Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా తనకు పెట్టిన నమస్కారములలోని తేడాను గోవిందస్వామి నోటిద్వారానే చెప్పించారు.
అరవిందాశ్రమ దివ్య జనని కూడా నమస్కారంపై స్పందించింది. “ఎవరైనా ఒకసారి హృదయపూర్వకంగా నాకు నమస్కరించిన వెంటనే వారి మేడలో నా బంగారు సంకెల ఒకటి పడిందని తెలుసుకోండి.
ఈ జన్మకి, జన్మ జన్మలకీ వారు నావారవుతారు. వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటాను” అన్నారు దివ్య జనని.
దివ్య జనని (The Mother) పూర్వనామం మీరా అల్ ఫస్సా (Mira Alfassa). ఆమె 1878 ఫిబ్రవరి 21న ప్యారిస్ నగరంలో జన్మించింది.
ఆమెకు బాల్యంనుండి ఆధ్యాత్మిక అనుభూతులు, అనుభవాలు కలిగేవి. 13, 14 ఏండ్ల వయసులో ఒక నల్లని వ్యక్తి దర్శనమిస్తుండేవాడు.
“కృష్ణా” అని ఆమె సంబోధించేది. భారత దేశంలో శ్రీ అరవిందులను దర్శించిన ఉత్తర క్షణంలోనే ఆయనే తనకు దర్శనమిచ్చే దివ్య పురుషులని, “కృష్ణా” అని సంబోధించేది ఆయననే అని మీరా గ్రహించింది.
అటు పదార్దానికి, ఇటు పరమార్దానికి ఆమె సువర్ణ వారధిగా నిలచింది.
అరవిందులతో కలసి పని చేసింది. వీరిద్దరి కలయిక అపూర్వం, అద్భుతమైన దైవ ఘటన.
మదర్ (దివ్య జనని – మీరా) ఇలా అంటారు “వారు (అరవిందులు) లేనిదే నాకు ఉనికి లేదు. నేను లేనిదే వారు అభివ్యక్తం కాలేరు” అని.
ఆమె యోగ సాధననే కాదు, శరీరం ఆరోగ్యకరంగా, లోపరహితంగా ఉండాలన్నారు.
ఆమె ఏర్పాటు చేసిన భోజన పదార్థములను కేవలం భోజన పదార్థములుగా కాక దాని వెనుక ఒక మహోన్నతమైన శక్తి, ఇమిడి ఉన్నదని గ్రహించిన వారికి ఆ శక్తి పని చేస్తుంది.
ఆమెను విమర్శించిన వారి మనస్సులను జయించింది – ప్రేమ ద్వారా.
అమ్మ అంటే ఎలా ఉండాలి? అమ్మ అంటే ఏమిటి? అనే దానిని ఆమె తన నడవడితో చూపారు.
మాతృశ్రీ జిల్లెళ్ళమూడి అమ్మలాగ అమ్మ మాట్లాడే ప్రతి మాటలో, అంతరార్థం గోచరించేది. ఒక పరమార్థముండేది.
ఆమె మాటలకు మంచి గంధపు వాసన ఉన్నది. చెరకు రసం తియ్యదనం ఉంది.
ఉపాసనీ మహారాజ్ అనంతరం సాకోరీ ఆశ్రమ బాధ్యతలను, గురుత్వాన్ని చేపట్టిన గోదావరి మాత వలే ఆమె ప్రవర్తించింది.
శ్రీమాత రక్షణలో ఉన్నవారిని, జీవితంలో ఆపదలు, దుఃఖం స్పర్శించవు అని చెప్పలేరు కానీ వాటిని ఆ భక్తులు తట్టుకోగల శక్తిని శ్రీమాత ప్రసాదిస్తుంది.
నేడు ఫిబ్రవరి 21, మాతాజీ జన్మదినం, మాతాజీ సాన్నిధ్యం లభ్యం కావాలని కోరుకుందాం!
“ఎంత వీలైతే అంత తక్కువగా మాట్లాడు” అనే ఆమె మాటను పాటిద్దాం!
“ఓం మాత్రశ్రీ అరవింద “కృష్ణా”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గురుపాదమునుంచ నేను …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 17
- “నేను అమ్మను…”… మహనీయులు – 2020… జూలై 21
- మనసులోని కోరిక …. మహనీయులు – 2020… మార్చి 21
- సద్గురు సాయి మందిర పునాది….. సాయి@366 ఫిబ్రవరి 21….Audio
- భక్తురాలికి బాబా వారు ప్రసాదించిన దివ్య పూజ అనుభవములు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments