“మనిషిగా మనోధర్మాలను గుర్తించి మసులుకో , ఆ ధర్మమే నీకు శ్రీరామరక్ష” అని బాబావారి ప్రబోధాలలో వినిపించాయి..



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

Author:Kota Prakasam Garu

ఆయన ప్రబోదాలే కర్మయోగం అనుసరించి , ఆదరించడమే నిండునూరేళ్ళ ఆయనమహాసమాధికి అర్పించగల దివ్య నీరాజనం.
********

సముద్రపు వొడ్డున ఉండే నత్తగుల్లలు అందరి కంటికి కనిపిస్తాయి ..

వలవిసరడం నేర్చుకుని చేపలు పట్టడం నేర్చుకొన్నాడు మనిషి ..

సముద్ర గర్భంలో రత్నాలు , ముత్యాల రాసులున్నాయని , సైన్సు అంటే తెలియని రోజుల్లోనే , ఎన్నో వేల సంవత్సరాల క్రిందట , ఏ పరికరాల సహాయం లేకుండానే , యోగులు వెల్లడించి , సముద్రాన్ని రత్న గర్భ అన్నారు ..

పుస్తకాల్లో చదవటం , వింటం , అది మాటలవరకే పరిమితమైపోయిందితప్ప , చొచ్చుకొని సాహసంతో సముద్ర అంతర్భాగంలో రత్నాల రాశిని కొల్లగొట్టిన వాళ్లు చరిత్రలో ఎవరూ కనబడరు ..

చేతికందనంతవరకు , అది అనుభవానికి రానంత వరకూ , ఏమోలే వుండవొచ్చని నమ్మేవాళ్ళు అతి స్వల్పంగా ఉంటారు , రుజువుకానిదే నమ్మనివాళ్ళు కోకొల్లలుగా ఉంటారు ..

సైన్సు వృద్ధిచెంది , అంతరిక్ష పరిశోధనల్లో , భూమిపొరల్లో ఖనిజ సంపద మొదలూ సముద్రపు లోతులో దాగిన ఆణిముత్యాలవరకు ఛాయా చిత్రాలను విడుదల చేసినపుడు , ప్రపంచం యావత్తూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది , రామరావణ యుద్దానికి ముందు , వారధి నిర్మాణమయిందని రామాయణంలో చెపితే , అదో కట్టుకదన్నారు , నాసా వారు ప్రకటిస్తే నిజమంటున్నారు ….

ఉన్నవి ఒక్కొక్కటి పరిశోధలో వెల్లడయ్యేకొద్దీ ,లోకం నివ్వెరపోయిచూస్తోంది కానీ , సముద్రంలో ముత్యాలైనా , భూమిలో ఖనిజాలైనా సృష్టి ఆరంభం నుండి ఉన్నవే ..

పరిశొధనలో ఫలితాన్ని సాధించినవాడికి తెగపొగుడుచు పథకాన్నిచ్చి గౌరవించే లోకం , సృష్టి ఆవిర్భావంలోనే వీటన్నిటినీ సమకూర్చిన లోకేశ్వరుని ప్రతిభను అర్థంచేసుకొనే సంఖ్య తక్కువలో తక్కువనే చెప్పొచ్చు ..

దర్మం నాలుగు కాళ్ళమీద నడుస్తున్న త్రేతాయుగంలో, అణువులో పరమాణువులా అధర్మం తలెత్తితే , ధర్మరక్షణకు ఆడది అనికూడా ఉపేక్షించకుండా రాక్షసిమీద బాణాన్నిసంధించాడు రాముఁడు …

అధర్మం కాస్త పెచ్చుమీరుతున్న దశలో కౌరవాదులు ధర్మవిరుధ్ధంగా ప్రవర్తించినా , నెను , నావారనే మొహం ఆడ్డమొచ్చి గాండీవం నేలకొరిగితే కర్మయోగాన్ని ఉపదేశించి ధర్మ ప్రభోధంచేయవలసివొచ్చింది పరమాత్ముడికి …

అధర్మం అవదులు దాటుతూ , దర్మం భిక్కుభిక్కుమనే కాలానికి , మనిషికి తన మనోధర్మాన్ని గుర్తించి ,కర్తర్వోముఖులను చేసేందుకు ప్రకటమైంది రమణ భగవాన్ మొదలూ బాబాలాంటి సద్గురువులెందరో ..

పసితనంలో అమ్మ నూరిపోసింది “బడికి వెళ్లేముందు , దేవుడి దణ్ణం పెట్టుకో , చదువు బాగా వొస్తుందని “.

కాస్త ఊహ తెలిసాక ఆచార్యుడు చెప్పాడు “కష్టపడి బాగాచదువు , బాగ వొంటబట్టి తరగతిలో మొదటి ర్యాన్కు సంపాదించగలవు” అని ..

అవగాహన మొదలై , సచ్చరిత్ర చదవటం మొదలయ్యాక , “మనిషిగా మనోధర్మాలను గుర్తించి మసులుకో , ఆ ధర్మమే నీకు శ్రీరామరక్ష ” అని బాబా ప్రబోధాలలో వినిపించాయి ..

అర్థం కానంతవరకూ అన్నీ సంశయాలే , అనుభవానికొస్తే మనసు పరవశానికి లోనౌతుంది ..

బాబా అంటే భక్తీ , ప్రేమా , గౌరవాలు ఉన్నా , ఆయన ఆశించిన మార్గంలో , ఆయన ప్రబోధాలను ఆచరించే ప్రయత్నం , నిండు నూరేళ్ల ఆయన మహాసమాధికి సమర్పించగల దివ్య నీరాజనం అని పెద్దలమాట ..

సద్గురువారం , సాయి దాసులకు అందరికి శుభంకలగాలని కొరుకొంటూ

జయ్ గురు సాయి సమర్థ
*********

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles