బాబా పాదపద్మముల ఛాయాచిత్రాన్ని పంచుట.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

బాబా వారి పాదపద్మముల సేవించు భాగ్యము లభించిన సాయినాథ్.

ఒకసారి షిర్డీ లో బాబా వారి సన్నిధిలో వారి పాదపద్మముల ఛాయాచిత్రాన్నితీసుకొనే భాగ్యాన్ని కలిగించి, దానిని ప్రచారము చేయవలిసినిదిగా నాలో ప్రేరణ కలిగించి ఆదేశించినట్లు అనిపించింది.

వారి ఆదేశాన్ని శిరసావహించి ఆ చిత్రపటాలను ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సాయిమందిరాలకు, భక్తుల గృహాలకు చేర్చాలని ప్రయత్నం సాగిస్తున్నాను.

బాబా దివ్య ఆశీస్సులతో వివిధ సైజులలో కొన్నివేల ఛాయాచిత్రాలను తయారు చేసి, మందిరాలు, భక్తులకు మన రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకే కాకా విదేశాలకు కూడా పంపడం  జరిగింది.

శ్రీ సాయి బాబా ఆశీస్సులతో ఒక ట్రస్ట్ ఏర్పాటుచేసి కొంత మంది పేదలకు ప్రతి దినము అన్నదాన  కార్యక్రమాన్ని గత 4 సం|| నుండి నిర్వహిస్తున్ననము.

సాయికోటి నామ స్తూపము ఏర్పాటు తలంపు.

శ్రీ సాయి బాబా దివ్య ఆశీస్సులులతో వారి కోటి నామ లిఖితము త్వరలో పూర్తికానుంది.

ఈ కోటి నామము లిఖిత పుస్తకములను త్వరలోనే అనంతపురం జిల్లా మడకశిర బాబా మందిరములో పదిల పరచి శ్రీ సాయి భక్తులతో, బంధువులతో ఆత్మీయలతో కలిసి పండుగ చేయ సంకల్పించిన ఒక సామాన్యుడనైనా నాకు, వారి సేవను ప్రసాదించినందుకు ఆనంద భాష్పములతో వారి పాదపద్మములను అభిషేకిస్తూ మనసా, శిరసా  నమః సుమాంజలులు సమర్పిస్తున్నాను.

మనందరికీ శ్రీ సాయినాథుని దివ్యాశీస్సులు ప్రసాదరూపముగా సాయి నామ రుచిని లభింపచేయమని శ్రీస్వామివార్ని ప్రార్థిస్తున్నానని శ్రీ సాయినాథ్ గారు ముగించారు.

సాయినాథ్ గారు

అనంతపురం జిల్లా, ధర్మవరం పట్టణం.

సంపాదకీయం: సద్గురులీల

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా          …            సాయి బాబా.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబా పాదపద్మముల ఛాయాచిత్రాన్ని పంచుట.

entha sai seva chese meeru dhanyulu…meeku paadhabhivandhanamulu sainaath gaaru.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles