు తొందరగా కలపండి అంటున్నాను. కాఫీ కలుపుతుంటే గురువుగారు కిచెన్ లోకి వచ్చి నిలబడి చూస్తున్నారు. సాధారణంగా నాన్నతో,నాతో ఏదో మాట్లాడారు.”
ఈలోగా గుమ్మంలో ఎవరో వచ్చినట్లు అలికిడి వినపడి బయటకు వెళ్లి చూసేసరికి
“ బాబా తెల్లటి కఫ్ని వేసుకుని నిలబడి ఉన్నారు. బాబా ఏమి నాతో మాట్లాడలేదు. కానీ బాబా ముఖం నాకు చాలా అస్పష్టంగ ఉంది. కనపడలేదు.కానీ మిగతా శరీరం చాలస్పష్టంగా కనపడింది ఆయన చేతిలో లోటా పట్టుకుని నన్ను కాఫీ ఇవ్వమని అడుగుతున్నట్లు,ఆయన చేతిలోని లోటాను పైకి అన్నారు.”
నేను బాబా మా ఇంటికి స్వయంగా వచ్చారు అని విపరీతంగా సంతోష పడుతున్నాను.
కనురెప్పపాటు కాలంలోనే బాబా దూరంగా వెళ్లారు.
నేను బాబా అని పిలిచాను. బాబావెనక్కి తిరిగి నవ్వారు.
అప్పుడు నాకు బాబా మొహం చాల స్పష్టంగా కనపడింది.
బాబా వెళ్లిపోతున్నారు అని పరుగెత్తుకుంటూ కిచెన్ లోకి వెళ్లి బాబాకోసం తాగటానికి కాఫీ తీసుకుని వెళ్లి లోటా లో పోసాను. అంటే టక్కున మెలుకవ వచ్చింది.
నేను ఆ కలకు చాలా చాలా సంతోషించాను. ఎందుకంటే నేను దానిని కలగా అనుకోను.
బాబానే స్వయంగా వచ్చి స్వీకరించారు అని నా నమ్మకం. గురువుగారికి కాఫీ అంటే చాలా ఇష్టం.ఇది గురుబంధువలకు తెల్సిన విషయమే.
ఎందుకంటే మనలాంటి సాధారణమైనా భక్తులు పెట్టేది బాబా స్వీకరిస్తారా అని నాకు చిన్న సందేహం ఉండేది.
కానీ బాబా
“శ్రద్ద భక్తులతో ఎవ్వరేని పత్రముగాని పుష్పముగాని ఫలముగాని లేదా నీరుగాని అర్పించినచో నేను గ్రహించెదను”
అని స్వప్నం ద్వారా నిరూపించారు. మేము పెట్టె నివేదనను బాబా, గురువుగారు స్వీకరిస్తున్నారని నాకు చాలా సంతోషం కలిగింది. సద్గురు సాయినాధార్పణమస్తు
సద్గురు సాయినాధార్పణమస్తు.
Latest Miracles:
- బాబా స్వప్నంలో మా ఇంటికి వచ్చి మేము ఇచ్చిన కాఫీని స్వీకరించారు–Audio
- “నాకు పెట్టకుండా మీరందరూ భుజించితిరా” అని బాబా గుర్తుచేయుట–Audio
- ” ఓ దత్త సాయి” నా బాబు రాహుల్ ను మీరే రక్షించాలి
- బాబా ఎంతోమందికి స్వప్నంలో దర్శనమిచ్చావు! నాకు కూడా స్వప్నంలో మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకున్న భక్తునికి బాబా ఇచ్చిన అనుభవము….Audio
- అయన మామూలు వాడు కాదు. బాబా యే అయివుంటాడు.—Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
One comment on “బాబా స్వప్నంలో మా ఇంటికి వచ్చి మేము ఇచ్చిన కాఫీని స్వీకరించారు-17”
Sreenivas Murthy
April 13, 2018 at 6:47 amSai Baba…Sai Baba…Sai Baba…Miracle chala Bagundi Tejaswini.